సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు | George Clooney wife Amal receives death threats, security boosted | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు

Published Mon, Mar 7 2016 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు

సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు

లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు.

సౌత్ ఆక్స్ఫర్డ్షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement