Sean Penn And Leila George Announced Divorce After 2 Years Of Marriage, Details Inside - Sakshi
Sakshi News home page

Sean Penn And Leila George Divorce: రెండేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన 61 ఏళ్ల నటుడు

Published Mon, Apr 25 2022 11:24 AM | Last Updated on Mon, Apr 25 2022 12:09 PM

Sean Penn And Leila George Finalized Divorce After 2 Years Of Marriage - Sakshi

Sean Penn And Leila George Finalized Divorce After 2 Years Of Marriage: సినీ తారల ప్రేమాయణాలు, బ్రేకప్‌లు, పెళ్లిల్లు, విడాకులు ఎప్పు​డు హా​​ట్‌ టాపిక్‌గానే ఉంటాయి. ప్రేమలో మునిగితేలుతూ పోస్ట్‌లు పెట్టే సెలబ్రిటీలు హఠాత్తుగా విడిపోయామంటూ షాక్‌ ఇస్తారు. అలాగే ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు అంతే తేలిగ్గా విడాకులు తీసుకున్న సంఘటనలు కూడా మనం చూశాం. తాజాగా హాలీవుడ్‌ తారలు సీన్‌ పెన్‌, లీలా జార్జ్‌లు తమ వివాహం బంధానికి స్వస్తి పలికారు. వివాహం బంధంతో ఒక్కటిగా జీవించిన ఈ జంటకు తాజాగా విడాకులు మంజూరు అయ్యాయి. 

61 ఏళ్ల సీన్‌ పెన్‌ 2016 నుంచి 30 ఏళ్ల లీలా జార్జ్‌తో డేటింగ్ చేశాడు. ప్రేమలో మునిగితేలిన ఈ జంట జూలై 2020లో కొవిడ్‌ సమయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కేవలం ఒక ఏడాది తర్వాత అక్టోబర్‌ 2021లో విడాకుల కోసం దాఖలు చేసుకుంది ఈ జంట. తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వారు అధికారికంగా సెప్టెంబర్‌ 2021 నుంచే విడిగా ఉంటున్నారని పలువురు పేర్కొన్నారు. వారి విడాకులకు సరైనా కారణాలు తెలియరాలేదు. ఇప్పటికీ లీలా జార్జ్‌తో ప్రేమలో ఉన్నాని, కానీ వివాహ బంధంతో విసిగిపోయానని చెబుతున్నాడు సీన్‌ పెన్‌. 

కాగా పెన్ గతంలో రాబిన్ వ్రైట్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి 31 ఏళ్ల కుమార్తె డైలాన్, 28 ఏళ్ల కుమారుడు హాప్పర్‌ ఉన్నారు. రష్యా-ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రేయిన్‌లో డ్యాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం వెళ్లి వార్తల్లో నిలిచాడు సీన్‌ పెన్. ఆ సమయంలో పెన్‌ ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని కూడా కలుసుకున్నట్లు సమాచారం. 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement