మరి నువ్వు ఆమెను టచ్‌ చెయ్యలేదా? | Hollywood Actor Apologized for Groping Actor Decade Ago | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తన.. పదేళ్ల తర్వాత నటుడి సారీ

Published Thu, Oct 12 2017 12:42 PM | Last Updated on Thu, Oct 12 2017 12:42 PM

Hollywood Actor Apologized for Groping Actor Decade Ago

సాక్షి : హాలీవుడ్ నటుడు బెన్‌ అఫ్లెక్‌(45)కు సోషల్‌ మీడియాలో ఊహించని పరిణామం ఎదురైంది. నిర్మాత దిగ్గజం హార్వే వెయిన్‌స్టన్‌ లైంగిక ఆరోపణల నేపథ్యంలో బెన్‌ స్పందించగా.. అతనిపైనా సెటైర్లు పడ్డాయి. గతంలో ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించిన తీరును గుర్తు చేస్తూ బెన్‌పై ఓ యువతి ట్వీట్ల దాడి చేసింది.

సుమారు పదేళ్ల క్రితం బెన్‌ ..  ఎంటీవీ ఛానెల్‌ టోటల్‌ రిక్వెస్ట్ లైవ్‌ కార్యక్రమానికి హాజరయ్యాడు. నటి, ఎంటీవీ మాజీ యాంకర్‌ హిల్లరీ బర్టన్‌ తో కలిసి బెన్ ఆ షో నిర్వహించాడు. మైక్‌లో మాట్లాడుతూ ఉండగానే... ఆమె ఎడమ వక్షోజంపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా... పలు ఇంటర్వ్యూల్లో బర్టన్‌ ఆ వ్యవహారాన్ని తిరగదోడినట్లయ్యింది. అయినా బెన్‌ మాత్రం ఆ టాపిక్‌ గురించి ఎక్కడా మాట్లాడలేదు.

ఇక హర్వే వెయిస్టన్ వ్యవహారాన్ని ఖండిస్తూ బెన్ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ వేశాడు. దీనికి స్పందించిన ఓ యువతి ‘మరి గతంలో నువ్వు చేసిందేంటి? మరిచిపోయావా? అంటూ ప్రశ్నించగా.. బెన్ తానేం మరిచిపోలేదంటూ సమాధానమిచ్చాడు. పైగా తాను తప్పు చేసినట్లు అంగీకరిస్తూ.. పదేళ్ల తర్వాత నటి హిలెరి బర్టన్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఓ ట్వీట్ చేశాడు. ఇక ఆ యువతి చేసిన ట్వీట్ పై నటి హిలెరి కూడా స్పందించింది. తన తరపున ప్రశ్నించిన యువతిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అప్పటి వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు కూడా.

1997లో వచ్చిన బెన్‌-హర్వే వెయిన్‌స్టన్‌ కాంబోలో వచ్చిన గుడ్‌ విల్‌ హంటింగ్‌ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వీరద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా ది న్యూయార్క్‌ టైమ్స్‌ మరియు ది న్యూయార్కర్‌ సంచికలు హర్వే లైంగిక వేధింపుల పర్వంపై సాక్ష్యాలతో సహా వివరంగా కథనాలు రాయటంతో.. అంతా సోషల్ మీడియాలో హర్వేను దుయ్యబడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement