
అడిగినంత కట్నం ఇవ్వలేదని అత్తమామల అమానుషత్వం
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్‌ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్‌కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు.
యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment