అందంగా కనిపించడానికి లేపనాలెన్ని ఉన్నా.. వేగంగా ఫలితాన్నిచ్చే డివైజ్‌లకే మార్కెట్‌లో డిమాండ్! అలాంటిదే ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ పర్సనల్ స్కిన్ స్క్రబ్బర్. పైపై పూతలు ఎన్ని పూసినా రాని నిగారింపు.. ఈ సాధనంతో సాధ్యమవుతుంది. మాయిశ్చరైజింగ్, యాంటీ–ఏజింగ్, వైటెనింగ్‌తో పాటు మొటిమలు, మచ్చలు పొగొట్టడానికీ ఈ గాడ్జెట్ భలే చక్కగా ఉపయోగపడుతుంది.
5 మోడ్స్‌తో కూడిన ఈ న్యూయెస్ట్ అల్ట్రాసోనిక్ అయానిక్ క్లీనర్.. ఫేస్ క్లీనర్‌లా, ఫేస్ స్క్రబ్బర్‌లా, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవల్‌గా కూడా పని చేస్తుంది. ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని మృదువుగా, తేమగా ఉంచడంతో పాటు.. చర్మరంధ్రాల్లో ఇరుక్కున్న ధూళిని పూర్తిగా తొలగిస్తుంది.
ఈ గాడ్జెట్ ముందు భాగంలో.. అయాన్+, అయాన్, ఫేస్ లిఫ్టింగ్, ప్యాట్ మసాజ్, క్లీనింగ్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. ఆన్/ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్‌ని 2 సెకన్ల పాటు నొక్కి ఉంచితే సందర్భాన్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఈ స్కబ్బర్‌కి.. డేటా కేబుల్, కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల చర్మతత్వాలకు ఇది ఉపయోగపడుతుంది. డివైజ్ పై–క్యాప్ తొలగించి, అవసరమైన చోట చర్మానికి ఆనించి, మోడ్స్ ఆన్ చేసుకోవాలి. మోడ్ 1 బ్లాక్ హెడ్స్ రిమూవ్ చెయ్యడానికి, మోడ్ 2 క్లీనింగ్ చేయడానికి, మోడ్ 3 ఫేస్ లిఫ్టింగ్ కోసం (ముడతలు తొలగించేందుకు) ఇలా ఒక్కో మోడ్‌కి ఒక్కో ప్రయోజనం ఉంటుంది.
45 డిగ్రీల సెంటిగ్రేడ్ థర్మోస్టాటికల్ హైక్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ చిన్న పరికరాన్ని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. వయసు తెలియనీకుండా ముడతలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు.. కలర్ వచ్చేందుకు, మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గేందుకు ఇది సహాయపడుతుంది.
Skin Scrubber: వయసు తెలియనీకుండా, ముఖంపై ముడతల్ని పోగొట్టే గాడ్జెట్స్
Published Sun, Oct 3 2021 7:53 AM | Last Updated on Sun, Oct 3 2021 8:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment