ఇప్పటికే 3 పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లికి సింగర్‌ రెడీ | Jennifer Lopez Said About Her Fourth Marriage | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 3 పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లికి సింగర్‌ రెడీ

Nov 20 2021 4:00 PM | Updated on Nov 20 2021 4:33 PM

Jennifer Lopez Said About Her Fourth Marriage - Sakshi

Jennifer Lopez Said About Her Fourth Marriage: అమెరికన్ సింగర్‌, నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 52 ఏళ్ల ఈ నటి ఇప్పటికి మూడు పెళ్లిల్లు చేసుకుంది. ప్రస్తుతం బెన్‌ అఫ్లెక్‌తో డేటింగ్‌లో ఉంది. ఈ విషయమై తాజాగా జెన్నిఫర్‌ను మళ్లీ వివాహం చేసుకుంటారా అని అడిగితే అవునని సమాధానమిచ్చింది. జెన్నిఫర్‌ కొత్త చిత్రం 'మ్యారీ మీ' సినిమా ప్రమోట్‌ చేస్తున్నప్పుడు ఈ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది.  'అవును. నేను అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసు. ఐయామ్‌ రొమాంటిక్‌. అలా ఎప్పటినుంచో ఉన్నాను. నాకు కొన్ని సార్లు వివాహం జరిగింది. మరో పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉంటానని 100 శాతం నమ్ముతున్నాను.' 

ఈ గాయని గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరూ 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్‌ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత జెన్నిఫర్‌ మార్క్‌ ఆంటోనిని వివాహామాడింది. 2011లో విడిపోయే వరకు వారు ఏడేళ్లు కలిసి ఉన్నారు. తర్వాత 13 ఏళ్ల ట్విన్స్‌ అయిన మాక్స్‌, ఎమ్మేలను చెరొకరు తీసుకున్నారు. మార్క్‌తో వివాహానికి ముందు, జెన్నిఫర్‌, బెన్‌ 2002 చివరిలో మొదటిసారి డేటింగ్‌ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2004లో విడిపోయారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి గతంలో కంటే సంతోషంగా ఉన్నారు.  

ఈ సంవత్సరం ప్రారంభంలో అలెక్స్‌ రోడ్రిగ్జ్‌తో జెన్నిఫర్‌ నిశ్చితార్థం ముగిసాక బెన్నిఫర్‌ (బెన్‌ అఫ్లెక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌) 2.0 మళ్లీ ప్రారంభమైంది. వారు వారి ప్రేమలో లోతుగా మునిగిపోయారు. వివిధ నగరాల్లో ఎక్కువ రోజులు గడపడం వల్ల ఒకరినొకరు చాలా మిస్సయ్యారని వారి సన్నిహితులు తెలిపారు. జెన్నిఫర్‌ లోపెజ్‌ తన తాజా చిత్రం 'మ్యారీ మీ' ని ఒకటి కంటే ఎక్కువసార్లు అనుసరిస్తున్నట్లుగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement