కడప అర్బన్ : కడప నగరంలోని శాస్త్రినగర్‌కు చెందిన యాస్మిన్ (25) అనే వివాహితపై అత్తమామ, ఆడబిడ్డ దాడి చేసి గాయపరిచారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాస్మిన్‌కు అబ్దుల్ రజాక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త జీవనాధారం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి అత్తమామలు హుసేన్‌సాహెబ్, ఫైజున్నీసా, ఆడబిడ్డ అయేషాలు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.