వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలిచిన అభ్యర్థి తదుపరి నాలుగేళ్ల పాటు అమెరికాను పరిపాలించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్, హారిస్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఎన్నికల ఫలితాలపై అమెరికాకు చెందిన నోస్ట్రాడమస్ అలాన్ లిచ్ట్‌మన్ జోస్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.
లిచ్ట్‌మన్ అమెరికన్ రచయిత. అలాగే భవిష్యత్ రాజకీయాలు గురించి కూడా ఊహించి చెబుతుంటారు. ఇప్పడు ఆయన అమెరికాకు కాబోయే అధ్యక్షులెవరనే దానిపై తన అంచనాలు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను కమలా హారిస్ ఓడిస్తారని అలాన్ లిచ్ట్‌మన్ జోస్యం చెప్పారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ జోస్యం చెప్పారు. అలాగే ఒపీనియన్ పోల్ డేటాను తప్పుబట్టారు.
కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కానున్నారని లిచ్ట్‌మన్ అన్నారు. ఆఫ్రికన్-ఆసియన్ సంతతికి చెందిన మహిళ అధ్యక్షురాలు కాబోతున్నదని ఆయన తెలిపారు. గత 40 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షుల ఎన్నికపై లిచ్ట్‌మన్ చెప్పిన అంచనాలు నిజమవుతూ వచ్చాయని పలువురు అంటారు.
2016లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని తాను ముందే అంచనా వేశానని, అలాగే హిల్లరీ క్లింటన్ విజయాన్ని కూడా అంచనా వేయగలిగానని లిచ్ట్‌మన్ తెలిపారు. అయితే ఒక్కోసారి తన అంచనాలు తప్పు కావచ్చని, తాను కూడా మనిషినేని, అందుకే తప్పులు జరగవచ్చని అన్నారు. అయితే ఇప్పుటి వరకూ తన అంచనాలు ఏనాడూ తప్పలేదన్నారు.
ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment