in-laws
-
పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్..
కర్ణాటక: భర్తకు వేరే మహిళతో కలిసి రీల్స్ చేయటం ముఖ్యం. మరిదికి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని అశ్లీల వీడియోలు చూడడం ముఖ్యం. దీనిని ప్రశ్నించవలసిన అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళ ఒకరు బెంగళూరు తూర్పు విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ప్రమోద్ కుమార్, మరిది, అత్త మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. 2022 మే లో ప్రమోద్‌కుమార్‌తో బాధిత మహిళకు పెళ్లయింది. రూ.30 లక్షల ఖర్చు చేసి పెళ్లి చేయడంతో పాటు బాగా కట్న కానుకలిచ్చారు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు. కానీ మరో మహిళతో వీడియోలు చేస్తూ ఫేస్బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేసేవాడు. ఇక మరిది పని ఇంట్లో కూర్చుని నీలి చిత్రాలను చూడడంతో పాటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. సొంత ఇల్లు ఉందని నమ్మించి, తీరా బాడుగ ఇంటిలో ఉంటూ తనను మోసం చేశారని వాపోయింది. పుట్టింటి నుంచి మరింత డబ్బులు తీసుకురావాలని రాచి రంపాన పెడుతున్నారని తెలిపింది. -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త, అత్తమామలు
పట్నంబజారు (గుంటూరు): అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందిన నర్రా మనోజ్ఞ (29), ఆమె కుమార్తె తులసి (9 నెలలు) కేసులో భర్త కల్యాణ్ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్నారాయణలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి) ►అత్తింటివారే తమ కుమార్తెను చంపారని మనోజ్ఞ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అపార్ట్మెంట్ వాచ్మెన్, అక్కడ నివసించే కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. ►రెండు మృతదేహాలపై కనీసం రక్తం చుక్క కూడా లేకపోవడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ►శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం వరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంపై మనోజ్ఞ తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కరరావు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ►వివాహం అయిన నాటి నుంచి మనోజ్ఞను ఆమె తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై భర్త, అత్తమామలు దెప్పిపొడుస్తూ ఉండేవారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ►పుట్టింటికి కూడా వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేసేవారని మృతురాలి బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ►మనోజ్ఞ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తూ ఉండేదని, ఈ విషయంపై భర్త, అత్తమామలు వేధించేవారని పోలీసుల దృష్టికి వచ్చింది. ►ఇప్పటికే మనోజ్ఞ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న పలు ఆధారాలను సేకరిస్తున్నారు. ►మనోజ్ఞ, తులసిల మృతదేహాలకు ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. -
వివాహితపై దాడి
కడప అర్బన్ : కడప నగరంలోని శాస్త్రినగర్‌కు చెందిన యాస్మిన్ (25) అనే వివాహితపై అత్తమామ, ఆడబిడ్డ దాడి చేసి గాయపరిచారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాస్మిన్‌కు అబ్దుల్ రజాక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త జీవనాధారం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి అత్తమామలు హుసేన్‌సాహెబ్, ఫైజున్నీసా, ఆడబిడ్డ అయేషాలు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
యూపీలో రష్యా కోడలి ఆందోళన సుఖాంతం
-
ఆడపిల్ల పుట్టిందని..
హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భర్త ఇంటివారు తనను ఇంట్లోకి రానివ్వడంలేదని ఓ మహిళ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. నగరానికి చెందిన అర్చన అనే మహిళకు ఆడపిల్ల పుట్టడంతో.. భర్త ఇంటివారు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం రంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు పంపించింది. ఈ విషయం పై జూన్ 16లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. -
బంగారం వద్దు.. మొక్కలే ముద్దు...!
ఆ సందర్భం దంపతుల పర్యావరణ స్పృహకు మారుపేరుగా... ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా మారింది. పెళ్ళిలో సంప్రదాయానుసారం అందించే బంగారం, డైమండ్స్ కు బదులుగా అత్తమామలను వధువు... బహుమతిగా మొక్కలు కావాలని కోరడం... మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని భిండ్ జిల్లా కిసిపురా గ్రామమంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమం ప్రకృతి ప్రేమకు మారుపేరుగా నిలిచింది. 22 ఏళ్ళ సైన్స్ గ్రాడ్యుయేట్, వధువు ప్రియాంక తన అత్తవారు బహుమతిగా ఇచ్చే బంగారు నగలకు బదులు పచ్చని మొక్కలు కావాలని కోరడం ప్రత్యేకతగా నిలిచింది. ముందుగా అత్తమామలను ఆమె అభ్యర్థన ఆశ్చర్య పరచినా... చివరికి ఆమెలోని ప్రకృతి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ పర్యావరణంపై శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తి కోడలుగా రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. తనకు కాబోయే భార్య సంపద కంటే పర్యావరణంపై అధిక శ్రద్ధ చూపిస్తున్నతీరు ఎంతో ఆనందం కలిగించిందని వరుడు రవిచౌహాన్ ఓ పత్రికకు తెలిపారు. ఆభరణాల స్థానంలో ఆమె 10,000 మొక్కలను కోరడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అడవులను నరికేస్తున్న నేపథ్యంలో పచ్చదనం క్షీణించి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా మధ్య ప్రదేశ్ లో ఈ కారణంగా భూమిలో నీరు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వధువు ప్రియాంక తెలిపారు. . పంట నష్టాలతో తీవ్ర నిరాశ చెందిన తన తండ్రే ఇందుకు సాక్ష్యమని, పరావరణాన్ని రక్షించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలంటే పచ్చదనాన్ని పెంచాలన్న విషయాన్ని చిన్నతనంలోనే గుర్తించిన ప్రియాంక పెళ్ళి సందర్భాన్ని అందుకు అనువుగా మలచుకున్నారు. తాను కోరిన పదివేల మొక్కల్లో ఐదు వేలు తన తండ్రి ఇంట్లో, మరో ఐదు వేలు అత్తమామల ఇంట్లో పాతాలన్న యోచనతోనే మొక్కలను బహుమతిగా కోరానన్నారు. చిన్నతనంనుంచే పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకున్నానని, రైతులకు, కార్యకర్తలకు మొక్కలను పంచి పచ్చదనాన్ని మరింత పెంచాలన్నదే తన ఆశయమని ప్రియాంక చెప్తున్నారు. ఏప్రిల్ 22 న జరిగిన వివాహం అనంతరం దంపతులిద్దరూ గ్రామంలో రెండు మామిడి మొక్కలు పాతామని, అవి వాతావరణాన్ని రక్షిస్తాయన్న నమ్మకం ఉందని ఆమె చెప్తున్నారు. ఇకనుంచి ప్రతి పెళ్ళి రోజునాడు క్రమం తప్పకుండా మొక్కలు పాతే కార్యక్రమం చేపడతామని ప్రియాంక వెల్లడించారు. -
వితంతు కోడళ్లూ భరణానికి అర్హులే
లీగల్ కౌన్సెలింగ్ నేను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి ఏడాది అయినా గడిచిందో లేదో దురదృష్టవశాత్తూ మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి నేనూ, బాబూ అనాథలమైనాము. ఇప్పుడు బాబుకు మూడేళ్లు. మాది కులాంతర వివాహం కావడంతో నాకు పుట్టినింటి నుంచి ఏ అండా లేదు. అత్తింటి వారేమో మా కొడుకే పోయాక మీకూ మాకూ ఇక సంబంధం ఏమిటని నన్ను ఈసడించుకుంటున్నారు. నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. అటు పుట్టింటి అండాలేక, అత్తింటి ఆదరణా లేక చాలా ఇబ్బందిపడుతున్నాను. మా అత్తమామలు ధనవంతులు. ఏ బాధ్యతలూ లేనివారు. నాకు ఆస్తికోసం వారితో పోట్లాడటం ఇష్టం లేదు. మా ఇద్దరికీ నెలవారీ ఖర్చులకు సరిపడా మెయింటెనెన్స్ ఇస్తే చాలు. నాకు ఏదైనా ఆధారం దొరికాక అది కూడా అక్కరలేదు. నన్ను ఏం చేయమంటారు? కోడలిని పోషించవలసిన బాధ్యత అత్తమామలకు లేదా? - ఒక సోదరి, హైదరాబాద్ మీ పరిస్థితి దయనీయం. మీ ఆత్మగౌరవం హర్షణీయం. వితంతువైన కోడలు అత్తమామలనుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. మీరే కాదు, మీ బాబు కూడా. మీరు ఆశ్రయించవలసిన చట్టం ది హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్ట ప్రకారం తనను తాను పోషించుకోలేని, పోషణకు ఏ ఆధారమూ, ఆస్తిపాస్తులూ, ఆదాయమూ లేని వితంతువైన కోడలు మామగారి నుంచి సెక్షన్ 19ను అనుసరించి మెయింటెనెన్స్‌ను పొందవచ్చు. మీరు వెంటనే కోర్టును ఆశ్రయించండి. మీ వారికి రావలసిన ఆస్తిని కూడా మీ మామగారు ఇవ్వలేదు. కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చే అవకాశం కూడా ఉంది. నేను నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈలోగా నా భర్త, మా ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వత మనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ కంసెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసేనాడు 10 లక్షలు డి.డి. ఇస్తామని, విడాకులు మంజూరు చేసేనాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు? - సౌమ్య, విశాఖపట్నం మీరు చెప్పిన విషయాలు పిటిషన్లో రాసుకోవాలి. భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిన తర్వాతనే ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒకవేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ కావచ్చు. నా పేరు మంగ్లీ. నా మాజీ భర్త పేరు జామియా. మేము ఒక ట్రైబల్ తండాకు చెందినవారం. మాకు ఒక పాప ఉంది. కొన్ని కారణాల వల్ల మేమిరివురము మా తండా పెద్దల కుల పంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మారు మనువు చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాప కూడా నా దగ్గరే ఉంది. నా భర్త బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసి వెళ్తానని అడిగితే అంగన్వాడి స్కూల్ దగ్గరకు రమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలపాల్జేసి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయవలసిందిగా ప్రకటించమని కోర్టును ఆశ్రయించాడు. నేనసలు మొదటి భర్త నుండి విడాకులు తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి. - మంగ్లీ, ఆదిలాబాద్ అతని వాదనలో నిజం లేదు. మీ రెండవ వివాహం చెల్లుతుంది. ఎందుకంటే మీరు మొదటి భర్త నుండి తీసుకున్నది ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు/తెగలకు’ వారి ఆచారాలను, సంప్రదాయాలను తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి కులపెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29 (2) హిందూ వివాహ చట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఉన్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో ఉంటే చట్టం దానిని రక్షిస్తుంది అని అర్థం. కనుక మీరు మీవారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీ వర్షన్‌కు ఫేవర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్వారు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చారు. 1999 (6) ఎఎల్డి 413 (డిబి). మా పెళ్లయ్యి పాతికేళ్లయింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వారు బ్యాంక్‌మేనేజర్. ఇటీవలే వి.ఆర్.ఎస్ తీసుకున్నారు. నా సమస్యేమిటంటే, పెళ్లయినప్పటినుంచి ఇన్ని సంవత్సరాల వరకు నేను మా వారిని, పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాను. కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఆనందాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేశాను. నేను చేసిన పనులను మా వారు ఏనాడూ గుర్తించక పోగా ఎప్పుడూ ఏదో ఒక దానికి దెప్పి పొడిచేవారు. నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించేవారు కాదు. పిల్లల కోసమే నేను ఆయన పెట్టిన హింసలను ఇన్నాళ్లూ ఓపిగ్గా భరించాను. అయితే ఇటీవల కాలంలో ఆయన నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ఫిట్‌గా ఉన్నాననీ, ఈ వయసులో కూడా అమ్మాయిలు తనంటే పడి చస్తున్నారనీ నన్ను తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తున్నారు. నేనది సహించలేకపోతున్నాను. ఆయన ఉనికి కూడా భరించలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎ. సావిత్రి, విజయవాడ ఈ వయసులో మిమ్మల్ని ఆయన మీద కేసు పెట్టమని కానీ, విడాకులివ్వమని కానీ నేను మీకు సలహా ఇవ్వలేను. కానీ మీకు ఒక పరిష్కారం సూచించగలను. మీరు మొట్టమొదట మీ వారి ఉనికిని భరించలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఆయనతో కలిసి ఉండలేకపోతున్నారు. అతని మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు పై కారణాలన్నీ వివరిస్తూ, ఫ్యామిలీ కోర్టులో జుడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటిషన్ వేయండి. సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దీనిని విడాకులు లేకుండా విడిపోవడం అంటారు. కోర్టువారు విచారణ తర్వాత విడివిడిగా జీవించడానికి మీకు డిక్రీ ఇస్తారు. ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు. ఆస్తిహక్కులకు ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరక సంబంధాలు మాత్రం రద్దవుతాయి. ఇద్దరూ కలిసి జీవించే హక్కు తాత్కాలికంగా రద్దవుతుంది. అయితే ఒకే ఇంట్లో నివసించకుండా మీరు విడివిడిగా జీవించవలసి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంతరార్థం ఏమిటంటే పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మరలా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వడం. మీ భర్త తన ప్రవర్తనను మార్చుకుని, మిమ్మల్ని సక్రమంగా చూస్తానని మీకు నమ్మకం కలిగిస్తే, మీరు మరలా అతనితో మీ వివాహ బంధాన్ని కలుపుకుని కలిసి కాపురం చేయవచ్చు. ప్రయత్నించి చూడండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
ఇనుపకడ్డీలు కాల్చి కోడలికి వాతలు పెట్టారు
వరంగల్ : కోడలు మగపిల్లాడిని ఇవ్వలేదనే కారణంతో అత్తమామలు ఆమెను గొడ్డును బాదినట్టు బాది, ఇనుప కడ్డీలు కాల్చి ఆమె మెడపై వాతలు పెట్టారు. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాఘవాపురం గ్రామానికి చెందిన జొన్నల సమ్మయ్య(33)కు మొగుళ్లపల్లి మండలానికి చెందిన అరుణతో(28) ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగపిల్లలు పుట్టలేదని, ఆమెను చంపేసి సమ్మయ్యకు మరో పెళ్లి చేస్తే వంశోద్ధారకుడు పుడతాడని భావించిన సమ్మయ్య తల్లిదండ్రులు గత నాలుగేళ్లుగా అరుణను మానసికంగా వేధించడం ప్రారంభించారు. రానురాను వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం రాత్రి అరుణను తీవ్రంగా కొట్టిన అత్తమామలు లక్ష్మి, రాజయ్యలు ఇనుప కడ్డీలతో ఆమె మెడపై వాతలు పెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని అరుణను ఆస్పత్రికి తరలించి, అత్తమామలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. -
గిరిజన యువతిని వివస్త్ర చేసి.. గుండు గీసిన అత్తమామలు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి ఓ గిరిజన యువతి(19)ని ఆమె అత్తమామలే వివస్త్రను చేసి, గుండు గీశారు. ఈ సంఘటన ఆగస్టు 30వ తేదీన జరిగినా, ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయమై థానె జిల్లా షాహాపూర్ తాలూకా పడ్గా పోలీసు స్టేషన్లో ఆ యువతి శనివారం ఫిర్యాదుచేసింది. ఆరోజు వాళ్లు తనను వివస్త్రను చేసి, గుండుగీసి, తీవ్రంగా కొట్టారని తెలిపింది. వాళ్ల కొడుకు యోగేష్ పాటిల్‌ను పెళ్లి చేసుకున్నందుకే ఇలా చేశారని ఆరోపించింది. భివాండి పట్టణంలోని ఓ గోడౌన్లో తాను ప్యాకర్‌గా పనిచేస్తున్నప్పుడు యోగేష్‌తో పరిచయమై, అది ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. పెద్దలు వద్దన్నా కూడా అతడు మే నెలలో ఆమెను పెళ్లి చేసుకుని, అత్తవారింట్లోనే ఉన్నాడు. అయితే, ఆగస్టు 30న వాళ్లు ఆ ఇంటికి వెళ్తుండగా యోగేష్ కుటుంబసభ్యులు వారిని బలవంతంగా భివాండీలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరినీ గుమ్మానికి కట్టేశారు. తర్వాత యువతి బట్టలు విప్పి, ఆమెకు గుండుచేశారు. అంతేకాదు.. యోగేష్ సోదరుడు తన ఫొటోలు కూడా మొబైల్ ఫోన్లో తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. యువతి గ్రామ సర్పంచి సంతోష్ పాటిల్ ఆమెను రక్షించి, వారిని పడ్గా గ్రామానికి తీసుకెళ్లారు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. అత్తమామలపై 498ఎ, 354, 353, 504, 506, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.