బ్లాక్‌హెడ్స్.. సౌందర్యాభిలాషులకు పెద్ద సమస్యే! ముక్కు, గడ్డం, నుదురు.. ఇలా ప్రతిచోట పుట్టుకొచ్చే బ్లాక్‌హెడ్స్, చర్మాన్ని కళావిహీనంగా మార్చేస్తాయి. అయితే వాటిని తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇప్పుడు.. మార్కెట్‌లో చాలా డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని క్లీనర్ కాస్త ప్రత్యేకమైంది. బ్లాక్‌హెడ్ ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు.. ఏ చర్మం మీదైతే ట్రీట్‌మెంట్ జరుగుతుందో.. ఆ చర్మాన్ని ఫోన్ స్క్రీన్ మీద క్లియర్‌గా చూసుకోవచ్చు. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. అందుకు ఈ మెషిన్‌కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.
వాక్యూమ్ హోల్‌లో చిక్కిన చర్మం అద్దంలో కనిపించదు కాబట్టి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెషిన్‌కి నాలుగు ఇంటర్‌చేంజ్ హెడ్స్ లభిస్తాయి. వాటిని డివైస్‌కి అమర్చుకునే చోటే.. మాగ్నిఫికేషన్ డిస్‌ప్లే హై–డెఫినిషన్ లెన్స్‌తో ఒక కెమెరా ఉంటుంది. దాంతోనే ఫోన్‌లో చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్ ఫేషియల్ బ్లాక్‌హెడ్ వాక్యూమ్ క్లీనర్.. కూలింగ్ అండ్ హీటింగ్ కంప్రెస్ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఇది 40 డిగ్రీల సెల్సియస్ హీటింగ్ ఫంక్షన్‌తో.. బ్లాక్ హెడ్స్ లాగిన తర్వాత.. ఆ రంధ్రాలు పెద్దవి కాకుండా చర్మం కూడుకునేలా చేస్తుంది. దీనిలోని కూలింగ్ ఆప్షన్ చర్మాన్ని చల్లబరుస్తుంది.
సాఫ్ట్, నార్మల్, స్ట్రాంగ్ అనే ఆప్షన్స్‌తో ఈ మెషిన్ వినియోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మొదట హెడ్స్ మార్చుకుని బ్లాక్ హెడ్స్ తొలగించుకున్నాక.. వెనక్కి తిప్పి.. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిన మసాజర్‌తో ఆ ప్రదేశాన్ని మసాజ్ చేసుకోవాలి. దానికే హాట్ అండ్ కూల్ ఆప్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్ డివైస్‌గా వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment