Facial Treatment
-
రూ. 17,500తో ఫేషియల్.. ఉన్న అందం పోయి, చర్మం కాలిపోయి..
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే వేలకు వేలు వెచ్చించి మరి అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. దానికోసం రకరకాల క్రీములు, లోషన్లు, ట్రీట్మెంట్ల పేరుతో డబ్బులన్నీ తగలేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు.. ఇలా సందర్భం ఏదైనా వెంటనే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ముంబైకి చెందిన ఓ మహిళ అందంగా కనిపించాలని పార్లర్‌కు వెళితే మొదటికే మోసం జరిగింది. కాలిన గాయాలతో ఉన్న అందం కూడా పోయింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 17న ముంబైలోని ఓ మహిళ అందం కోసం హైడ్రా ఫేషియల్ చేయించుకుంది. దీనికోసం అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్లోని గ్లో లక్స్ సెలూన్‌కు వెళ్లి రూ. 17,500 విలువైన ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకుంది. సెలూన్ సిబ్బంది ఆమె ముఖంపై కొన్ని క్రీములు రాయడం ప్రారంభించగానే ముఖంపై మంట మొదలైంది. ఇదే విషయాన్ని సెలూన్ వాళ్లతో చెప్పినా బ్లీచింగ్ వల్ల ఇలా జరుగుతుందని, ఇది చాలా సాధరణం అని చెప్పారు. ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోతుందని మిగతా ట్రీట్మెంట్ను పూర్తి చేశారు. అయితే అప్పటికే మంటగా ఉండటం, రెండు రోజులైనా తీవ్రత తగ్గకపోవడంతో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చేట్ల కాలిన గాయాలు అయ్యాయని,చర్మం పలు చోట్ల శాశ్వతంగా దెబ్బతిందని డెర్మటాలజిస్ట్ వివరించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. నాసీరకం ఉత్పత్తులు వాడటం వల్ల ఇలా జరిగిందని, పార్లర్ యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలిసులకు ఫిర్యాదు చేసింది. -
ముఖంపై ముడతల్ని పోగొట్టే ఈ గాడ్జెట్ గురించి తెలుసా?
అందంగా కనిపించడానికి లేపనాలెన్ని ఉన్నా.. వేగంగా ఫలితాన్నిచ్చే డివైజ్‌లకే మార్కెట్లో డిమాండ్! అలాంటిదే ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ పర్సనల్ స్కిన్ స్క్రబ్బర్. పైపై పూతలు ఎన్ని పూసినా రాని నిగారింపు.. ఈ సాధనంతో సాధ్యమవుతుంది. మాయిశ్చరైజింగ్, యాంటీ–ఏజింగ్, వైటెనింగ్‌తో పాటు మొటిమలు, మచ్చలు పొగొట్టడానికీ ఈ గాడ్జెట్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. 5 మోడ్స్‌తో కూడిన ఈ న్యూయెస్ట్ అల్ట్రాసోనిక్ అయానిక్ క్లీనర్.. ఫేస్ క్లీనర్లా, ఫేస్ స్క్రబ్బర్‌లా, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవల్‌గా కూడా పని చేస్తుంది. ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని మృదువుగా, తేమగా ఉంచడంతో పాటు.. చర్మరంధ్రాల్లో ఇరుక్కున్న ధూళిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలో.. అయాన్+, అయాన్, ఫేస్ లిఫ్టింగ్, ప్యాట్ మసాజ్, క్లీనింగ్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. ఆన్/ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్ని 2 సెకన్ల పాటు నొక్కి ఉంచితే సందర్భాన్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఈ స్కబ్బర్కి.. డేటా కేబుల్, కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల చర్మతత్వాలకు ఇది ఉపయోగపడుతుంది. డివైజ్ పై–క్యాప్ తొలగించి, అవసరమైన చోట చర్మానికి ఆనించి, మోడ్స్ ఆన్ చేసుకోవాలి. మోడ్ 1 బ్లాక్ హెడ్స్ రిమూవ్ చెయ్యడానికి, మోడ్ 2 క్లీనింగ్ చేయడానికి, మోడ్ 3 ఫేస్ లిఫ్టింగ్ కోసం (ముడతలు తొలగించేందుకు) ఇలా ఒక్కో మోడ్‌కి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. 45 డిగ్రీల సెంటిగ్రేడ్ థర్మోస్టాటికల్ హైక్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ చిన్న పరికరాన్ని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. వయసు తెలియనీకుండా ముడతలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు.. కలర్ వచ్చేందుకు, మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. -
షేపు మారుస్తారు.. రూపునిస్తారు..
మారుతున్న కాలానికి అనుగుణంగా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతాన్ని పీకే దంత వైద్యులుగానే పరిమితమైన వీళ్లు.. నేడు ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగి వైద్య రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ప్రమాదాల్లో ముఖం, దవడ ఎముకలు విరిగినా, నుదురు, తల ఎముకలకు పగుళ్లు వచ్చినా చికిత్స చేస్తూ ట్రామాకేర్ బృందంలో ముఖ్య సభ్యులుగా మారారు. నేడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ⇔ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వరుణ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు చికిత్స తీసుకుని, కోలుకున్నాడు గానీ, దవడ ఎముకలు విరగడంతో ముఖం మునుపటి రూపును కోల్పోయింది. అద్దంలో చూసుకుంటే తనను తానే గుర్తుపట్టలేని విధంగా తయారవ్వడంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. తెలిసినవారి సలహాతో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌ను సంప్రదించాడు. కొద్దిరోజుల్లోనే తన మునుపటి స్థితిని మరలా పొందగలిగాడు. ⇔ గుంటూరు నగరానికి చెందిన ఎస్తేరు, తను బాల్యంలో గ్రహణంమొర్రి వ్యాధికి గురవడంతో, ముక్కు, నోరు వంకరపోయింది. బాల్యం నుంచి వేధిస్తున్న సమస్య తన వయసుకు లాగానే పెరిగి పెద్దదయింది. దీంతో అందంగా లేనని ఆత్మన్యూనత భావానికి గురయి, నలుగురిలో కలవలేకపోయేది. రోజూ అద్దంలో చూసుకుని మధనపడేది. తమ పాప బాధ చూడలేక పేరెంట్స్ ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ద్వారా లోపాన్ని సవరించగలిగారు. సాక్షి, లబ్బీపేట(విజయవాడ): కృష్ణా, గుంటూరు జిల్లాలో సుమారు 50 మంది వరకూ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ సేవలు అందిస్తున్నారు. వీరిలో 30 మంది విజయవాడలోనే ఉన్నారు. నిత్యం ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరిగిన వారికి ఏడాదికి ఐదు వందల మందికి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండగా, పొగాకు ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్ వచ్చిన 500 నుంచి 600 మందికి వీరు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సరిచేస్తున్నారు. ప్రమాదాల్లో దవడ ఎముకలతో పాటు కాస్మోటిక్ ఫేషియల్ సర్జరీలు, ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలు, ఫేస్ లిఫ్ట్, రైనో ప్లాస్టీ, బొటాక్స్, డెర్మో ఫిల్లర్స్ ద్వారా ముఖంపై ముడతలు తొలగించడం వంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫేషియల్ అంకాలజీ, గ్రహణం మొర్రి ఆపరేషన్లు, ప్రమాదాల్లో పళ్లు ఊడిన వారికి ఇంప్లాంట్ విధానంలో దవడ ఎముకకు శాశ్వత దంతాలు అమర్చుతున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న వైనం ఇప్పటి వరకూ గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అందరికీ తెలిసిందే. సరికొత్తగా ముఖాన్నే మార్చే ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది కిందట జరిగిన అంతర్జాతీయ సదస్సులో విజయవంతంగా ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసిన కేసుపై విశ్లేషణ చేయడం జరిగిందని వైద్యులు చెపుతున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతం పీకే వైద్యులుగా ఉన్న ఫేషియల్ సర్జన్లు నేడు ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగారు. పుట్టుకతోనే ముఖం అందవిహీనంగా వున్న వారికి ఫేషియల్ సర్జరీలతో రూపురేఖలు మార్చేస్తున్నారు. దవట ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా వున్నా, ముక్కు వంకరగా ఉన్నా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ వాటిని సరిదిద్దేస్తున్నారు. ఫేషియల్ సర్జన్ ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుతం వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రమాదాల్లో దవడ, ముఖ ఎముకలు విరిగిన వారికి అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వబోధనాస్పత్రిల్లోని ట్రామాకేర్ బృందంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లను నియమిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిత్యం యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ, ముఖ ఎముకలు విరిగి, ప్రవేటు ఆస్పత్రిలకు చికిత్సకోసం వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో అందుబాటులోకి తీసుకువస్తే మంచిది. గ్రహణం మొర్రి శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. – డాక్టర్ మెహబూబ్ షేక్, ప్రొఫెసర్, ఓరల్అండ్ మాక్సిల్లో ఫేషియల్ విభాగం రోడ్డు ప్రమాదంలో ముఖానికి గాయాలైన యువకుడికి సర్జరీ చేసి మునుపటి స్థితికి తెచ్చిన వైనం -
ముడతలు మాయం చేయడానికి 16 లక్షలు!
హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్‌కి ఈ మధ్య ఓ దిగులు పట్టుకుందట. మరో నాలుగేళ్లల్లో ఐదు పదుల వయసులోకి అడుగుపెట్టనున్నారామె. వయసు పెరిగే కొద్దీ మొహం మీద వచ్చే ముడతలు ఆమెను కలవరపెడుతున్నాయట. ఈ ముడతలను మాయం చేయడానికి ‘సీఎసీఐ’ అనే చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం జెన్నిఫర్ 16 లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారట. 12 దఫాలుగా ఈ చికిత్స చేస్తారని భోగట్టా. ఇప్పటివరకు చేయించిన చికిత్స మెరుగైన ఫలితాలనివ్వడంతో తన డబ్బుకి న్యాయం జరుగుతోందని మురిసిపోతున్నారట జెన్నిఫర్.