Hollywood superstar
-
సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు
లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్‌కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు. సౌత్ ఆక్స్ఫర్డ్షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్‌కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్‌కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు. -
హెచ్ఐవీ సోకిన ఆ సూపర్ స్టార్ ఎవరు?
న్యూయార్క్: హెచ్ఐవీ కలిగిన ఆ హాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరనే విషయం ఇప్పుడు హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన సెలబ్రిటీల్లో కలవరం రేపుతోంది. కనీసం ఆయనతో 50 మంది సెలబ్రిటీలు లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, వారిలో ఐదుగురు పోర్న్ స్టార్లే కాకుండా ఓ అవార్డు విన్నింగ్ హాలివుడ్ నటి, ప్రముఖ టీవీ షో ప్రెజెంటర్, ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ ఉన్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పోర్న్ స్టార్ మీడియాకు తెలిపారు. ఆ హాలివుడ్ సూపర్ స్టార్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, సేఫ్ సెక్స్ విధానం విఫలమవడం వల్ల తాను ఓ సారి గర్భవతిని కూడా అయ్యాయని, తప్పనిసరై అబార్షన్ చేయించుకున్నానని ఆ పోర్న్ స్టార్ తెలిపారు. ఆ హాలివుడ్ స్టార్‌కు హెచ్ఐవీ సోకినట్టు డాక్టర్లు ధ్రువీకరించిన నేపథ్యంలో తానూ అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నానని, అదృష్టవశాత్తు ఆ జబ్బు తనకు సోకలేదని ఆమె వివరించారు. తన పేరు వెల్లడించేందుకు తానేమి సిగ్గు పడడం లేదని, తన పేరు తెలిస్తే ఆ హాలివుడ్ స్టార్ పేరు కూడా వెల్లడవుతుందని, అప్పుడు ఆయన బాధితులంతా ఆయనపై కోర్టు కేసులువేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్టారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయనకు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని తాను ఆశిస్తున్నానని, అది ఆయన సామాజిక బాధ్యత కూడా అని పోర్న్ స్టార్ వ్యాఖ్యానించారు. అలా ఒప్పుకోవడం వల్ల తోటివారకి మంచి చేసినట్టు అవుతుందని, ఆయన పేరు తెలిస్తే ఆయనతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న వారంతా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం, మున్ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. హెచ్ఐవీ సోకిన ఆ హాలివుడ్ స్టార్ ఎవరనే విషయమై సామాజిక వెబ్సైట్లు ముఖ్యంగా, ఫేస్బుక్, ట్విట్టర్లో పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎవరి ఊహకు అందిన పేర్లను వారు ప్రచారంలో పెడుతున్నారు. ఎక్కువ మంది ఉమనైజర్ల పేర్లనే పేర్కొంటున్నారు. వారిలో ‘టిన్సెల్ టౌన్’ ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితమే హాలివుడ్ స్టార్‌కు హెచ్ఐవీ ఉన్నట్టు తనకు తెల్సిందని మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పోర్న్ స్టార్ తెలిపారు. ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన ఐదుగురు పోర్న్ స్టార్లు అప్పుడే పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయారని, ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు స్వలింగ సంపర్కులతోని (బెసైక్సువల్) కూడా సంభంధాలు ఉన్నాయని, ఆ విషయం ఇప్పుడు తనను కూడా భయపెడుతోందని, ఎందుకంటే ఈ వారంతంలో తన షూటింగ్ ప్రారంభమవుతోందని చెప్పారు. ఆ షూటింగ్లో తనతో భాగస్వామిగా పాల్గొనే వారికి, ఆయనతో కూడా లైంగిన సంబంధాలు ఉండే ఉంటాయన్నది తన ఆందోళన అని ఆ పోర్న్ స్టార్ వివరించారు. -
రజనీతో హాలీవుడ్ సూపర్ స్టార్?
త్వరలో ఒక వండర్ఫుల్ మల్టీస్టారర్ చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై ఎక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అదేమిటన్నది చాలామందికి చాలా వరకు అర్థం అయ్యి ఉంటుంది. ఎస్ సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డెరైక్టర్ శంకర్ల కాంబినేషన్లో ఎందిరన్ 2 తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో ఇంతకు ముందు ఎందిరన్ చిత్రం రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గురించి ఊహాగానాలు ఎప్పటి నుంచో మొదలైనా, ఎందిరన్ 2 కథను వండడంలో శంకర్ చాలా సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.అయితే ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను సియాన్ విక్రమ్ పోషించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇందులో బాలీవుడ్ భామ విద్యాబాలన్ రజనీకాంత్ సరసన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికీ మించిన అబ్బురపరచే అంశం ఏమిటంటే ఎందిరన్ 2లో ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోపాటు హాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు, టెర్మినేటర్ ఫేమ్ ఆర్నాల్డ్ నటించే అవకాశం ఉందన్నదే. ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్నాల్డ్, శంకర్ దర్శకత్వంలో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అభిలాషను శంకర్ నెరవేర్చేపనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కే బ్రహ్మాండ చిత్రం ఎందిరన్ 2 అవుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. -
ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం
హాలీ వుడ్ సూపర్‌స్టార్, కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ నుంచి ఐ చిత్ర హీరో సియాన్ విక్రమ్‌కు ఆహ్వానం అందిందన్నది తాజా సమాచారం. రియలిస్టిక్ యాక్షన్ కథా చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులతోపాటు యావత్ ప్రపంచ సినీ అభిమానులను అలరించి సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ కాలిఫోర్నియా గవర్నర్‌గా కూడా అక్కడి ప్రజల విశేష ఆదరణ పొందుతున్నారు. అలాంటి ప్రఖ్యాత నటుడు, ప్రజా నాయకుడు ఇటీవల చెన్నైలో జరిగిన ఐ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆయన తన బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఆ చిత్ర హీరో విక్రమ్‌తో మనసు విప్పి మాట్లాడలేకపోయారు. ఐ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మాట్లాడుతూ విక్రమ్‌ను ఆర్నాల్డ్ కాలిఫోర్నియాకు ఆహ్వానించిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. నటుడు విక్రమ్ కూడా ఆర్నాల్డ్ ఆహ్వానాన్ని స్వీకరించారని, ఆయన్ని కలుసుకోవడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఐ చిత్రం విడుదలకు ముందే విక్రమ్ కాలిఫోర్నియాకు వెళ్లి రానున్నారని ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రం నవంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.