Jennifer Lopez and Ben Affleck Confirm Engagement With Emotional Video on Her Website - Sakshi
Sakshi News home page

Jennifer Lopez - Ben Affleck: రెండేళ్లు సహజీవనం..బ్రేకప్‌..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి!

Published Sat, Apr 9 2022 4:08 PM | Last Updated on Sat, Apr 9 2022 4:42 PM

Jennifer Lopez and Ben Affleck Confirm Engagement With Emotional Video on Her Website - Sakshi

హాలీవుడ్‌ తారలు జెన్నిఫర్‌ లోపెజ్‌, బెన్‌ అఫ్లెక్‌ రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జెన్నిఫర్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సైతం పోస్ట్‌ చేసింది. కాగా జెన్నిఫర్‌, అఫ్లెక్‌ గతంలో 2002లో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండేళ్లు బాగానే కలిసున్న వీళ్లిద్దరూ అనూహ్యంగా తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడిపోయారు. అనంతరం జెన్నిఫర్‌.. మార్క్‌ ఆంథొనీని పెళ్లాడగా, అఫ్లెక్‌.. జెన్నిఫర్‌ గార్నర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్ల వైవాహిక జీవితాలు కూడా సవ్యంగా సాగలేవు. దీంతో ఈ రెండు ప్రేమజంటలు గతేడాది విడాకులు తీసుకున్నాయి. 

విడాకుల తర్వాత ఒంటరైన వాళ్లిద్దరూ మరోసారి దగ్గరయ్యారు. గతేడాది నుంచి జెన్నిఫర్‌, బెన్‌ అఫ్లెక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కలిసి విహారయాత్రలకు వెళ్లడం, వర్కవుట్స్‌ మధ్యలో ఇద్దరూ ముద్దులాటలో మునగడం, రెడ్‌ కార్పెట్‌ మీద కలిసే దర్శనమివ్వడం వంటి చర్యలతో అవును, తామిద్దరం మళ్లీ ప్రేమలో పడ్డామంటూ చెప్పకనే చెప్పారు. జెన్నిఫర్‌ లోపెజ్‌ బర్త్‌డే రోజు సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా! తాజాగా రెండోసారి నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు స్వీట్‌ షాకిచ్చిన ఈ జంట ఈసారైనా పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి!

కాగా హీరోయిన్‌ జెన్నిఫర్‌ సింగర్‌, డ్యాన్సర్‌ మాత్రమే కాదు ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా! గతేడాది ఆమె 'లో బ్యూటీ' పేరిట సౌందర్య ఉత్పత్తులను పరిచయం చేసింది. జెన్నిఫర్‌ చివరగా 'మ్యారీ మీ' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'షాట్‌గన్‌ వెడ్డింగ్‌', 'ద మదర్‌' చిత్రాలున్నాయి.

చదవండి: Will Smith: విల్‌ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో

సోనమ్‌ కపూర్‌ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు మాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement