సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా అలాంటి సినిమాలో! | Founder Of Isha Foundation Sadhguru Acted In Jennifer Lopez Film In Hollywood, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sadhguru Hollywood Entry Video: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ ‍లోపెజ్‌ సినిమాలో అలా!

Published Wed, Feb 21 2024 3:15 PM | Last Updated on Wed, Feb 21 2024 4:13 PM

Founder of Isha Foundation Sadhguru Acts In Jennifer Lopez Film In Hollywood - Sakshi

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ పరిచయం చేయాల్సిన పనిలేదు. తన ఫౌండేషన్‌ ద్వారా సేవ్ సాయిల్ పేరిట అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆయన సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం 'దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీ'లో నటి జెన్నిఫర్ లోపెజ్‌ నటించిన చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకు డేవ్‌ మేయర్స్‌ దర్శకత్వం వహించారు. 

ఇటీవలే ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించిన దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీలో బెన్ అఫ్లెక్, ట్రెవర్ నోహ్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, పోస్ట్ మలోన్, నీల్ డి గ్రాస్సే టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమాలో ఆయన  నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఈనెల 16 నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో పేరు తెచ్చుకున్న జగ్గీ వాసుదేవ్ ఈ సినిమాతో మరింత ఫేమస్ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement