కిస్సింగ్ టాక్! | kissing talk | Sakshi
Sakshi News home page

కిస్సింగ్ టాక్!

Published Sat, Jan 24 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

కిస్సింగ్ టాక్!

కిస్సింగ్ టాక్!

హాలీవుడ్ హాట్ బ్యూటీ జెన్నిఫర్ లోపెజ్ కాసేపు మనసు విప్పి మాట్లాడింది. ఓ టీవీ షోలో హోస్ట్ సరసమైన ప్రశ్నలకు అంతే చిలిపిగా సమాధానం చెప్పిందీ గడసరి. ఆన్‌స్క్రీన్ కిస్సుల్లో వరస్ట్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే... ‘30 సినిమాలు చేశా. అందులో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు బాగుండచ్చు.

కొన్ని బాగుండకపోవచ్చు. కానీ... ఎవరితోనూ నేను అంత బ్యాడ్‌గా ఫీలవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. దానికి కొనసాగింపుగా... ‘జార్జ్ క్లూనె కిస్సింగ్‌తో ఓకే’ అనేసింది. మరి హోస్ట్ వదులుతాడా..! ‘అంటే... జార్జ్ వరస్ట్ కిస్సరా’ అంటూ గుచ్చిగుచ్చి అడిగాడు అమ్మడిని. అందుకు పకపకా నవ్వేస్తూ... ఆపై సెలైంటయిపోయింది జెన్నీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement