విడాకులు తీసుకోవడం అత్యంత విషాదకరం: లోపెజ్
విడాకులు తీసుకోవడం అత్యంత విషాదకరం: లోపెజ్
Published Thu, May 8 2014 3:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
లాస్ ఎంజెలెస్: తన భర్త మార్క్ ఆంథోని విడిపోవడమే జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ అన్నారు. 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆంథోని నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం లోపెజ్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారింది. ఎన్నడూ లేనంతగా జీవితంలో విషాదం నిండుకుందన్నారు. కొద్దికాలం పాటు ఆఘటన గురించి తలచుకుని బాధపడ్డాను. ప్రస్తుతం రియలైజ్ అవుతున్నాను. జీవితంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇక జీవితాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలనుకుంటున్నాను లోపెజ్ అన్నారు. గత రెండేళ్ల నుంచి డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపేజ్ డేటింగ్ చేస్తోంది.
Advertisement
Advertisement