సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అభిమానులకు ఎక్కడా లేని సంబురం. బ్యానర్లు కట్టడం దగ్గరి నుంచి సోషల్ మీడియా ప్రచారం దాకా మామూలు హడావిడి ఉండదు.అయితే ఆ అభిమానం అన్నివేళలా ఆదుకుంటుందనే గ్యారెంటీ ఉండదు!. ఫ్యాన్స్ సంగతేమోగానీ తన కుటుంబం తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని అనుకున్నాడట హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్. కానీ, దానికి విరుద్ధంగా సొంత బిడ్డలే తనను అస్యహించుకున్నారని చెబుతున్నాడు.
డెబ్భై మూడేళ్ల వయసున్న ఆర్నాల్డ్.. ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. నటుడిగా ఉన్న నేను గవర్నర్‌గా ఎన్నికయ్యాక నా పిల్లలు ఎంతో సంతోషిస్తారని అనుకున్నా. కానీ, వాళ్లు ఆ టైంలో నన్ను, నా పదవిని ఎంతో అసహ్యించుకున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నాతో పాటు సెట్స్‌లోకి వచ్చి సందడి చేశారు. అది వాళ్లకు వినోదం. కానీ, రాజకీయాల సాకుతో వాళ్లను హాలీవుడ్ నుంచి షిప్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదు. పైగా అక్కడ(కాలిఫోర్నియా) నేనేం అభివృద్ధి చేయలేదని వాళ్ల అభిప్రాయం. నా పరిమితులు నాకుంటాయి కదా. అది వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే నా రాజకీయాలు వాళ్లకు అసహ్యంగా అనిపించాయి. నన్నూ ద్వేషించారు’ అని చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్.
‘రాజకీయాలు.. సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం లాంటివి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మునిగిపోక తప్పదని రొనాల్డ్ రీగన్ లాంటి స్వఅనుభవం ఉన్నవాళ్లు ఏనాడో చెప్పారు. అది నాకు తర్వాతే అర్థమైంది’ అని ఆర్నాల్డ్ తెలిపాడు. కాగా, 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేశాడు ఆర్నాల్డ్. ప్రస్తుతం కొత్త సినిమాలేమీ ఓకే చేయని ఆర్నాల్డ్.. 2019లో టెర్మినేటర్ డార్క్ ఫేట్ ద్వారా తెరపై కనిపించారు.
చదవండి: లులు అంటే ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment