george clooney
-
స్త్రీలోక సంచారం
జార్జి క్లూనీ అమెరికన్ నటుడు. నిర్మాత. బిజినెస్‌మ్యాన్. మూడుసార్లు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రతిభావంతుడు. ఇవన్నీ అలా ఉంచితే.. వయసులో పెద్దవాడు. 57 ఏళ్లు. యాభై ఏడేళ్లంటే పెద్ద వయసేం కాదు కానీ, 40 ఏళ్ల వయసుతో పోల్చి చూస్తే పెద్దవాడే. ఆయన భార్య అమల్ క్లూనీ వయసు నలభై ఏళ్లు. జార్జిలా ఆమె సెలబ్రిటీ కాదు. మానవహక్కుల కార్యకర్త. లాయర్. నాలుగేళ్ల క్రితమే వీళ్లకు పెళ్లయింది. జార్జిక్లూనీ మొదటి భార్య తాలియా బల్సామ్ వయసు జార్జి కన్నా రెండేళ్లు ఎక్కువ. 1989లో పెళ్లి చేసుకున్నారు. 1993లో విడిపోయారు. అమల్ క్లూనీకి ఇది మొదటి పెళ్లే. జార్జికీ, అమల్కి మధ్య పదిహేడేళ్ల వయసు దూరం ఉన్నా, ఇద్దరి మనసుల మధ్య మిల్లీమీటరు దూరం కూడా లేదు. మొదటే అమల్ తనకు దొరికితే బాగుండుని చాలాసార్లు అనుకున్నాడు క్లూనీ. ఆయనలోని ఈ ఫీలింగ్ తరచు బయటపడుతుంటుంది. రెండు రోజుల క్రి తం మళ్లీ బయటపడింది. ‘వెరైటీ’ పత్రిక ‘పవర్ ఆఫ్ ఉమెన్’ లాస్ ఏంజెలిస్ ఈవెంట్లో జార్జి క్లూనీ తనని తను పరిచయం చేసుకున్న తీరు అక్కడి వచ్చిన మహిళల్ని ముగ్ధుల్ని చేసి, చెంపకు చెయ్యి ఆన్చుకునేలా చేసింది. ‘‘హాయ్.. అయామ్ జార్జ్. అయామ్ అమల్ క్లూనీస్ హస్బెండ్’ అని స్టేజి మీద జార్జి క్లూని తనని తను పరిచయం చేసుకోగానే చప్పట్లే చప్పట్లు. అంత పెద్దాయన తన భార్యను తనకన్నా ‘పెద్ద’ మనిషినిగా పరిచయం చెయ్యడం ముచ్చటైన సంగతే కదా. ఇంటిపనుల్లో తల్లికి సహాయం చేసే పిల్లలు, భార్యకు చేదోడుగా ఉండే జీవిత భాగస్వామి దాదాపుగా కనిపించరు. పాపం ఆమె ఒక్కటే ఇంటిల్లపాదికీ పనులు చేసి పెడుతూ రోజంతా సతమతం అవుతుంటుంది. ఎవరు చెబితే వింటారు ఈ పిల్లలు, భర్తలు?! అయినా ఒకళ్లు చెప్పే విషయమా ఇది! కళ్ల ముందు సాటి మనిషి రెక్కలు ముక్కలవుతుంటే చూస్తూ ఎలా ఉండగలం? ‘మన మనిషే కదా’ అనే కదా! ఇక ఇప్పుడైతే కళ్లముందు మనకు స్మార్ట్‌ఫోన్ తప్ప ఏమీ ఉండడం లేదు. సాధ్యం కాక కానీ, బాత్రూమ్కి వెళ్లడం, స్నానం చెయ్యడం కూడా సెల్ఫోన్లోనే చేసేలా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు, వారి తండ్రులు. ఈ స్మార్ట్ఫోన్లు, శోధన సైట్లు వచ్చాక మనుషులు మరీ ఎంతగా మనుషులు కాకుండా పోతున్నారో సునీల్ అగర్వాల్, అజిత్ నైనన్ అనే కార్టూనిస్టులు జంటగా ప్రతిరోజూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కార్టూన్స్ వేస్తుంటారు. సోమవారం ఒక కార్టూన్ వచ్చింది. మదర్స్‌డే పై వచ్చిన కార్టూన్ అది. అయితే 365 డేస్కీ సరిపోయేలా ఉంది. ఓ తల్లి.. తనకున్న రెండుచేతుల్తోనే ఇంటిపనులన్నీ చేస్తుంటుంది. ఆమె ప్రయాసను అర్థం చేసుకున్న పెంపుడు కుక్క ఆమె వెంటే ఉండి, నోటితో క్లీనింగ్ క్లాత్ పట్టుకుని ఆమెకు అందించడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ ఇంట్లోని తండ్రీ కొడుకులు కూడా ఆమెకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటారు! ఇద్దరూ బీన్ బ్యాగ్‌లో కూర్చొని ‘ఇంటి పనుల్లో సహాయం చెయ్యడం ఎలా?’ అని ల్యాప్‌టాప్‌లో వెదుకుతుంటారు! సామాజిక, కుటుంబ ధోరణుల్ని సుతిమెత్తగా విమర్శించిన ఈ కార్టూన్‌ను చూస్తే వచ్చే నవ్వు కన్నా, వెంటనే లేచి ఏదైనా హెల్ప్ చెయ్యాలన్న ప్రేరణే ఎక్కవగా కలుగుతుంది. గంగానది సంరక్షణకు ఉద్యమించి, ఈ ఏడాది జూన్ 22 నుంచి ఆమరణ దీక్ష చేస్తూ 112 వ రోజైన అక్టోబర్ 11న (గురువారం) మరణించిన 86 ఏళ్ల కాన్పూర్ ఐ.ఐ.టి. ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్) దీక్షాస్ఫూర్తిని.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీపాల్ అందుకున్నారు. గంగానదిలో అక్రమ తవ్వకాలకు, జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా జ్ఞానస్వరూప్ నిరశనకు కూర్చుంటే.. బచేంద్రీపాల్ 40 మంది వలంటీర్లతో కలిసి ‘మిషన్ గంగ’ పేరిట గంగానది ప్రక్షాⶠన కోసం ముప్పై రోజులపాటు గంగానది ఉపరితల జలాలపై పడవల్లో సాహసయాత్ర (రాఫ్టింగ్ ఎక్స్‌పెడిషన్) నిర్వహించబోతున్నారు. జలశుద్ధి, నీటి వృథా నివారణలపై భక్తులకు అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న ఈ యాత్ర.. దేశవ్యాప్తంగా గంగానది ప్రవహించే ఎనిమిది ప్రధాన నగరాలను కలుపుకుంటూ సాగుతుంది. ‘‘మొత్తం 1500 కి.మీ.ల రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఆగిన ప్రతి నగరంలోనూ మూడు రోజులు ఉంటాం. అక్కడి యువతీయువకులను, పాఠశాల విద్యార్థులను గంగానదిని కాలుష్యం నుండి కాపాడుకోవలసిన అవసరంపై చైతన్యపరిచి ముందుకు సాగుతాం’’ అని బచేంద్రీపాల్ వివరించారు. 64 ఏళ్ల పాల్ 1954 మే 24న ‘బంపా’లో (ప్రస్తుత ఉత్తరాంచల్) జన్మించారు. తన ముప్పవయ యేట 1984లో సరిగ్గా తన పుట్టిన రోజుకు ముందు రోజు (మే 23) మధ్యాహ్నం 1.7 నిముషాలకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. -
అంగరంగ వైభవంగా..
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్‌ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను.. బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్‌పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. హాజరైన ప్రియాంక చోప్రా.. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు -
ఆయనతో ఎవరూ మ్యాచ్ కాలేరు!
ఎదుటి వ్యక్తి మనస్తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. అయితే వాళ్ల మాట తీరు, చూపులు, శారీరక భాషని పరిశీలిస్తే ఆ వ్యక్తి ‘ఇలాంటివాడు’ అని కొంతవరకూ అర్థమవుతుంది. ఇప్పుడు అనుష్కను తీసుకుందాం. ఆమెని చూడగానే మంచి అందగత్తె అనిపిస్తుంది. మాటలు కలిపితే ‘నైస్ పర్సన్’ అనుకోకుండా ఉండలేం. మరి.. ఎదుటి వ్యక్తిని అనుష్క ఎలా ఎనలైజ్ చేస్తారు? అనే విషయానికొస్తే.. కళ్లను పరిశీలిస్తారట. ఎలాంటి మగవాళ్లను ఇష్టపడతారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే - ‘‘కళ్లల్లో నిజాయతీ కనిపించాలి. అలాంటి మగాళ్లంటే ఇష్టం. అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్న మగాళ్లతో మాట్లాడటం నాకిష్టం ఉండదు. మన కళ్లు మనం ఎలాంటి వ్యక్తో చెప్పేస్తాయ్. అలాగే, నవ్వు కూడా చెప్పేస్తుంది. స్వచ్ఛంగా నవ్వే అబ్బాయిలంటే ఇష్టం. జార్జ్ క్లూనీ (హాలీవుడ్ నటుడు) కళ్లల్లో నిజాయితీ కనిపిస్తుంది (నవ్వుతూ). నాకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉన్నవాళ్లు అలానే ఉండాలనీ, నిజాయతీగా ఉండాలనీ కోరుకుంటాను. లక్కీగా నా సర్కిల్లో అందరూ అలాంటివాళ్లే ఉన్నారు’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మ్యాన్‌కి నిదర్శనం మా నాన్నగారు. ఆయన్ను మ్యాచ్ కావడం ఏ అబ్బాయి వల్లా కాదు’’ అని తండ్రి పట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని వ్యక్తపరిచారు అనుష్క. -
సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు
లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్‌కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు. సౌత్ ఆక్స్ఫర్డ్షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్‌కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్‌కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు. -
కిస్సింగ్ టాక్!
హాలీవుడ్ హాట్ బ్యూటీ జెన్నిఫర్ లోపెజ్ కాసేపు మనసు విప్పి మాట్లాడింది. ఓ టీవీ షోలో హోస్ట్ సరసమైన ప్రశ్నలకు అంతే చిలిపిగా సమాధానం చెప్పిందీ గడసరి. ఆన్‌స్క్రీన్ కిస్సుల్లో వరస్ట్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే... ‘30 సినిమాలు చేశా. అందులో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు బాగుండచ్చు. కొన్ని బాగుండకపోవచ్చు. కానీ... ఎవరితోనూ నేను అంత బ్యాడ్‌గా ఫీలవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. దానికి కొనసాగింపుగా... ‘జార్జ్ క్లూనె కిస్సింగ్తో ఓకే’ అనేసింది. మరి హోస్ట్ వదులుతాడా..! ‘అంటే... జార్జ్ వరస్ట్ కిస్సరా’ అంటూ గుచ్చిగుచ్చి అడిగాడు అమ్మడిని. అందుకు పకపకా నవ్వేస్తూ... ఆపై సెలైంటయిపోయింది జెన్నీ!