రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' లాస్ ఏంజిల్స్‌లోని తన విలాసవంతమైన భవనాన్ని విక్రయించింది. దీనిని హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశారు. ఈ భవనం వివరాలు, ఇంతకు విక్రయించారు అనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.
తండ్రిలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ప్రసిద్ధి చెందిన ఇషా అంబానీకి అమెరికాలో (లాస్ ఏంజిల్స్) సుమారు 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఓ బంగ్లా ఉంది. పది సంవత్సరాల క్రితమే ఇషా దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇంట్లో ఆమె ఉన్న రోజులు చాలా తక్కువనే తెలుస్తోంది.
ఇషా అంబానీ గర్భంతో ఉన్నప్పుడు ఇదే భవనంలో ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో నీతా అంబానీ కూడా ఈ భవనంలోనే ఉన్నారు. ఆ తరువాత అక్కడ నుంచి వచ్చేసారు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ కపుల్ 'జెన్నిఫర్ లోపెజ్ & బెన్ అఫ్లెక్' దీనిని 508 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
ఇషా అంబానీ విలాసవంతమైన భవనంలో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియా, పికెల్ బాల్ కోర్టు, స్పా మొదలైన సకల సావుకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాన్ని హాలీవుడ్ జంట సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment