నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం బోలేడు డబ్బు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అందమైన మేనిని సొంతం చేసుకోవచ్చు. అదేలాగో చూడండి. శరీరం కాంతీవిహీనంగా మారడానికి ప్రధాన కారణం చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్, జిడ్డు. దానికి తోడు బయట వాతావరణంలోని దుమ్ము, ధూళీ మన శరీరం మీద బ్లాక్ హెడ్స్‌తో కలవడంతో మరిన్ని సమస్యలు. వీటి నివారణ కోసం జనాలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ.. బ్యూటీ ఉత్పత్తుల మీద డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కాస్త ఓపిక చేసుకుంటే.. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే.. చాలా తక్కువ ఖర్చుతో ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సహజమైన పదార్ధాలే కాబట్టి దుష్ప్రభావాల మాటే ఉండదు. అవేంటో మీరు చూడండి.
కావాల్సిన పదార్థాలు..
అరటి పండు(మెత్తనిది), ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్స్(పొడి చేసుకోవాలి), తేనె - 1 టేబుల్ స్పూన్
విధానం..
పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి. ముందుగా చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ ప్యాక్‌ను అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ఓట్స్ చర్మం మీద ధూళిని తొలగించడంతో పాటు శరీరంపై వచ్చే జిడ్డును నివారిస్తుంది. ఓట్స్, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడటంతో పాటు సూక్ష్మజీవుల నివారిణిగా కూడా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించడంలో అరటి ఎంతో సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment