Marc Anthony
-
జెన్నీఫర్ లోపెజ్కు విడాకుల ఖరారు
లాస్ ఏంజిల్స్: ప్రముఖ గాయని జెన్నీఫర్ లోపెజ్ - మార్క్ ఆంటోనీలకు విడాకులు ఖరారయ్యాయి. వారిద్దరూ విడిపోయిన మూడు సంవత్సరాల తరువాత విడాకులు ఖరారు చేశారు. లోపెజ్ - మార్క్ జంటకు ఆరు సంవత్సరాల వయసు గల కవలపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ లోపెజ్ సంరక్షణలో ఉంటారు. నెలలో ఒక వారం రోజులపాటు మార్క్కు పిల్లలతో గడిపే అవకాశం ఉంటుంది. జెన్నిఫర్ లోపెజ్ - మార్క్ ఆంటోనీలు 2011 జులైలో విడిపోయారు. 2012 ఏప్రిల్లో ఆంటోనీ విడాకుల కోసం దరఖాస్తు చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత విడాకులు మంజూరయ్యాయి. దీంతో వారి సంబంధానికి తెరపడింది. -
విడాకులు తీసుకోవడం అత్యంత విషాదకరం: లోపెజ్
లాస్ ఎంజెలెస్: తన భర్త మార్క్ ఆంథోని విడిపోవడమే జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ అన్నారు. 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆంథోని నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం లోపెజ్ విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారింది. ఎన్నడూ లేనంతగా జీవితంలో విషాదం నిండుకుందన్నారు. కొద్దికాలం పాటు ఆఘటన గురించి తలచుకుని బాధపడ్డాను. ప్రస్తుతం రియలైజ్ అవుతున్నాను. జీవితంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇక జీవితాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలనుకుంటున్నాను లోపెజ్ అన్నారు. గత రెండేళ్ల నుంచి డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపేజ్ డేటింగ్ చేస్తోంది. -
ప్రేమ ఓకే.. పెళ్లే కష్టం!
ప్రేమ ఎంత మధురం అంటున్నారు జెన్నిఫర్ లోపెజ్. అందుకే, ఎప్పుడూ ప్రేమలో పడుతూ ఉంటారామె. ఇప్పటికి మూడు సార్లు ప్రేమలో పడ్డారు జెన్నిఫర్. ఆ ముగ్గురు ప్రేమికులను పెళ్లి కూడా చేసుకున్నారు. మూడో భర్త మార్క్ ఆంటోనీకి విడాకులిచ్చి మూడేళ్లయ్యింది. మరి.. ప్రేమను ప్రేమించే వ్యక్తి కాబట్టి, జెన్నిఫర్ ఖాళీగా ఉంటారా? మూడో భర్తకు విడాకులిచ్చిన కొన్నాళ్లకు కాస్పర్ స్మార్ట్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుణ్ణి ఎప్పుడు భర్తని చేసుకుంటారనే ప్రశ్న జెన్నిఫర్ ముందుంచితే -‘‘ఏమో.. నాకే తెలియదు. పెళ్లి అనే సంప్రదాయం మీద నాకు సదభిప్రాయమే ఉంది. కానీ, వివాహ బంధం మాత్రం చాలా కష్టం. ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం పెద్ద సవాల్లాంటిది. కానీ, ప్రేమ అనేది సవాల్ కాదు. అందులో ఎలాంటి కష్టం ఉండదు’’ అన్నారు. ఈవిడగారి వైఖరి చూస్తుంటే.. కాస్పర్తో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లరని అర్థమవుతోంది. ప్రస్తుతం జెన్నిఫర్ వయసు 44. పెళ్లి జోలికి వెళ్లకుండా మిగతా జీవితాన్ని మొత్తం ఆమె నిత్య ప్రేమికురాలిలా గడిపేసే ఆలోచనలో ఉన్నారేమో!