హాఫ్‌ న్యూడ్‌గా కనిపించమన్నారు! | Jennifer Lopez Was Once Told by a Director to Show Him Her Breasts | Sakshi
Sakshi News home page

హాఫ్‌ న్యూడ్‌గా కనిపించమన్నారు!

Published Mon, Mar 19 2018 12:30 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Jennifer Lopez Was Once Told by a Director to Show Him Her Breasts - Sakshi

జెన్నిఫర్‌ లోపెజ్‌

‘‘నేను ఆ రోజు ఆడిషన్‌కు వెళ్లా. ఒక్కదాన్నే. ఆడిషన్‌ చేసిన ప్రొడ్యూసర్‌ నన్ను షర్ట్‌ విప్పమని, హాఫ్‌ న్యూడ్‌గా కనిపించమని అడిగాడు. నేనప్పుడు గట్టిగా నో చెప్పడానికి కూడా ఎలా భయపడ్డానో ఆలోచిస్తే ఈరోజుకీ భయమేస్తుంది’’ జెన్నిఫర్‌ లోపెజ్‌ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. 48 ఏళ్ల జెన్నిఫర్, 30 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉంది. పైన చెప్పిన సంఘటన 30 ఏళ్ల క్రిందట, ఆమె ఇండస్ట్రీకి అడుగు పెట్టకముందు జరిగింది. ఇన్నేళ్లకు గానీ ఆమె ఈ విషయం చెప్పలేదంటే, స్త్రీ ఒక జీవిత కాలమంత విషాదాన్ని తనలో దాచుకుంటుందని అనుకోవాలి.

ఇప్పటికైనా జెన్నిఫర్‌ ఈ మాటలు చెప్పిందంటే, అది మీటూ అన్న ఒక ఉద్యమం బయటకొచ్చాకే! హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం తీసుకొచ్చిన మార్పు తెలిసిందే. ఆరు నెలలుగా వందలాది మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి చెబుతూ, ఎందరి పేర్లనో బయటపెట్టారు. హాలీవుడ్‌లో ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ‘‘నాకే ఈ విషయం చెప్పడానికి ఇన్నేళ్లు పట్టిందంటే.. ఇంక మామూలు అమ్మాయి సంగతి?’’ అంటూ మీటూ ఉద్యమం లాంటివి ఎప్పుడూ ఉండాలని, హాలీవుడ్‌ ఇప్పటికైనా మారాలని జెన్నిఫర్‌ లోపెజ్‌ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement