ప్రేమ ఓకే.. పెళ్లే కష్టం!
ప్రేమ ఓకే.. పెళ్లే కష్టం!
Published Sun, Jan 19 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
ప్రేమ ఎంత మధురం అంటున్నారు జెన్నిఫర్ లోపెజ్. అందుకే, ఎప్పుడూ ప్రేమలో పడుతూ ఉంటారామె. ఇప్పటికి మూడు సార్లు ప్రేమలో పడ్డారు జెన్నిఫర్. ఆ ముగ్గురు ప్రేమికులను పెళ్లి కూడా చేసుకున్నారు. మూడో భర్త మార్క్ ఆంటోనీకి విడాకులిచ్చి మూడేళ్లయ్యింది. మరి.. ప్రేమను ప్రేమించే వ్యక్తి కాబట్టి, జెన్నిఫర్ ఖాళీగా ఉంటారా? మూడో భర్తకు విడాకులిచ్చిన కొన్నాళ్లకు కాస్పర్ స్మార్ట్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు.
ఈ ప్రేమికుణ్ణి ఎప్పుడు భర్తని చేసుకుంటారనే ప్రశ్న జెన్నిఫర్ ముందుంచితే -‘‘ఏమో.. నాకే తెలియదు. పెళ్లి అనే సంప్రదాయం మీద నాకు సదభిప్రాయమే ఉంది. కానీ, వివాహ బంధం మాత్రం చాలా కష్టం. ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం పెద్ద సవాల్‌లాంటిది. కానీ, ప్రేమ అనేది సవాల్ కాదు. అందులో ఎలాంటి కష్టం ఉండదు’’ అన్నారు. ఈవిడగారి వైఖరి చూస్తుంటే.. కాస్పర్‌తో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లరని అర్థమవుతోంది. ప్రస్తుతం జెన్నిఫర్ వయసు 44. పెళ్లి జోలికి వెళ్లకుండా మిగతా జీవితాన్ని మొత్తం ఆమె నిత్య ప్రేమికురాలిలా గడిపేసే ఆలోచనలో ఉన్నారేమో!
Advertisement
Advertisement