ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్ | Jennifer Garner is open to reunion with husband Affleck | Sakshi
Sakshi News home page

ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్

Published Wed, May 18 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్

ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్

లాస్ ఏంజెలిస్: భర్త నుంచి విడాకులు తీసుకుని భౌతికంగా దూరమైనా హీరోయిన్ మనసు ఆయననే కోరుకుంటుంది. అందుకే మాజీ భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్ తో కలసి జీవించాలని తాపత్రయపడుతోంది హాలీవుడ్ అందం జెన్నిఫర్ గార్నర్. పదేళ్ల వివాహబంధం తరువాత గతేడాది జూన్ నెలలో బెన్ అఫ్లెక్ తో విడాకులు తీసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. వాయిలెట్, సెరాఫినా, సాయ్యూల్ చిన్నారులు ఉన్నారు. అయితే తమ పిల్లల కోసమైనా భర్తతో కలసి ఉండాలని ఆమె భావిస్తోంది. 'జస్టిస్ లీగ్' షూటింగ్ కోసం లండన్ వెళ్తున్న భర్త అఫ్లెక్ తో కలసి ప్రయాణం చేసిందని వార్తలు వచ్చాయి.

గతంలో కంటే ఇప్పుడు వారిద్దరూ మరింత ప్రేమగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. లండన్ ప్రయాణంలో ఇద్దరు కలసి ఉండటం.. వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలుస్తోంది. అయితే మీడియాతో మాత్రం తన భర్తతో జరుపుతున్న సంప్రదింపులపై మాట్లాడేందుకు జెన్నిఫర్ ఇష్టపడటం లేదు. కేవలం తన సన్నిహితులు, బంధువుల వద్ద మాత్రమే అఫ్లెక్ తో కలిసి ఉండాలని అందుకే అతనితో మళ్లీ క్లోజ్ గా ఉంటున్నట్లు చెబుతోందట. గతంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం బెన్ మార్చుకుని, అందువల్లనే హీరోయిన్ జెన్నిఫర్ తో సన్నిహితంగా ఉండాలని డిసైడ్ అయిపోయాడని ఆమెతో అతని ప్రవర్తనే చెప్పకనే చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement