జెన్నిఫర్ బర్త్‌డే స్పెషల్‌.. ఓటీటీలో ఈ యాక్షన్‌ సినిమాలు చూడొచ్చు! | Jennifer Lopez Celebrates 55th Birthday And Her Life Story In Hollywood Cinema Industry | Sakshi
Sakshi News home page

Jennifer Lopez: జెన్నిఫర్ బర్త్‌డే స్పెషల్‌.. ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి!

Published Wed, Jul 24 2024 10:51 AM | Last Updated on Wed, Jul 24 2024 11:03 AM

Jennifer Lopez Celebrates 55th Birthday And Her Life Story In Hollywood Cinema Industry

'జెన్నిఫర్ లోపెజ్' అనగానే.. మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు సినిమా పాట. అయితే, హాలీవుడ్ సినీపరిశ్రమలో జెన్నిఫర్ లోపెజ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ నటి. జులై 24, 1969న న్యూయార్క్‌లో జన్మించిన జెన్నిఫర్ లోపెజ్ మొదట స్కెచ్ కామెడీ TV సిరీస్ 'ఇన్ లివింగ్ కలర్'లో ఫ్లై గర్ల్ జాజ్-ఫంక్ డాన్సర్‌గా గుర్తింపు పొంది, సంగీత పరిశ్రమలో కూడా చెరగని ముద్రగా ఎదిగింది.

తాను కేవలం డ్యాన్సింగ్, సింగింగ్‌లకే పరిమితం కాకుండా నటనలో కూడా ప్రతిభ కనబరిచి తనను తాను పరిచయం చేసుకుంది. తాను నటించిన యాక్షన్ చిత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. నటిగా మారిన తన కెరీర్ అన్ని రకాల జోనర్‌ల చిత్రాలను నటించి, అడ్వెంచర్ యాక్షన్‌ పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జెన్నిఫర్ తన హాలీవుడ్‌ మూవీ కెరీర్‌లో అన్నీ రకాల పాత్రలను పోషించినప్పటికీ, అందులో అద్భుతమైన యాక్షన్ సినిమాలను కొన్నింటిని చూసినట్లయితే..

అనకొండ..
హారర్ అండ్‌ యాక్షన్‌గా 1997లో విడుదలైన 'అనకొండ' మూవీ ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటి. దట్టమైన అడవిలో అనకొండ నుంచి తప్పించుకోవడానికి టెర్రీ (జెన్నిఫర్ లోపెజ్‌) తన స్నేహితులతో కలిసి ఎలా పోరాడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఈ మూవీని జియో సినిమాలో చూడవచ్చు.

ఎనాఫ్‌..
2002లో విడుదలైన యాక్షన్ అండ్‌ థ్రిల్లర్ మూవీ 'ఎనాఫ్'. స్లిమ్ (జెన్నిఫర్ లోపెజ్) తన బెదిరింపు భర్త నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో మనం ఇందులో చూడవచ్చు. ఈ చిత్రం హాట్‌స్టార్‌ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

షాట్‌గన్ వెడ్డింగ్..
జెన్నిఫర్ లోపెజ్ నటించినటువంటి చిత్రం 'షాట్‌గన్ వెడ్డింగ్' (2022). యాక్షన్‌తో పాటు కామెడీని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ నచ్చుతుంది. దీనిని మీరు హాట్‌స్టార్‌ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ది మదర్‌..
2023లో విడుదలైన 'ది మదర్' చిత్రంలో జెన్నిఫర్ లోపెజ్ కథానాయికగా నటించింది. యాక్షన్, థ్రిల్లర్‌గా కొనసాగే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement