Ben Affleck
-
ఖరీదైన బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ: ఎవరు కొన్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' లాస్ ఏంజిల్స్‌లోని తన విలాసవంతమైన భవనాన్ని విక్రయించింది. దీనిని హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశారు. ఈ భవనం వివరాలు, ఇంతకు విక్రయించారు అనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.తండ్రిలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ప్రసిద్ధి చెందిన ఇషా అంబానీకి అమెరికాలో (లాస్ ఏంజిల్స్) సుమారు 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఓ బంగ్లా ఉంది. పది సంవత్సరాల క్రితమే ఇషా దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇంట్లో ఆమె ఉన్న రోజులు చాలా తక్కువనే తెలుస్తోంది.ఇషా అంబానీ గర్భంతో ఉన్నప్పుడు ఇదే భవనంలో ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో నీతా అంబానీ కూడా ఈ భవనంలోనే ఉన్నారు. ఆ తరువాత అక్కడ నుంచి వచ్చేసారు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ కపుల్ 'జెన్నిఫర్ లోపెజ్ & బెన్ అఫ్లెక్' దీనిని 508 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇషా అంబానీ విలాసవంతమైన భవనంలో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియా, పికెల్ బాల్ కోర్టు, స్పా మొదలైన సకల సావుకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాన్ని హాలీవుడ్ జంట సొంతం చేసుకుంది. -
తన పిల్లల ముందే నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నారు. అదేంటి, మళ్లీ పెళ్లేంటి? అనుకుంటున్నారా? అవును, జూలైలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ దంపతులు తాజాగా అందరి సమక్షంలో మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు. శనివారం జార్జియాలోని బెన్ నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరగడానికి ఒకరోజు ముందు అతడి తల్లి క్రిస్ యానే ఇంట్లో కిందపడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేరించగా వైద్యులు చికిత్స చేసిన అనంతరం తనను వీల్‌చైర్‌లో డిశ్చార్జ్ చేశారు. అదే స్థితిలో పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించింది. కాగా 2001లో గిగ్లి సినిమా షూటింగ్ సెట్స్‌లో బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ మధ్య ప్రేమ పుట్టగా ఆ మరుసటి ఏడాదే నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ పెళ్లి మాత్రం వాయిదా వేశారు. చివరికి 2004లో పెళ్లి చేసుకోవట్లేదని ప్రకటించారు. 2021లో వీరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించడంతో ఈసారి దాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇక ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలతో పాటు జెన్నిఫర్ లోపెజ్ మాజీ భర్త, వారి సంతానం, అలాగే బెన్ మాజీ భార్య, వారి పిల్లలు హాజరయ్యారు. ఇకపోతే హీరో బెన్ అఫ్లెక్ మొదటి భార్య పేరు జెన్నిఫర్ గార్నర్. వీరికి వయొలెట్, సెరఫినా, సామ్యూల్.. అని ముగ్గురు పిల్లలు సంతానం. 2018లో గార్నర్‌తో తెగదెంపులు చేసుకున్న బెన్ తర్వాత లిండ్సే షూకస్, అనడే ఆర్మస్లతో డేటింగ్ చేశాడు. గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ విషయానికి వస్తే ఈమె గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకోగా 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. 2004లో సింగర్ మార్క్ ఆంటోనీని పెళ్లాడింది. వీరికి 2008లో ఎమ్మీ, మాక్స్ అని కవలలు పుట్టారు. ఆ తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్, షాక్‌లో ఫ్యాన్స్ హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో -
నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
అమెరికన్ సింగర్, నటి జెన్నీఫర్ లోపెజ్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్ అఫ్లెక్, జెన్నీఫర్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు కొద్ది మంది సన్నిహితులు మధ్య జూలై 16న లాస్ వెగాస్‌లో సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి జరిగినట్లు స్టానిక మీడియా పేర్కొంది. దీంతో ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ జంట కొత్త ఇంటిని వేతికే పనిలో పడ్డారని, ఆఖరికి బెవర్లీ హిల్స్‌లో ఇల్లు కొనుగొనుల చేశారని సమాచారం. కాగా 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్ అఫ్లెక్స్ను 4వ వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి.. హీరోహీరోయిన్ల క్రేజీ లవ్‌స్టోరీ
హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జెన్నిఫర్ తన వెబ్సైట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సైతం పోస్ట్ చేసింది. కాగా జెన్నిఫర్, అఫ్లెక్ గతంలో 2002లో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండేళ్లు బాగానే కలిసున్న వీళ్లిద్దరూ అనూహ్యంగా తమ బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ విడిపోయారు. అనంతరం జెన్నిఫర్.. మార్క్ ఆంథొనీని పెళ్లాడగా, అఫ్లెక్.. జెన్నిఫర్ గార్నర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్ల వైవాహిక జీవితాలు కూడా సవ్యంగా సాగలేవు. దీంతో ఈ రెండు ప్రేమజంటలు గతేడాది విడాకులు తీసుకున్నాయి. విడాకుల తర్వాత ఒంటరైన వాళ్లిద్దరూ మరోసారి దగ్గరయ్యారు. గతేడాది నుంచి జెన్నిఫర్, బెన్ అఫ్లెక్‌లు రిలేషన్లో ఉన్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కలిసి విహారయాత్రలకు వెళ్లడం, వర్కవుట్స్ మధ్యలో ఇద్దరూ ముద్దులాటలో మునగడం, రెడ్ కార్పెట్ మీద కలిసే దర్శనమివ్వడం వంటి చర్యలతో అవును, తామిద్దరం మళ్లీ ప్రేమలో పడ్డామంటూ చెప్పకనే చెప్పారు. జెన్నిఫర్ లోపెజ్ బర్త్‌డే రోజు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా! తాజాగా రెండోసారి నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన ఈ జంట ఈసారైనా పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి! కాగా హీరోయిన్ జెన్నిఫర్ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! గతేడాది ఆమె 'లో బ్యూటీ' పేరిట సౌందర్య ఉత్పత్తులను పరిచయం చేసింది. జెన్నిఫర్ చివరగా 'మ్యారీ మీ' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'షాట్‌గన్ వెడ్డింగ్', 'ద మదర్' చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) చదవండి: Will Smith: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు మాయం -
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
వికీపీడియా హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!
ప్రముఖ వెబ్సైట్ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్ చేస్తుంటే జర్మన్ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) Has Wikipedia been hacked? I'm opening new tabs and they're coming up with swastikas / Nazi flags??? pic.twitter.com/i0498octaZ — Ben Travis (@BenSTravis) August 16, 2021 -
ప్రియుడితో నటి బ్రేకప్: సోషల్ మీడియాకు గుడ్‌బై!
హాలీవుడ్ లవ్ బర్డ్స్ బెన్ అఫ్లెక్- అన డె అర్మాస్ ఈ మధ్యే ప్రేమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకు అన డె సోషల్ మీడియాకే గుడ్‌బై చెప్తూ ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో అన డె అభిమానులు విచారంలో మునిగిపోయారు. కాగా "డీప్ వాటర్" సినిమా షూటింగ్ సమయంలో బెన్, అన డె ప్రేమలో పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లోనే ప్రేమ విషయాన్ని అన డె అధికారికంగా ధృవీకరించింది. అతడితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. తన క్వారంటైన్ సమయాన్ని కూడా లాస్ ఏంజెల్స్‌లోని బెన్ నివాసంలో అతడి పిల్లలతో గడిపింది. కానీ ఏడాది తిరిగేలోగా ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: ‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది: కేట్) బెన్ ఇప్పుడు అనతో డేటింగ్ చేయట్లేదని, వారి మధ్య బంధం బీటలు వారిందని వారి సన్నిహితులు మీడియాకు తెలిపారు. బెన్ తన పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, కానీ అన డె లాస్ ఏంజెల్స్‌కు రావాలనుకోవట్లేదని మీడియాకు తెలిపారు. విడిపోయినప్పటికీ వారు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆ మధ్య బెన్ అఫ్లెక్ ఇంట్లో నుంచి అన డె ఫొటోలను సిబ్బంది చెత్త డబ్బాలో పారేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సదరు నటి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. (చదవండి: ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!) A life-sized cardboard cutout of Ana de Armas from inside Ben Affleck’s residence was seen being thrown out into a trash can. (January 18, 2021) pic.twitter.com/4bxxDC97WZ — Ana de Armas Updates (@ArmasUpdates) January 19, 2021 -
మరి నువ్వు ఆమెను టచ్ చెయ్యలేదా?
సాక్షి : హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్(45)కు సోషల్ మీడియాలో ఊహించని పరిణామం ఎదురైంది. నిర్మాత దిగ్గజం హార్వే వెయిన్‌స్టన్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో బెన్ స్పందించగా.. అతనిపైనా సెటైర్లు పడ్డాయి. గతంలో ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించిన తీరును గుర్తు చేస్తూ బెన్‌పై ఓ యువతి ట్వీట్ల దాడి చేసింది. సుమారు పదేళ్ల క్రితం బెన్ .. ఎంటీవీ ఛానెల్ టోటల్ రిక్వెస్ట్ లైవ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. నటి, ఎంటీవీ మాజీ యాంకర్ హిల్లరీ బర్టన్ తో కలిసి బెన్ ఆ షో నిర్వహించాడు. మైక్‌లో మాట్లాడుతూ ఉండగానే... ఆమె ఎడమ వక్షోజంపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా... పలు ఇంటర్వ్యూల్లో బర్టన్ ఆ వ్యవహారాన్ని తిరగదోడినట్లయ్యింది. అయినా బెన్ మాత్రం ఆ టాపిక్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇక హర్వే వెయిస్టన్ వ్యవహారాన్ని ఖండిస్తూ బెన్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ వేశాడు. దీనికి స్పందించిన ఓ యువతి ‘మరి గతంలో నువ్వు చేసిందేంటి? మరిచిపోయావా? అంటూ ప్రశ్నించగా.. బెన్ తానేం మరిచిపోలేదంటూ సమాధానమిచ్చాడు. పైగా తాను తప్పు చేసినట్లు అంగీకరిస్తూ.. పదేళ్ల తర్వాత నటి హిలెరి బర్టన్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఓ ట్వీట్ చేశాడు. ఇక ఆ యువతి చేసిన ట్వీట్ పై నటి హిలెరి కూడా స్పందించింది. తన తరపున ప్రశ్నించిన యువతిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అప్పటి వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు కూడా. 1997లో వచ్చిన బెన్-హర్వే వెయిన్‌స్టన్ కాంబోలో వచ్చిన గుడ్ విల్ హంటింగ్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వీరద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా ది న్యూయార్క్ టైమ్స్ మరియు ది న్యూయార్కర్ సంచికలు హర్వే లైంగిక వేధింపుల పర్వంపై సాక్ష్యాలతో సహా వివరంగా కథనాలు రాయటంతో.. అంతా సోషల్ మీడియాలో హర్వేను దుయ్యబడుతున్నారు. I acted inappropriately toward Ms. Burton and I sincerely apologize — Ben Affleck (@BenAffleck) October 11, 2017 -
భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్!
లాస్ ఏంజెలిస్: పదేళ్ల అన్యోన్య దాంపత్యం తర్వాత ఏడాది కాలం నుంచి భర్త, నటుడు అయిన బెన్ అఫ్లెక్ కు దూరంగా ఉంటున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్. వీరికి సంతానం వాయిలెట్, సెరాఫినా, శామ్యూల్ చిన్నారులు ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆ హీరోహీరోయిన్లు మరింత అన్యోన్యంగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అయితే భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ వేర్వేరుగా నివాసం ఉంటున్నా విడాకులు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నా ఒకరినొకరు ఏ విషయంలోనూ విమర్శించుకున్న దాఖలాలు లేవు. పైగా ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లులు కురిపించుకుంటూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఉండటం మీడియా కంట పడింది. అయితే జెన్నిఫర్ భావోద్వేగానికి లోనై ఏడుస్తున్నట్లు కనిపించింది. భర్తే తన హీరో అని భావించిన జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ తో కలిసి మళ్లీ జీవితాన్ని పంచుకోవాలని జెన్నిఫర్ నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ ఏదో ఓ మూల సందేహాలున్నా.. తాజాగా వీరిద్దరూ కలిసి తమ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడంతో ఈ హాలీవుడ్ జోడీ కొత్త జీవితం స్టార్ట్ చేశారని అందరూ కన్ఫార్మ్ అయిపోయారు. -
ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్
లాస్ ఏంజెలిస్: భర్త నుంచి విడాకులు తీసుకుని భౌతికంగా దూరమైనా హీరోయిన్ మనసు ఆయననే కోరుకుంటుంది. అందుకే మాజీ భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్ తో కలసి జీవించాలని తాపత్రయపడుతోంది హాలీవుడ్ అందం జెన్నిఫర్ గార్నర్. పదేళ్ల వివాహబంధం తరువాత గతేడాది జూన్ నెలలో బెన్ అఫ్లెక్ తో విడాకులు తీసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. వాయిలెట్, సెరాఫినా, సాయ్యూల్ చిన్నారులు ఉన్నారు. అయితే తమ పిల్లల కోసమైనా భర్తతో కలసి ఉండాలని ఆమె భావిస్తోంది. 'జస్టిస్ లీగ్' షూటింగ్ కోసం లండన్ వెళ్తున్న భర్త అఫ్లెక్ తో కలసి ప్రయాణం చేసిందని వార్తలు వచ్చాయి. గతంలో కంటే ఇప్పుడు వారిద్దరూ మరింత ప్రేమగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. లండన్ ప్రయాణంలో ఇద్దరు కలసి ఉండటం.. వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలుస్తోంది. అయితే మీడియాతో మాత్రం తన భర్తతో జరుపుతున్న సంప్రదింపులపై మాట్లాడేందుకు జెన్నిఫర్ ఇష్టపడటం లేదు. కేవలం తన సన్నిహితులు, బంధువుల వద్ద మాత్రమే అఫ్లెక్ తో కలిసి ఉండాలని అందుకే అతనితో మళ్లీ క్లోజ్ గా ఉంటున్నట్లు చెబుతోందట. గతంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం బెన్ మార్చుకుని, అందువల్లనే హీరోయిన్ జెన్నిఫర్ తో సన్నిహితంగా ఉండాలని డిసైడ్ అయిపోయాడని ఆమెతో అతని ప్రవర్తనే చెప్పకనే చెబుతోంది. -
భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్‌కు..
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్‌కు మరోసారి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తన భర్త బెన్ అఫ్లెక్నుంచి విడిపోయిన తర్వాత తిరిగి ఆమె గౌరవపూర్వక కార్యక్రమాల్లోకి ప్రవేశించింది. తక్కువ ఆదాయంగల కుటుంబంలోని చిన్నారులకు సహాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా బేబే 2 బేబీ అనే పేరిట ఓ చారిటీ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా మొకాళ్లవరకు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి కళ్లు చెదిరే హొయలతో ఎర్రతివాచీపై నడకసాగించింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమె తన భర్త నుంచి విడిపోయింది.