భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్! | Garner gets emotional during meeting with her husband Affleck | Sakshi
Sakshi News home page

భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్!

Published Tue, Aug 30 2016 10:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్!

భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్!

లాస్ ఏంజెలిస్: పదేళ్ల అన్యోన్య దాంపత్యం తర్వాత ఏడాది కాలం నుంచి భర్త, నటుడు అయిన బెన్ అఫ్లెక్ కు దూరంగా ఉంటున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్. వీరికి సంతానం వాయిలెట్, సెరాఫినా, శామ్యూల్ చిన్నారులు ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆ హీరోహీరోయిన్లు మరింత అన్యోన్యంగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అయితే భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ వేర్వేరుగా నివాసం ఉంటున్నా విడాకులు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నా ఒకరినొకరు ఏ విషయంలోనూ విమర్శించుకున్న దాఖలాలు లేవు.

పైగా ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లులు కురిపించుకుంటూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఉండటం మీడియా కంట పడింది. అయితే జెన్నిఫర్ భావోద్వేగానికి లోనై ఏడుస్తున్నట్లు కనిపించింది. భర్తే తన హీరో అని భావించిన జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ తో కలిసి మళ్లీ జీవితాన్ని పంచుకోవాలని జెన్నిఫర్ నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ ఏదో ఓ మూల సందేహాలున్నా.. తాజాగా వీరిద్దరూ కలిసి తమ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడంతో ఈ హాలీవుడ్ జోడీ కొత్త జీవితం స్టార్ట్ చేశారని అందరూ కన్ఫార్మ్ అయిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement