బ్లాక్ హెడ్స్ నివారణ కోసం...
బ్యూటిప్స్
అయిదారు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్‌తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్‌ప్యాక్ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
టేబుల్ స్పూన్ పెరుగులో టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి.