ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం | Arnold Schwarzenegger invites Vikram to California | Sakshi
Sakshi News home page

ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం

Published Tue, Oct 21 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం

ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం

 హాలీ వుడ్ సూపర్‌స్టార్, కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ నుంచి ఐ చిత్ర హీరో సియాన్ విక్రమ్‌కు ఆహ్వానం అందిందన్నది తాజా సమాచారం. రియలిస్టిక్ యాక్షన్ కథా చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులతోపాటు యావత్ ప్రపంచ సినీ అభిమానులను అలరించి సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ కాలిఫోర్నియా గవర్నర్‌గా కూడా అక్కడి ప్రజల విశేష ఆదరణ పొందుతున్నారు. అలాంటి ప్రఖ్యాత నటుడు, ప్రజా నాయకుడు ఇటీవల చెన్నైలో జరిగిన ఐ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
 అయితే ఆయన తన బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఆ చిత్ర హీరో విక్రమ్‌తో మనసు విప్పి మాట్లాడలేకపోయారు. ఐ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మాట్లాడుతూ విక్రమ్‌ను ఆర్నాల్డ్ కాలిఫోర్నియాకు ఆహ్వానించిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. నటుడు విక్రమ్ కూడా ఆర్నాల్డ్ ఆహ్వానాన్ని స్వీకరించారని, ఆయన్ని కలుసుకోవడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఐ చిత్రం విడుదలకు ముందే విక్రమ్ కాలిఫోర్నియాకు వెళ్లి రానున్నారని ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రం నవంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement