
జెన్నీఫర్ లోపెజ్ - మార్క్ ఆంటోనీ
లాస్ ఏంజిల్స్: ప్రముఖ గాయని జెన్నీఫర్ లోపెజ్ - మార్క్ ఆంటోనీలకు విడాకులు ఖరారయ్యాయి. వారిద్దరూ విడిపోయిన మూడు సంవత్సరాల తరువాత విడాకులు ఖరారు చేశారు. లోపెజ్ - మార్క్ జంటకు ఆరు సంవత్సరాల వయసు గల కవలపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ లోపెజ్ సంరక్షణలో ఉంటారు. నెలలో ఒక వారం రోజులపాటు మార్క్కు పిల్లలతో గడిపే అవకాశం ఉంటుంది.
జెన్నిఫర్ లోపెజ్ - మార్క్ ఆంటోనీలు 2011 జులైలో విడిపోయారు. 2012 ఏప్రిల్లో ఆంటోనీ విడాకుల కోసం దరఖాస్తు చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత విడాకులు మంజూరయ్యాయి. దీంతో వారి సంబంధానికి తెరపడింది.