అందంగా, కనిపించాలనే కోరిక ప్రతి ఒక‍్కరికీ ఉంటుంది. ఉన్నంతలో చక్కగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కొంత మందికి అనేక కారణాలతో ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి బ్లాక్‌హెడ్స్‌ను వదిలించుకోవడానికి చాలా మంది సెలూన్‌తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చాలా మంది భయపడుతుంటారు. చాలామంది ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా చర్మం పొడిబారి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.
ఇక ఎండలో బయట తిరిగినప్పుడు ముఖం మీద ధూళి కణాలు చేరి చివరికి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటి చర్మ సమస్యలు గల వారికి చర్మం జిడ్డులాగా మారుతుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా ఇలాంటి వాటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అంతేగాక మీ చర్మం బయటి నుంచే కాకుండా లోపల నుంచి తాజాగా మెరిసిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు... అవేంటో వాటి వైపు ఓ కన్నేద్దాం...
కావలసిన పదార్థాలు
► అరటిపండు
► తేనే(ఒక టేబుల్ స్పూన్)
► ఓట్స్(ముద్దగా చేయాలి)
ఉపయోగించే విధానం
ముందుగా అరటి పండును గుజ్జుగా, ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకొని అందులో ఓట్స్, తేనె, గుజ్జుగా చేసిన అరటిపండుతో కలిపి మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని జాగ్రత్తగా ముఖానికి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మాస్క్‌లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చివరగా ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఉపయోగాలు..
► ఓట్స్ వల్ల చర్మంలోని మృతకణాల తొలగించడంతోపాటు, ముఖంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది.
► అంతేగాక చర్మం నుంచి అధికంగా ఉన్న ఆయిల్‌ను గ్రహించే శక్తి ఓట్స్‌కు ఉంటుంది.
► ఇక తేనె ముఖంలోని బాక్టీరియాను పొగొట్టేందుకు ఉపయోగపడుతుంది.
► మోముపై మెరుపును తీసుకువచ్చి..కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది.
► ఓట్స్, అరటిపండు మిక్స్ చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేటింగ్ శక్తిని రెట్టింపు చేస్తుంది.
ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇది జిడ్డుగల చర్మం వారితోపాటు అన్ని రకాల చర్మం గల వారికి సహాయపడుతుది. ఇంకేందుకు ఆలస్యం ఇకపై ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు దీన్ని ప్రయత్నించండి. ఇక బ్లాక్‌హెడ్స్‌కు బై-బై చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment