న్యూఢిల్లీ: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడల్లా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్‌వైపు మళ్లుతుంది. దీనికి కారణం మన దేశంలో అత్యధికంగా లోక్‌సభ సీట్లు(80) ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో మెరుగైన పరితీరు కనబరిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సులభమవుతుంది.
మన ఉత్తరప్రదేశ్ మాదిరిగానే అమెరికాలోనూ అలాంటి ఒక రాష్ట్రం ఉంది. అక్కడున్న సీట్ల సంఖ్య ఆధారంగా దీనిని మన ఉత్తర ప్రదేశ్‌తో పోల్చవచ్చు. అదే కాలిఫోర్నియా రాష్ట్రం. ఇక్కడ గరిష్టంగా 54 ఎలక్ట్రోరల్ కాలేజీలున్నాయి. ఇక్కడే ట్రంప్ పార్టీ గెలుస్తుందా? లేదా కమలా హారిస్ గెలుస్తారా అనేది తేలిపోతుంది. అమెరికాలోని ఈ ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ సత్తా చాటుతుందో ఆ పార్టీకి చెందిన అభ్యర్థి అధ్యక్షుడయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.
అమెరికాలో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది స్పష్టంగా ఎవరూ అంచనా వేయలేరు. ఈ జాబితాలో పెన్సెల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ లీడ్..నార్త్ కరోలినాలో గెలుపు
Comments
Please login to add a commentAdd a comment