హెచ్‌ఐవీ సోకిన ఆ సూపర్ స్టార్ ఎవరు?
న్యూయార్క్: హెచ్‌ఐవీ కలిగిన ఆ హాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరనే విషయం ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన సెలబ్రిటీల్లో కలవరం రేపుతోంది. కనీసం ఆయనతో 50 మంది సెలబ్రిటీలు లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, వారిలో ఐదుగురు పోర్న్ స్టార్లే కాకుండా ఓ అవార్డు విన్నింగ్ హాలివుడ్ నటి, ప్రముఖ టీవీ షో ప్రెజెంటర్, ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ ఉన్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పోర్న్ స్టార్ మీడియాకు తెలిపారు.
ఆ హాలివుడ్ సూపర్ స్టార్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, సేఫ్ సెక్స్ విధానం విఫలమవడం వల్ల తాను ఓ సారి గర్భవతిని కూడా అయ్యాయని, తప్పనిసరై అబార్షన్ చేయించుకున్నానని ఆ పోర్న్ స్టార్ తెలిపారు. ఆ హాలివుడ్ స్టార్‌కు హెచ్‌ఐవీ సోకినట్టు డాక్టర్లు ధ్రువీకరించిన నేపథ్యంలో తానూ అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నానని, అదృష్టవశాత్తు ఆ జబ్బు తనకు సోకలేదని ఆమె వివరించారు. తన పేరు వెల్లడించేందుకు తానేమి సిగ్గు పడడం లేదని, తన పేరు తెలిస్తే ఆ హాలివుడ్ స్టార్ పేరు కూడా వెల్లడవుతుందని, అప్పుడు ఆయన బాధితులంతా ఆయనపై కోర్టు కేసులువేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ స్టారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయనకు హెచ్‌ఐవీ ఉన్న విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని తాను ఆశిస్తున్నానని, అది ఆయన సామాజిక బాధ్యత కూడా అని పోర్న్ స్టార్ వ్యాఖ్యానించారు. అలా ఒప్పుకోవడం వల్ల తోటివారకి మంచి చేసినట్టు అవుతుందని, ఆయన పేరు తెలిస్తే ఆయనతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న వారంతా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం, మున్ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
హెచ్‌ఐవీ సోకిన ఆ హాలివుడ్ స్టార్ ఎవరనే విషయమై సామాజిక వెబ్‌సైట్లు ముఖ్యంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎవరి ఊహకు అందిన పేర్లను వారు ప్రచారంలో పెడుతున్నారు. ఎక్కువ మంది ఉమనైజర్ల పేర్లనే పేర్కొంటున్నారు. వారిలో ‘టిన్‌సెల్ టౌన్’ ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితమే హాలివుడ్ స్టార్‌కు హెచ్‌ఐవీ ఉన్నట్టు తనకు తెల్సిందని మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పోర్న్ స్టార్ తెలిపారు.
ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన ఐదుగురు పోర్న్ స్టార్లు అప్పుడే పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయారని, ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు స్వలింగ సంపర్కులతోని (బెసైక్సువల్) కూడా సంభంధాలు ఉన్నాయని, ఆ విషయం ఇప్పుడు తనను కూడా భయపెడుతోందని, ఎందుకంటే ఈ వారంతంలో తన షూటింగ్ ప్రారంభమవుతోందని చెప్పారు. ఆ షూటింగ్‌లో తనతో భాగస్వామిగా పాల్గొనే వారికి, ఆయనతో కూడా లైంగిన సంబంధాలు ఉండే ఉంటాయన్నది తన ఆందోళన అని ఆ పోర్న్ స్టార్ వివరించారు.