LeBron James
-
సూపర్‌స్టార్ ముచ్చట్లు లేక వెలవెల.. ఎందుకీ మౌనం?
లాస్ ఏంజెలిస్ (అమెరికా): విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ట్వీట్లు, పోస్ట్‌లకు విరామం ఇస్తానని ప్రకటించి తన అభిమానులను కాస్త నిరాశపరిచాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో ఆల్‌టైమ్ బెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్న అతనికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (పాత ట్విట్టర్)లో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జేమ్స్ ఆకస్మిక నిర్ణయానికి కారణం లేకపోలేదు.సమాజానికి తన సైలెన్స్‌తో సందేశం ఇవ్వడానికే సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అతని సహచరుడు కెవిన్ డ్యురంట్ మేనేజర్ రిచ్ క్లీమన్ ఇటీవల సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అసత్య, ప్రతికూల వార్తలు మన కళ్లను గుడ్డిగా నమ్మేలా చేయడంపై ప్రముఖంగా ప్రస్తావించాడు. దీన్ని ఉటంకిస్తూ... వైరల్ అవుతున్న వార్తల్లో ‘రియల్’ కనిపించకపోవడం తనని కూడా కదిలించేలా చేసిందని, అందుకే ఈ విరామం అని లెబ్రాన్ జేమ్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మిలియన్లు (15 కోట్ల 90 లక్షల మంది), ‘ఎక్స్’లో 52.9 మిలియన్ల (5 కోట్ల 20 లక్షల 90 వేల మంది) అభిమానులు లెబ్రాన్ను సోషల్ మీడియాలో అనుసరిస్తారు. అతని ట్వీట్‌కు జై కొడతారు... పోస్ట్ పెడితే పండగ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్లందరూ తమ సూపర్‌స్టార్ ముచ్చట్లు లేక వెలవెలబోనున్నారు. ఎన్బీఏలో జేమ్స్ జగద్విఖ్యాత బాస్కెట్‌బాలర్. త్వరలోనే 40వ పడిలో అడుగిడబోతున్నా... ఈ వెటరన్ స్టార్‌కు ఆటపై పస, ధ్యాస ఏమాత్రం తగ్గలేదు. ఎన్బీఏలో నాలుగుసార్లు, ఒలింపిక్స్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడైన లెబ్రాన్ లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కు ఆడుతున్నాడు. -
USA Presidential Elections 2024: చపలచిత్తుడు
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్‌వెగాస్‌లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్‌ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు. హారిస్‌కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్‌కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్‌కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. -
తండ్రి, తనయుడు కలిసి.. ఎన్బీఏలో కొత్త చరిత్ర
లాస్ ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన దిగ్గజ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌తో పాటు... అతడి కుమారుడు బ్రోనీ జేమ్స్ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. తద్వారా ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డుల్లోకెక్కారు. లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మంగళవారం మినెసొటా టింబర్వోల్వస్ జట్టుతో జరిగిన పోరులో కలిసి ఆడారు. సుదీర్ఘ ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రి కుమారులు లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మాత్రమే కావడం విశేషం. 39 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ ఇప్పటి వరకు ఎన్బీఏలో 40,490 పాయింట్లు సాధించి ఈ జాబితా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 20 ఏళ్ల బ్రోనీ జేమ్స్ ఈ సీజన్లోనే ఎన్బీఏ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రోనీ కోర్టులోకి అడుగు పెట్టాడు. దీంతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించగా... తండ్రి సూచనలు పాటిస్తూ బ్రోనీ రెండున్నర నిమిషాల పాటు ఆటలో కొనసాగాడు. బ్రోనీ మైదానాన్ని వీడే సమయంలో కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు. గత వేసవిలో జరిగిన వేలంలోనే లేకర్స్ జట్టు బ్రోనీ జేమ్స్‌ను దక్కించుకోగా... ఇప్పుడు సీజన్ ఆరంభ పోరుతో తండ్రీ కుమారులు కలిసి ఆడే అవకాశం దక్కింది. బ్రోనీ బరిలోకి దిగడానికి ముందు లెబ్రాన్ మాట్లాడుతూ... ‘సిద్ధంగా ఉన్నావా. మ్యాచ్ తీవ్రత గమనించావు కదా... ఒత్తిడికి లోనవకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించు’ అని అన్నాడు. పొరబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని... మైదానంలో వంద శాతం కష్ట పడటంపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. మ్యాచ్‌లో లెబ్రాన్ జేమ్స్ 16 పాయింట్లతో సత్తా చాటగా... లేకర్స్ జట్టు 110– 103 పాయింట్ తేడాతో టింబర్వోల్వస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు లెబ్రాన్ భార్య, బ్రోనీ తల్లి సవన్నా జేమ్స్ కూడా హాజరై... భర్త, కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. బేస్‌బాల్ మేజర్ లీగ్‌లో కెన్ గ్రెఫీ సీనియర్ అతడి కుమారుడు కెన్ గ్రెఫీ జూనియర్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. 1990వ దశకంలో వీరిద్దరూ 51 మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. మంగళవారం ఎన్బీఏ మ్యాచ్‌కు హాజరైన కెన్ గ్రెఫీ జంట... జేమ్స్ ద్వయాన్ని అభినందించింది. నాలుగుసార్లు ఎన్బీఏ చాంపియన్‌గా నిలిచిన లెబ్రాన్ చాన్నాళ్ల క్రితమే కుమారుడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అప్పటికి బ్రోనీ విద్యార్థి దశలోనే ఉండగా... ఆ తర్వాత కఠోర శిక్షణతో రాటుదేలిన బ్రోనీ టీనేజ్లోనే తన ప్రతిభతో లేకర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బ్రోనీ జేమ్స్... ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కోలుకొని తిరిగి ఆట కొనసాగిస్తున్నాడు. -
అమెరికా బృందం పతాకధారిగా లెబ్రాన్ జేమ్స్
పారిస్ ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పాల్గొనే అమెరికా క్రీడాకారుల బృందానికి పతాకధారిగా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ వ్యవహరిస్తాడు. 39 ఏళ్ల లెబ్రాన్ నాలుగోసారి ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడనున్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న లెబ్రాన్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కాంస్యం... 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లండన్ గేమ్స్ తర్వాత లెబ్రాన్ రియో, టోక్యో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. ఎన్బీఏ లీగ్ చరిత్రలో అత్యధిక పాయింట్లు (48,177) సాధించిన ప్లేయర్‌గా లెబ్రాన్ రికార్డు నెలకొల్పాడు. -
LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(NBA) స్టార్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ ఏన్బీఏ ప్లేయర్ తాజాగా బద్దలుకొట్టాడు. లేకర్స్ తరపున ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ బుధవారం ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్(38,387) అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఒక్లహమా సిటీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో 36వ పాయింట్ వద్ద లెబ్రాన్ జేమ్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి. లెబ్రాన్ ఈ రికార్డు అందుకున్న సమయంలో స్డేడియంలో దిగ్గజం కరీమ్ అబ్దుల్ జబ్బార్ ఉండడం విశేషం. వేలాది మంది ప్రేక్షకుల కరతాళద్వనుల మధ్య అబ్దుల్ జబ్బార్.. లెబ్రాన్ జేమ్స్‌ను అభినందించడం హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్టు 5, 1984లో అప్పటి ఎన్బీఏ స్టార్ కరీమ్ అబ్దుల్ జబ్బార్ 31,419 పాయింట్ల వద్ద విల్ట్ చాంబర్లెయిన్ను అధిగమించాడు. 1989లో కరీమ్ రిటైర్ అయినప్పటికి అతని రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. లెబ్రాన్ జేమ్స్ సాధించిన రికార్డులు.. ► NBA ఛాంపియన్: 2012, 2013, 2016, 2020 ► NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 2009, 2010, 2012, 2013 ► NBA ఫైనల్స్ MVP: 2012, 2013, 2016, 2020 ► NBA ఆల్ స్టార్: 19 సార్లు (2005-2023) ► NBA రూకీ ఆఫ్ ది ఇయర్: 2004 ► ఒలింపిక్ పతకాలు: మూడు (2008, 2012లో స్వర్ణం; 2004లో కాంస్యం) 🎙️ MIC'D UP 🎙️ LeBron James becomes the NBA's all-time leading scorer.#ScoringKing pic.twitter.com/MbRSyw0SBj — NBA (@NBA) February 8, 2023 One photo, 76,777 points. All time greatness. #ScoringKing pic.twitter.com/EJdWZTQZe6 — NBA (@NBA) February 8, 2023 చదవండి: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో Lebron James: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు