ఒంటి మీద కత్తి పడనివ్వను! | Jennifer Lopez says she’ll never get plastic surgery as she shines at 44 | Sakshi
Sakshi News home page

ఒంటి మీద కత్తి పడనివ్వను!

Published Thu, May 8 2014 10:59 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

ఒంటి మీద కత్తి పడనివ్వను! - Sakshi

ఒంటి మీద కత్తి పడనివ్వను!

హాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు జెన్నిఫర్ లోపెజ్. నటిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా, నృత్యకళాకారిణిగా...  ఇలా పలు శాఖల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు జెన్నిఫర్. ఆమెకు ప్లస్ పాయింట్ శరీరాకృతే. ఇప్పుడు జెన్నిఫర్ వయసు 44. వంటి మీదకు వయసొస్తుంటే.. శరీరాకృతిలో కూడా మార్పు రావడం సహజం. ఆ మార్పుని ఆహ్వానించదల్చుకోవడంలేదని జెన్నిఫర్ అంటున్నారు. కుర్రదానిలా కనిపించడానికి ఏమైనా చేయడానికి వెనుకాడనంటున్నారు.
 
 ఆమె మాటలు విన్నవాళ్లు అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటుందేమో అని చెప్పుకుంటుంటారు. ఈ మాటలకు జెన్నిఫర్ స్పందిస్తూ -‘‘అందమైన ఫిజిక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తే, అలాంటి ఫిజిక్కే అవసరం లేదనుకుంటా. ఎందుకంటే, నాకు సర్జరీ అంటే భయం. చక్కని శరీరాకృతి కోసం వంటి మీద కత్తి పడనివ్వను. కొంతమంది విషయంలో మంచి ఫలితం ఇచ్చినా, మరి కొంతమందికి మాత్రం వికటించింది. ప్లాస్టిక్ సర్జరీ కారణంగా తమ అందాన్ని కోల్పోయినవాళ్లున్నారు. అందుకే, ఆ సర్జరీకి నేను దూరం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement