ముడతలు మాయం చేయడానికి 16 లక్షలు! | Jennifer Lopez's beauty secret for flawless skin revealed | Sakshi
Sakshi News home page

ముడతలు మాయం చేయడానికి 16 లక్షలు!

Published Sun, Mar 8 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

ముడతలు మాయం చేయడానికి 16 లక్షలు!

ముడతలు మాయం చేయడానికి 16 లక్షలు!

హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్‌కి ఈ మధ్య ఓ దిగులు పట్టుకుందట. మరో నాలుగేళ్లల్లో ఐదు పదుల వయసులోకి అడుగుపెట్టనున్నారామె. వయసు పెరిగే కొద్దీ మొహం మీద వచ్చే ముడతలు ఆమెను కలవరపెడుతున్నాయట. ఈ ముడతలను మాయం చేయడానికి ‘సీఎసీఐ’ అనే చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. ఈ ఫేషియల్ ట్రీట్‌మెంట్ కోసం జెన్నిఫర్ 16 లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారట. 12 దఫాలుగా ఈ చికిత్స చేస్తారని భోగట్టా. ఇప్పటివరకు చేయించిన చికిత్స మెరుగైన ఫలితాలనివ్వడంతో తన డబ్బుకి న్యాయం జరుగుతోందని మురిసిపోతున్నారట జెన్నిఫర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement