Hollywood celebrities
-
ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు..
Sean Penn And Leila George Finalized Divorce After 2 Years Of Marriage: సినీ తారల ప్రేమాయణాలు, బ్రేకప్‌లు, పెళ్లిల్లు, విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రేమలో మునిగితేలుతూ పోస్ట్‌లు పెట్టే సెలబ్రిటీలు హఠాత్తుగా విడిపోయామంటూ షాక్ ఇస్తారు. అలాగే ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు అంతే తేలిగ్గా విడాకులు తీసుకున్న సంఘటనలు కూడా మనం చూశాం. తాజాగా హాలీవుడ్ తారలు సీన్ పెన్, లీలా జార్జ్‌లు తమ వివాహం బంధానికి స్వస్తి పలికారు. వివాహం బంధంతో ఒక్కటిగా జీవించిన ఈ జంటకు తాజాగా విడాకులు మంజూరు అయ్యాయి. 61 ఏళ్ల సీన్ పెన్ 2016 నుంచి 30 ఏళ్ల లీలా జార్జ్‌తో డేటింగ్ చేశాడు. ప్రేమలో మునిగితేలిన ఈ జంట జూలై 2020లో కొవిడ్ సమయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కేవలం ఒక ఏడాది తర్వాత అక్టోబర్ 2021లో విడాకుల కోసం దాఖలు చేసుకుంది ఈ జంట. తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వారు అధికారికంగా సెప్టెంబర్ 2021 నుంచే విడిగా ఉంటున్నారని పలువురు పేర్కొన్నారు. వారి విడాకులకు సరైనా కారణాలు తెలియరాలేదు. ఇప్పటికీ లీలా జార్జ్‌తో ప్రేమలో ఉన్నాని, కానీ వివాహ బంధంతో విసిగిపోయానని చెబుతున్నాడు సీన్ పెన్. కాగా పెన్ గతంలో రాబిన్ వ్రైట్ను పెళ్లి చేసుకున్నాడు. వారికి 31 ఏళ్ల కుమార్తె డైలాన్, 28 ఏళ్ల కుమారుడు హాప్పర్ ఉన్నారు. రష్యా-ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రేయిన్‌లో డ్యాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం వెళ్లి వార్తల్లో నిలిచాడు సీన్ పెన్. ఆ సమయంలో పెన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీని కూడా కలుసుకున్నట్లు సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్..
Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్ స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' ప్రమోషన్లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్సైట్ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 'మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్ ఆఫ్..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది. 'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్' సినిమాతోపాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్, అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది ప్రియాంక జోనాస్. -
ఇప్పటికే 3 పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లికి సింగర్ రెడీ
Jennifer Lopez Said About Her Fourth Marriage: అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన పాటలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 52 ఏళ్ల ఈ నటి ఇప్పటికి మూడు పెళ్లిల్లు చేసుకుంది. ప్రస్తుతం బెన్ అఫ్లెక్‌తో డేటింగ్లో ఉంది. ఈ విషయమై తాజాగా జెన్నిఫర్‌ను మళ్లీ వివాహం చేసుకుంటారా అని అడిగితే అవునని సమాధానమిచ్చింది. జెన్నిఫర్ కొత్త చిత్రం 'మ్యారీ మీ' సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. 'అవును. నేను అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసు. ఐయామ్ రొమాంటిక్. అలా ఎప్పటినుంచో ఉన్నాను. నాకు కొన్ని సార్లు వివాహం జరిగింది. మరో పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉంటానని 100 శాతం నమ్ముతున్నాను.' ఈ గాయని గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరూ 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత జెన్నిఫర్ మార్క్ ఆంటోనిని వివాహామాడింది. 2011లో విడిపోయే వరకు వారు ఏడేళ్లు కలిసి ఉన్నారు. తర్వాత 13 ఏళ్ల ట్విన్స్ అయిన మాక్స్, ఎమ్మేలను చెరొకరు తీసుకున్నారు. మార్క్‌తో వివాహానికి ముందు, జెన్నిఫర్, బెన్ 2002 చివరిలో మొదటిసారి డేటింగ్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2004లో విడిపోయారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి గతంలో కంటే సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అలెక్స్ రోడ్రిగ్జ్‌తో జెన్నిఫర్ నిశ్చితార్థం ముగిసాక బెన్నిఫర్ (బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్) 2.0 మళ్లీ ప్రారంభమైంది. వారు వారి ప్రేమలో లోతుగా మునిగిపోయారు. వివిధ నగరాల్లో ఎక్కువ రోజులు గడపడం వల్ల ఒకరినొకరు చాలా మిస్సయ్యారని వారి సన్నిహితులు తెలిపారు. జెన్నిఫర్ లోపెజ్ తన తాజా చిత్రం 'మ్యారీ మీ' ని ఒకటి కంటే ఎక్కువసార్లు అనుసరిస్తున్నట్లుగా ఉంది. -
హైహీల్స్.. యమా డేంజర్!
* కేన్స్‌లో హీల్స్ లొల్లి * ఎత్తుచెప్పులు ప్రమాదకరమంటున్న నిపుణులు ‘‘ఇక్కడ మహిళలు హైహీల్స్‌ను మాత్రమే ధరించాలి. ఫ్లాట్‌గా ఉండే చెప్పులు, షూస్‌ను నిషేధించడమైనది’’ ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు చేసిన ఈ ప్రకటన ఇటీవల దుమారం రేపింది. అంతర్జాతీయ సినిమా వేడుకలకు మాత్రమే కాదు.. ప్రముఖ నటీమణుల అందాల ప్రదర్శనకూ వేదికైన కేన్స్‌లో ఈ నిబంధన పట్ల చాలా మంది వివిధ ఇబ్బందుల వల్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. హాలివుడ్ ప్రముఖల నుంచి విమర్శలూ వెల్లువెత్తడంతో ఆనక నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అయితే, ఈ గొడవ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ నిపుణుడు డాక్టర్ స్టీవ్ ప్రీస్ హై హీల్స్‌పై దృష్టి సారించారు. వీటిని ధరిస్తే కలిగే మోదం కంటే.. ప్రమాదమే ఎక్కువని తేల్చేశారు! హై హీల్స్‌ను రోజూ ధరించడం వల్ల ఇబ్బందులు తప్పవని స్టీవ్ చెప్పారు. దీర్ఘకాలంలో కాలి ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటిలో ముఖ్యమైన సమస్యలు ఏవంటే... ⇒ హైహీల్స్‌తో నడక తీరు మారిపోతుంది. నడుంనొప్పి మొదలవుతుంది. చీలమండలు, కీళ్లు వాచిపోతాయి. ⇒ పాదాలపై పుండ్లు ఏర్పడతాయి. ⇒ శరీర బరువంతా మునివేళ్లపై పడుతుంది. దీనివల్ల అరికాలుపై ముందు వైపు ఒత్తిడి పెరుగుతుంది. పాదం పనితీరుపై ప్రభావం పడుతుంది. ⇒ తూలిపడకుండా ఉండేందుకు భయంగా, అతి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ⇒ నడుము దగ్గర నుంచి తొడలు, పిక్కలు, పాదాల వరకూ అన్ని కండరాలూ అతికష్టంగా పనిచేయాల్సి వస్తుంది.