లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?  | Isha Ambani's LA Home Has Been Sold To American Singer JLO | Sakshi
Sakshi News home page

లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? 

Published Fri, Mar 29 2024 12:41 PM | Last Updated on Fri, Mar 29 2024 1:30 PM

Isha Ambani LA Home Has Been Sold To American Singer JLO - Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేష్, నీతా ‌అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్‌ రీటైల్‌ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి  ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్‌ మాత్రం హాట్‌ టాపిక్‌గా  నిలిచింది. 

ఇషా-ఆనంద్ పిరమల్ లాస్‌ ఎంజేల్స్‌లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్‌ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్‌ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్‌ పేజీ నివేదించింది.

కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే  ఈ ఇల్లు  విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement