ట్రంప్‌పై హారిస్ విమర్శలు
హారిస్‌కే ఓటేయండి: లోపెజ్
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్‌వెగాస్‌లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్‌ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు.
హారిస్‌కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్‌కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్‌కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్‌కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment