వరంగల్ : కోడలు మగపిల్లాడిని ఇవ్వలేదనే కారణంతో అత్తమామలు ఆమెను గొడ్డును బాదినట్టు బాది, ఇనుప కడ్డీలు కాల్చి ఆమె మెడపై వాతలు పెట్టారు. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాఘవాపురం గ్రామానికి చెందిన జొన్నల సమ్మయ్య(33)కు మొగుళ్లపల్లి మండలానికి చెందిన అరుణతో(28) ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగపిల్లలు పుట్టలేదని, ఆమెను చంపేసి సమ్మయ్యకు మరో పెళ్లి చేస్తే వంశోద్ధారకుడు పుడతాడని భావించిన సమ్మయ్య తల్లిదండ్రులు గత నాలుగేళ్లుగా అరుణను మానసికంగా వేధించడం ప్రారంభించారు.
రానురాను వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం రాత్రి అరుణను తీవ్రంగా కొట్టిన అత్తమామలు లక్ష్మి, రాజయ్యలు ఇనుప కడ్డీలతో ఆమె మెడపై వాతలు పెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని అరుణను ఆస్పత్రికి తరలించి, అత్తమామలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
ఇనుపకడ్డీలు కాల్చి కోడలికి వాతలు పెట్టారు
Published Thu, Jul 2 2015 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement