Black Heads
-
బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా? ఈ డివైస్ ఉంటే నో ప్రాబ్లమ్
బ్లాక్‌హెడ్స్.. సౌందర్యాభిలాషులకు పెద్ద సమస్యే! ముక్కు, గడ్డం, నుదురు.. ఇలా ప్రతిచోట పుట్టుకొచ్చే బ్లాక్‌హెడ్స్, చర్మాన్ని కళావిహీనంగా మార్చేస్తాయి. అయితే వాటిని తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇప్పుడు.. మార్కెట్లో చాలా డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని క్లీనర్ కాస్త ప్రత్యేకమైంది. బ్లాక్‌హెడ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు.. ఏ చర్మం మీదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో.. ఆ చర్మాన్ని ఫోన్ స్క్రీన్ మీద క్లియర్‌గా చూసుకోవచ్చు. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. అందుకు ఈ మెషిన్‌కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. వాక్యూమ్ హోల్లో చిక్కిన చర్మం అద్దంలో కనిపించదు కాబట్టి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెషిన్‌కి నాలుగు ఇంటర్చేంజ్ హెడ్స్ లభిస్తాయి. వాటిని డివైస్‌కి అమర్చుకునే చోటే.. మాగ్నిఫికేషన్ డిస్ప్లే హై–డెఫినిషన్ లెన్స్‌తో ఒక కెమెరా ఉంటుంది. దాంతోనే ఫోన్లో చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్ ఫేషియల్ బ్లాక్‌హెడ్ వాక్యూమ్ క్లీనర్.. కూలింగ్ అండ్ హీటింగ్ కంప్రెస్ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఇది 40 డిగ్రీల సెల్సియస్ హీటింగ్ ఫంక్షన్‌తో.. బ్లాక్ హెడ్స్ లాగిన తర్వాత.. ఆ రంధ్రాలు పెద్దవి కాకుండా చర్మం కూడుకునేలా చేస్తుంది. దీనిలోని కూలింగ్ ఆప్షన్ చర్మాన్ని చల్లబరుస్తుంది. సాఫ్ట్, నార్మల్, స్ట్రాంగ్ అనే ఆప్షన్స్‌తో ఈ మెషిన్ వినియోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మొదట హెడ్స్ మార్చుకుని బ్లాక్ హెడ్స్ తొలగించుకున్నాక.. వెనక్కి తిప్పి.. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన మసాజర్‌తో ఆ ప్రదేశాన్ని మసాజ్ చేసుకోవాలి. దానికే హాట్ అండ్ కూల్ ఆప్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్ డివైస్‌గా వాడుకోవచ్చు. -
మొహంపై బ్లాక్‌హెడ్స్ ఉన్నాయా? గోళ్లతో గిల్లుతూ.. నొక్కుతున్నారా?
ముఖంపై బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు చాలా మంది! ఈ సులువైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించేయొచ్చు! ► కనీసం వారానికొకసారయినా ఏదో ఒకరకం ఫేస్‌ప్యాక్ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి రావు. ► ముఖానికి నాణ్యమైన ఆస్ట్రింజెంట్ అప్లయ్ చేసి తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్ రావడానికి అవకాశం ఉండదు. ► ఫేషియల్ క్రీమ్‌ల వాడకం కూడా బ్లాక్‌హెడ్స్ రావడానికి కారణమవుతుంటుంది. అందుకని, వీటి వాడకాన్ని తగ్గించాలి. ► ప్రతిరోజూ మైల్డ్ స్క్రబ్ వాడుతుంటే మృతకణాలు తొలగడంతోపాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఏర్పడవు. గోళ్లతో గిల్లవద్దు ► బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో గిల్లడం కాని, నొక్కడంకాని చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మకణాలు సున్నితత్త్వాన్ని కోల్పోతాయి. దీంతో నునుపుదనం పోయి చర్మం గరుకుగా మారుతుంది. మచ్చలు, గీతలు పడడానికి అవకాశం ఎక్కువ. ►ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత ముఖమంతటినీ లేదా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని మునివేళ్లతో మెల్లగా నొక్కడం ద్వారా సులువుగా తొలగించవచ్చు. ► మార్కెట్లో దొరికే బ్లాక్‌హెడ్స్ రిమూవర్ వాడడం కూడా సులువైన మార్గమే. కాని వాటిని వాడినప్పుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి. -
Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ధర రూ. 2,830
ముడతలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు.. బాహ్యంగా సౌందర్యాన్ని, అంతర్లీనంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. హార్మోన్ల మార్పు, మృతకణాలు చర్మరంధ్రాల్లో కూడుకుపోవడం, వయసు ప్రభావంతో గీతలు, ముడతలు పడడం.. వంటివెన్నో ఆడవారిని ఇబ్బంది పెడుతుంటాయి. చిత్రంలోని ఈ హాట్ అండ్ కూల్ స్కిన్ కేర్ టూల్.. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది. ఈ డివైజ్.. బ్లాక్ హెడ్ రిమూవర్ పోర్ వాక్యూమ్ క్లీనర్లా, ఎలక్ట్రిక్ ఫేషియల్ అయాన్ బ్లాక్‌హెడ్ ఎక్స్ట్రాక్టర్ టూల్ డివైజ్‌లా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ని పోగొట్టడంతో పాటు.. జిడ్డును తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి మృదువుగా మార్చడం, చర్మాన్ని బిగుతుగా.. ముడతలు లేకుండా చేయడం వంటి అదనపు ప్రయోజనాలనూ అందిస్తుంది. ఈ డివైజ్‌తో పాటు లభించిన 5 మినీ హెడ్స్(చిత్రంలో గమనించవచ్చు).. 5 వేర్వేరు లాభాలను అందిస్తాయి. వాటిలో ‘లార్జ్ రౌండ్ హోల్ హెడ్’.. బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తే.. ‘స్మాల్ రౌండ్ హోల్ హెడ్’ సున్నితమైన భాగాల్లో ఉపయోగించేందుకు సహకరిస్తుంది. ‘మైక్రోక్రిస్టలైన్ హెడ్’ ముడతలను రూపమాపుతుంది. ‘మీడియం రౌండ్ హోల్ హెడ్’ మొండి బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తుంది. ‘ఓవల్ హోల్ హెడ్’ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్నిరకాల చర్మాలకూ ప్రొఫెష్నల్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఈ మినీ వాక్యూమ్ క్లీనర్. దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు. ఒకే ప్రదేశంలో రెండు సెకండ్ల కంటే ఎక్కువగా ఉంచరాదు. ఈ డివైజ్ లైట్‌వెయిట్‌గా ఉంటుంది కాబట్టి.. వినియోగించడం చాలా సులభం. దీని ధర 37 డాలర్లు. అంటే 2,830 రూపాయలు. చదవండి👉🏾 Health Tips: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే.. Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్
అందంగా, కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్నంతలో చక్కగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కొంత మందికి అనేక కారణాలతో ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి బ్లాక్‌హెడ్స్‌ను వదిలించుకోవడానికి చాలా మంది సెలూన్తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చాలా మంది భయపడుతుంటారు. చాలామంది ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా చర్మం పొడిబారి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండలో బయట తిరిగినప్పుడు ముఖం మీద ధూళి కణాలు చేరి చివరికి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటి చర్మ సమస్యలు గల వారికి చర్మం జిడ్డులాగా మారుతుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా ఇలాంటి వాటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అంతేగాక మీ చర్మం బయటి నుంచే కాకుండా లోపల నుంచి తాజాగా మెరిసిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు... అవేంటో వాటి వైపు ఓ కన్నేద్దాం... కావలసిన పదార్థాలు ► అరటిపండు ► తేనే(ఒక టేబుల్ స్పూన్) ► ఓట్స్(ముద్దగా చేయాలి) ఉపయోగించే విధానం ముందుగా అరటి పండును గుజ్జుగా, ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకొని అందులో ఓట్స్, తేనె, గుజ్జుగా చేసిన అరటిపండుతో కలిపి మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని జాగ్రత్తగా ముఖానికి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మాస్క్‌లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చివరగా ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉపయోగాలు.. ► ఓట్స్ వల్ల చర్మంలోని మృతకణాల తొలగించడంతోపాటు, ముఖంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది. ► అంతేగాక చర్మం నుంచి అధికంగా ఉన్న ఆయిల్‌ను గ్రహించే శక్తి ఓట్స్‌కు ఉంటుంది. ► ఇక తేనె ముఖంలోని బాక్టీరియాను పొగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ► మోముపై మెరుపును తీసుకువచ్చి..కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ► ఓట్స్, అరటిపండు మిక్స్ చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేటింగ్ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇది జిడ్డుగల చర్మం వారితోపాటు అన్ని రకాల చర్మం గల వారికి సహాయపడుతుది. ఇంకేందుకు ఆలస్యం ఇకపై ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు దీన్ని ప్రయత్నించండి. ఇక బ్లాక్‌హెడ్స్‌కు బై-బై చెప్పండి. -
మెరిసే చర్మం కోసం..
నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం బోలేడు డబ్బు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అందమైన మేనిని సొంతం చేసుకోవచ్చు. అదేలాగో చూడండి. శరీరం కాంతీవిహీనంగా మారడానికి ప్రధాన కారణం చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్, జిడ్డు. దానికి తోడు బయట వాతావరణంలోని దుమ్ము, ధూళీ మన శరీరం మీద బ్లాక్ హెడ్స్‌తో కలవడంతో మరిన్ని సమస్యలు. వీటి నివారణ కోసం జనాలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ.. బ్యూటీ ఉత్పత్తుల మీద డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కాస్త ఓపిక చేసుకుంటే.. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే.. చాలా తక్కువ ఖర్చుతో ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సహజమైన పదార్ధాలే కాబట్టి దుష్ప్రభావాల మాటే ఉండదు. అవేంటో మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు.. అరటి పండు(మెత్తనిది), ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్స్(పొడి చేసుకోవాలి), తేనె - 1 టేబుల్ స్పూన్ విధానం.. పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి. ముందుగా చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ ప్యాక్‌ను అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ఓట్స్ చర్మం మీద ధూళిని తొలగించడంతో పాటు శరీరంపై వచ్చే జిడ్డును నివారిస్తుంది. ఓట్స్, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడటంతో పాటు సూక్ష్మజీవుల నివారిణిగా కూడా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించడంలో అరటి ఎంతో సహాయపడుతుంది. -
హెల్త్‌టిప్స్
ముఖం మీద బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తుంటే నూనెలో వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. ఆహారంలో తాజా పండ్లు, పచ్చికూరగాయలతో చేసిన సలాడ్లు, మొలకెత్తిన గింజలు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోయి అనవసరమైన కొవ్వు శరీరంలోకి చేరకుండా చర్మం తాజాగా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చేవరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన రకరకాల క్రిమికీటకాలు, దుమ్ముధూళి చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి. -
‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం
క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి. క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది. క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసు కుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది.