Jennifer Garner
-
భర్తను మళ్లీ కలిసి కన్నీళ్లు పెట్టిన హీరోయిన్!
లాస్ ఏంజెలిస్: పదేళ్ల అన్యోన్య దాంపత్యం తర్వాత ఏడాది కాలం నుంచి భర్త, నటుడు అయిన బెన్ అఫ్లెక్ కు దూరంగా ఉంటున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్. వీరికి సంతానం వాయిలెట్, సెరాఫినా, శామ్యూల్ చిన్నారులు ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆ హీరోహీరోయిన్లు మరింత అన్యోన్యంగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అయితే భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ వేర్వేరుగా నివాసం ఉంటున్నా విడాకులు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నా ఒకరినొకరు ఏ విషయంలోనూ విమర్శించుకున్న దాఖలాలు లేవు. పైగా ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లులు కురిపించుకుంటూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఉండటం మీడియా కంట పడింది. అయితే జెన్నిఫర్ భావోద్వేగానికి లోనై ఏడుస్తున్నట్లు కనిపించింది. భర్తే తన హీరో అని భావించిన జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ తో కలిసి మళ్లీ జీవితాన్ని పంచుకోవాలని జెన్నిఫర్ నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ ఏదో ఓ మూల సందేహాలున్నా.. తాజాగా వీరిద్దరూ కలిసి తమ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడంతో ఈ హాలీవుడ్ జోడీ కొత్త జీవితం స్టార్ట్ చేశారని అందరూ కన్ఫార్మ్ అయిపోయారు. -
ఆయనతోనే జీవితం అంటున్న హీరోయిన్
లాస్ ఏంజెలిస్: భర్త నుంచి విడాకులు తీసుకుని భౌతికంగా దూరమైనా హీరోయిన్ మనసు ఆయననే కోరుకుంటుంది. అందుకే మాజీ భర్త, ఫిల్మ్ మేకర్ బెన్ అఫ్లెక్ తో కలసి జీవించాలని తాపత్రయపడుతోంది హాలీవుడ్ అందం జెన్నిఫర్ గార్నర్. పదేళ్ల వివాహబంధం తరువాత గతేడాది జూన్ నెలలో బెన్ అఫ్లెక్ తో విడాకులు తీసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. వాయిలెట్, సెరాఫినా, సాయ్యూల్ చిన్నారులు ఉన్నారు. అయితే తమ పిల్లల కోసమైనా భర్తతో కలసి ఉండాలని ఆమె భావిస్తోంది. 'జస్టిస్ లీగ్' షూటింగ్ కోసం లండన్ వెళ్తున్న భర్త అఫ్లెక్ తో కలసి ప్రయాణం చేసిందని వార్తలు వచ్చాయి. గతంలో కంటే ఇప్పుడు వారిద్దరూ మరింత ప్రేమగా ఉంటున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. లండన్ ప్రయాణంలో ఇద్దరు కలసి ఉండటం.. వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలుస్తోంది. అయితే మీడియాతో మాత్రం తన భర్తతో జరుపుతున్న సంప్రదింపులపై మాట్లాడేందుకు జెన్నిఫర్ ఇష్టపడటం లేదు. కేవలం తన సన్నిహితులు, బంధువుల వద్ద మాత్రమే అఫ్లెక్ తో కలిసి ఉండాలని అందుకే అతనితో మళ్లీ క్లోజ్ గా ఉంటున్నట్లు చెబుతోందట. గతంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం బెన్ మార్చుకుని, అందువల్లనే హీరోయిన్ జెన్నిఫర్ తో సన్నిహితంగా ఉండాలని డిసైడ్ అయిపోయాడని ఆమెతో అతని ప్రవర్తనే చెప్పకనే చెబుతోంది.