Mumbai Woman Faces Skin Burn After Facial Massage Worth Rs 17,500 - Sakshi
Sakshi News home page

Facial Massage: రూ. 17,500తో ఫేషియల్‌.. ఉన్న అందం పోయి, చర్మం కాలిపోయి..

Published Fri, Jun 23 2023 4:12 PM | Last Updated on Fri, Jun 23 2023 4:41 PM

Mumbai Woman Faces Skin Burn After Facial Massage Worth Rs 17,500 - Sakshi

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే వేలకు వేలు వెచ్చించి మరి అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. దానికోసం రకరకాల క్రీములు, లోషన్లు, ట్రీట్‌మెంట్ల పేరుతో డబ్బులన్నీ తగలేస్తుంటారు.

ఇక పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు.. ఇలా సందర్భం ఏదైనా వెంటనే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్‌ చేయించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ముంబైకి చెందిన ఓ మహిళ అందంగా కనిపించాలని పార్లర్‌కు వెళితే మొదటికే మోసం జరిగింది. కాలిన గాయాలతో ఉన్న అందం కూడా పోయింది.


వివరాల్లోకి వెళితే.. జూన్‌ 17న ముంబైలోని ఓ మహిళ అందం కోసం హైడ్రా ఫేషియల్‌ చేయించుకుంది. దీనికోసం అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్‌లోని గ్లో లక్స్ సెలూన్‌కు వెళ్లి రూ. 17,500 విలువైన ఫేషియల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంది. సెలూన్ సిబ్బంది ఆమె ముఖంపై కొన్ని క్రీములు రాయడం ప్రారంభించగానే ముఖంపై మంట మొదలైంది. ఇదే విషయాన్ని సెలూన్‌ వాళ్లతో చెప్పినా బ్లీచింగ్‌ వల్ల ఇలా జరుగుతుందని, ఇది చాలా సాధరణం అని చెప్పారు.

ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోతుందని మిగతా ట్రీట్‌మెంట్‌ను పూర్తి చేశారు. అయితే అప్పటికే మంటగా ఉండటం, రెండు రోజులైనా తీవ్రత తగ్గకపోవడంతో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చేట్ల కాలిన గాయాలు అయ్యాయని,చర్మం పలు చోట్ల శాశ్వతంగా దెబ్బతిందని డెర్మటాలజిస్ట్ వివరించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. నాసీరకం ఉత్పత్తులు వాడటం వల్ల ఇలా జరిగిందని, పార్లర్‌ యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలిసులకు ఫిర్యాదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement