Blackheads Prevention
-
బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా? ఈ డివైస్ ఉంటే నో ప్రాబ్లమ్
బ్లాక్‌హెడ్స్.. సౌందర్యాభిలాషులకు పెద్ద సమస్యే! ముక్కు, గడ్డం, నుదురు.. ఇలా ప్రతిచోట పుట్టుకొచ్చే బ్లాక్‌హెడ్స్, చర్మాన్ని కళావిహీనంగా మార్చేస్తాయి. అయితే వాటిని తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇప్పుడు.. మార్కెట్లో చాలా డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని క్లీనర్ కాస్త ప్రత్యేకమైంది. బ్లాక్‌హెడ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు.. ఏ చర్మం మీదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో.. ఆ చర్మాన్ని ఫోన్ స్క్రీన్ మీద క్లియర్‌గా చూసుకోవచ్చు. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. అందుకు ఈ మెషిన్‌కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. వాక్యూమ్ హోల్లో చిక్కిన చర్మం అద్దంలో కనిపించదు కాబట్టి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెషిన్‌కి నాలుగు ఇంటర్చేంజ్ హెడ్స్ లభిస్తాయి. వాటిని డివైస్‌కి అమర్చుకునే చోటే.. మాగ్నిఫికేషన్ డిస్ప్లే హై–డెఫినిషన్ లెన్స్‌తో ఒక కెమెరా ఉంటుంది. దాంతోనే ఫోన్లో చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్ ఫేషియల్ బ్లాక్‌హెడ్ వాక్యూమ్ క్లీనర్.. కూలింగ్ అండ్ హీటింగ్ కంప్రెస్ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఇది 40 డిగ్రీల సెల్సియస్ హీటింగ్ ఫంక్షన్‌తో.. బ్లాక్ హెడ్స్ లాగిన తర్వాత.. ఆ రంధ్రాలు పెద్దవి కాకుండా చర్మం కూడుకునేలా చేస్తుంది. దీనిలోని కూలింగ్ ఆప్షన్ చర్మాన్ని చల్లబరుస్తుంది. సాఫ్ట్, నార్మల్, స్ట్రాంగ్ అనే ఆప్షన్స్‌తో ఈ మెషిన్ వినియోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మొదట హెడ్స్ మార్చుకుని బ్లాక్ హెడ్స్ తొలగించుకున్నాక.. వెనక్కి తిప్పి.. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన మసాజర్‌తో ఆ ప్రదేశాన్ని మసాజ్ చేసుకోవాలి. దానికే హాట్ అండ్ కూల్ ఆప్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్ డివైస్‌గా వాడుకోవచ్చు. -
ముఖంపై ముడతల్ని పోగొట్టే ఈ గాడ్జెట్ గురించి తెలుసా?
అందంగా కనిపించడానికి లేపనాలెన్ని ఉన్నా.. వేగంగా ఫలితాన్నిచ్చే డివైజ్‌లకే మార్కెట్లో డిమాండ్! అలాంటిదే ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ పర్సనల్ స్కిన్ స్క్రబ్బర్. పైపై పూతలు ఎన్ని పూసినా రాని నిగారింపు.. ఈ సాధనంతో సాధ్యమవుతుంది. మాయిశ్చరైజింగ్, యాంటీ–ఏజింగ్, వైటెనింగ్‌తో పాటు మొటిమలు, మచ్చలు పొగొట్టడానికీ ఈ గాడ్జెట్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. 5 మోడ్స్‌తో కూడిన ఈ న్యూయెస్ట్ అల్ట్రాసోనిక్ అయానిక్ క్లీనర్.. ఫేస్ క్లీనర్లా, ఫేస్ స్క్రబ్బర్‌లా, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవల్‌గా కూడా పని చేస్తుంది. ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని మృదువుగా, తేమగా ఉంచడంతో పాటు.. చర్మరంధ్రాల్లో ఇరుక్కున్న ధూళిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలో.. అయాన్+, అయాన్, ఫేస్ లిఫ్టింగ్, ప్యాట్ మసాజ్, క్లీనింగ్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. ఆన్/ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్ని 2 సెకన్ల పాటు నొక్కి ఉంచితే సందర్భాన్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఈ స్కబ్బర్కి.. డేటా కేబుల్, కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల చర్మతత్వాలకు ఇది ఉపయోగపడుతుంది. డివైజ్ పై–క్యాప్ తొలగించి, అవసరమైన చోట చర్మానికి ఆనించి, మోడ్స్ ఆన్ చేసుకోవాలి. మోడ్ 1 బ్లాక్ హెడ్స్ రిమూవ్ చెయ్యడానికి, మోడ్ 2 క్లీనింగ్ చేయడానికి, మోడ్ 3 ఫేస్ లిఫ్టింగ్ కోసం (ముడతలు తొలగించేందుకు) ఇలా ఒక్కో మోడ్‌కి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. 45 డిగ్రీల సెంటిగ్రేడ్ థర్మోస్టాటికల్ హైక్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ చిన్న పరికరాన్ని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. వయసు తెలియనీకుండా ముడతలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు.. కలర్ వచ్చేందుకు, మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. -
బ్లాక్ హెడ్స్ నివారణ కోసం...
బ్యూటిప్స్ అయిదారు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్‌తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్‌ప్యాక్ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టేబుల్ స్పూన్ పెరుగులో టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి.