injection
-
కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?
నాకు ఇప్పుడు ఐదవ నెల. ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటి వరకు ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీ, కాన్పు సమయంలో తీసుకోవాలి కాబట్టి చాలా భయంగా ఉంది ఏదైనా సలహా చెప్పండి? – ప్రణతి, గుంటూరు. నీడిల్ ఫోబియా లేదా ఇంజెక్షన్ ఫోబియా అనేది మామూలే! ఇది ప్రతి పదిమందిలో ఒకరికి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఐదవ నెల, ఏడవ నెలలలో టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కాన్పు సమయంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్లీడింగ్ కంట్రోల్‌కి ఇవి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే, భయం లేకుండా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంతకు ముందు, సూది గుచ్చినప్పుడు, రక్తాన్ని చూసిన అనుభవం ఉంటే, ఆ భయం అలాగే ఉండిపోతుంది. ఆ భయంతో కళ్లు తిరగటం, బీపీ, పల్స్ పెరగటం లేదా కళ్లుతిరిగి పడిపోవటం వంటివి జరగవచ్చు. ఇలా ఉన్నవారు ముందుగా నర్సింగ్ ష్టాఫ్, డాక్టర్‌కు తెలియజేయాలి. అప్పుడు కౌన్సెలింగ్ చేయటం, మీకు ఉన్న ఆప్షన్స్ చెప్పటం ద్వారా మీ భయాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అనస్థీషియా డాక్టర్ని పిలిపించి, శరీరంలో ఏ ప్రాంతంలో నుంచి రక్తం తియ్యాలో ఆ ప్రాంతానికి స్పర్శ తెలియకుండా చేయడానికి అరగంట ముందుగా క్రీమ్స్ పూస్తారు. అప్పుడు నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మాటల్లో పెట్టి రక్త నమూనాలు తీయటం లాంటివి నర్స్ కూడా చేస్తారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్‌తో స్లో బ్రీతింగ్ అలవాటు అవుతుంది. ఇది రోజుకు మూడుసార్లు ఒక వారం చేయాలి. ఇదే విధంగా రక్త నమూనాలు తీసే సమయంలో కూడా పాటిస్తే భయం ఉండదు. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ కొన్ని పరీక్షలు చాలా అవసరం. మీకు పుట్టబోయే బిడ్డకు ఏ ఇన్ఫెక్షన్స్, సమస్యలు రాకుండా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అందుకే, ముందు నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవటం, డాక్టరును సంప్రదించటం, మీ భయాలను డాక్టర్‌కు ముందుగానే చెప్పటం చేయాలి. సీనియర్ నర్స్ లేదా అనస్థిటిస్ట్తో రక్త నమూనాలను తీయించుకోవటం లేదా ఐవీ లైన్ పెట్టించుకోవటం మంచిది. వీటితోపాటు బ్రీతింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను పాటిస్తే, మీ భయం కొద్దికొద్దిగా తగ్గుతుంది.-డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...
ఏదైనా వ్యాధి సోకితే మానవుల్లోని వ్యాధి నిరోధక శక్తి / వ్యవస్థ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. అయితే... ఎయిడ్స్ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే... అది దేహంలోని జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తినే దెబ్బతీస్తుంది. దాంతో చిన్న చిన్న సాంక్రమిక వ్యాధులకే బాధితులు తేలిగ్గా లొంగిపోతారు. హెచ్ఐవి వైరస్ క్రిమికి ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రూపొందే పరిస్థితి లేదు. అయినప్పటికీ 25 రకాల ఏంటి రెట్రో వైరల్ ఔషధాల తోపాటు ఓ ఇంజెక్షన్‌తో ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని తేలింది. ఇది ఇంచుమించూ టీకాలాగే పనిచేస్తూ జబ్బు బారిన పడకుండా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. హెచ్ఐవీకి టీకా రూపొందించడానికి అనేక సాంకేతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... ఏదైనా టీకాను అభివృద్ధి చేస్తే... అది ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’ను ప్రేరేపితం చేస్తుంది. కానీ ఈ వైరస్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థలోని కీలక కణాలైన సీడీ4 లింఫోసైట్స్ తదితర కణాల జీన్స్‌లో కలిసిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోయి వ్యాధి నిరోధక వ్యవస్థే కుప్పకూలిపోయి, దీర్ఘ కాలంలో ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఎయిడ్స్‌కు టీకా అభివృద్ధి చేయడం సాధ్యం కా(లే)దు. అయినప్పటికీ హెచ్ఐవీని నిరోధించేందుకు పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌తో విప్లవాత్మక మార్పు... గతేడాది అంటే... 2024 జూలైలో దక్షిణ ఆఫ్రికాకి చెందిన పరిశోధకులు డాక్టర్ లిండా గేయిల్ బెక్కర్ తదితరులు... హెచ్ఐవీని నిరోధించడానికి ప్రీఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్గా ఓ సరికొత్త ఇంజక్షన్ ‘లెనకపావిర్’ సమర్థంగా పనిచేస్తుందని ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన ప్రయోగంలో... తమ భర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉండి... తాము మాత్రం నెగెటివ్ అయిన ఓ 3204 మంది మహిళలకు (అంటే... సీరో డిస్కార్డెంట్ విమెన్‌కు) టెనొఫోవిర్, ఎమ్ ట్రైసిటాబైన్ అనే మందులు ఇచ్చారుగానీ వారిలో 35 మందికి హెచ్ఐవీ సోకింది. ఇక మరో ప్రయోగంలో మరో 2134 మంది సీరో డిస్కార్డెంట్ మహిళలకి సరికొత్త ఔషధం అయిన లెనకపావిర్ (927 మిల్లీగ్రాముల) ఇంజక్షన్స్ ని ఆరు నెలలకు ఒకటి చొప్పున, ఏడాదిలో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వీళ్లలో ఒక్కరికి కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ సోకలేదు. దీంతో హైరిస్క్ గ్రూపుల్లో, అంటే... భర్త హెచ్ఐవి పాజిటివ్ అయి, భార్య నెగిటివ్‌గా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంజక్షన్స్‌తో ఎయిడ్స్‌ను సమర్థంగా నివారించవచ్చని తేలింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెనకపావిర్ ఇంజక్షన్ తాలూకు ఒక్క మోతాదు ఆరు నెలలపాటు రక్షణ ఇస్తుండడంతో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి ఈ ఇంజెక్షన్‌ను వాక్సిన్ (టీకా) తరహాలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అసలీ లెనకపావిర్ కాప్సిడ్ ఇన్హిబిటర్ ఎలా పనిచేస్తుదంటే... హెచ్ఐవీ తాలూకు జీన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్... ఈ అన్నింటినీ కలిపి ‘కోర్’ (న్యూక్లియో కాప్సిడ్) అంటారు. ఈ ‘కోర్’ని కలిపి ఉంచే ఒక సంచి వంటి నిర్మాణమే కాప్సిడ్. ఈ క్యాప్సిడ్ మూలంగానే హెచ్ఐవి తాలూకు ‘కోర్ ’కు ఓ శంఖువు లాంటి ఆకృతి వస్తుంది. ఈ కోర్ తాలూకు ప్రోటీన్‌నే ‘పీ 24 ఏంటిజెన్’గా పిలుస్తారు. ఇన్ఫెక్షన సోకిన తొలివారాల్లో దీన్ని గుర్తించడానికి ప్రత్యేక టెస్ట్‌లు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లెనాకపావిర్ అనేది ‘కాప్సిడ్ ఇన్హిబిటర్ ’ ఔషధం. అంటే... వైరస్ సంక్రమించే సందర్భంలో కాప్సిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు... న్యూక్లియస్ క్యాప్సిడ్ లోని భాగాలు ‘కోర్’గా మారి, దాని చుట్టూ సంచి వంటి కాప్సిడ్ ఏర్పడకుండా అడ్డుతుంది. అంతేకాదు... హెచ్ఐవీ జన్యువుల్లోని అణువులను అది మానవుల కణాల్లోకి విడుదల కాకుండా అడుకట్ట వేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ లోని జన్యువులను మనిషి జీన్స్‌లో కలిసే ప్రక్రియని అడ్డుకుంటుందని చెప్పవచ్చు. లెనాకపావిర్ ప్రత్యేకతలివి... ఇప్పటివరకు ఉన్న యాంటీ రెట్రోవైరల్ మందులు... హెచ్ఐవీ సోకి అది మానవుల్లో వృద్ధి చెందే దశల్లోని ఏదో ఒక దశలో మాత్రమే అడ్డుకొంటాయి. అయితే లెనాక΄ావిర్ మాత్రం హెచ్ఐవీ క్రిమి వృద్ధి చెందడాన్ని మూడు దశలలో అడ్డుకుంటుంది. అంతేకాదు... ఈ మందు ఆర్నెల్ల పాటు పనిచేస్తుంది. అంటే ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే ఏడాదంతా హెచ్ఐవీ / ఎయిడ్స్ రాకుండా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే... ముందుగా ఓ టీకా, ఆర్నెల్ల తర్వాత ఓ బూస్టర్ డోస్ ఎలా పనిచేస్తాయో, ఈ ఇంజెక్షన్ తాలూకు రెండు మోతాదులు అదే పనిచేస్తాయి. పైగా హెచ్ఐవీ బాధితులకు ఇప్పుడు అనేక మందుల్ని రకరకాల కాంబినేషన్లలో వాడుతుంటారు. మందులు పెరుగుతున్న కొద్దీ హెచ్ఐవి క్రిమి వాటికి రెసిస్టెన్స్ పెంచుకుని, వాటికి లొంగకుండా తయారయ్యే అవకాశాలెక్కువ. అలాంటి వారిలో లెనకపావిర్ను ఏదో ఒక మందుతో కలిపి వాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు కూడా లెనకపావిర్ అనే ఈ ఇంజెక్షన్ ఎయిడ్స్ బాధితుల పాలిట ఆశారేఖగా నిలుస్తోంది.అదుపునకు కొన్ని మార్గాలివి...కండోమ్స్, డిస్పోసబుల్ సిరంజీల వాడకం తోపాటు, బ్లడ్ బ్యాంకులలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తిని కొంతమేరకు అదుపు చేయడం సాధ్యమైంది. అయితే ఈ జబ్బుకు గురయ్యేందుకు అవకాశమున్న అనేక వర్గాలకు ముందుగానే ఇచ్చేలా ‘ప్రీ ఎక్సపోజర్ ప్రొఫైలాక్సిస్’ (ప్రెప్ ) వంటి ప్రక్రియలూ, అలాగే ఈ జబ్బు ఉన్న వారికి సేవలు చేసే సందర్భాలలో ప్రమాదవశాత్తు జబ్బు వచ్చే అవకాశం ఉన్న డాక్టర్లు, నర్సుల వంటివారికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్’ (పెప్)ల వంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: సార్కోమాను ఎదుర్కోలేమా!) -
కండల కోసం ఆశపడితే ఖతం!
సాక్షి, సిటీబ్యూరో/విజయనగర్‌కాలనీ: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా కండలు పెంచడానికి కొందరు యువకులు వీటిని బ్లాక్‌లో కొని మరీ వినియోగిస్తున్నారు. జిమ్‌లలో అత్యధిక సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ మందులు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. ఉత్తరాది నుంచి మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్న నలుగురు నిందితులను సౌత్–వెస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ అందె శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిమ్ ఏర్పాటుతో ఆరి్థక ఇబ్బందులుమహారాష్ట్రకు చెందిన రషీద్ ఖాన్ నగరానికి వలసవచ్చి జిర్రాలోని నట్రాజ్ నగర్లో నివసిస్తున్నాడు. తొలినాళ్లల్లో జిమ్ ట్రైనర్‌గా, ఆపై పర్సనల్ ట్రైనర్‌గా పని చేసిన రషీద్ మెహదీపట్నంతో సొంతంగా ఆర్కే జిమ్ పేరుతో వ్యాయామశాల ఏర్పాటు చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో జిమ్ మూసేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. జిమ్‌లకు వచ్చే యువత ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్స్‌గా వాడుతున్న మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లకు నగరంలో భారీ డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని అక్రమంగా విక్రయిస్తూ 2022లో చంద్రాయణగుట్ట పోలీసులకు చిక్కాడు. అయినప్పటికీ పంథా మార్చుకోని ఇతగాడు అదే విధానం కొనసాగించాడు. ఆన్లైన్లో ఖరీదు చేసి దళారుల ద్వారా... కొన్నాళ్లుగా రషీద్ మెట్ఫార్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా ఖరీదు చేసి, కొరియర్లో నగరానికి రప్పిస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన థెరపిస్ట్ మహ్మద్ అఫ్తాబ్ హుస్సేన్, విద్యార్థి మహ్మద్ హబీబుద్దీన్, టెక్నీíÙయన్ మహ్మద్ రెహ్మత్ ద్వారా విక్రయిస్తున్నాడు. దళారులుగా పని చేస్తున్న వీరికి కొంత కమీషన్ ఇస్తున్నాడు. జిమ్‌లకు వెళ్తున్న యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి ఈ ఇంజెక్షన్లు స్టెరాయిడ్‌గా పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్ ఒక్కో ఇంజెక్షన్ రూ.2000 వరకు అమ్ముతోంది. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. అయితే వీళ్లు అక్రమంగా సేకరించి తమ జిమ్‌లో అమ్ముతున్నారు.భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు... ఈ నలుగురూ చేస్తున్న దందాపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ఎస్.బాలస్వామికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్ఐ బి.అజిత్‌సింగ్ తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు, వాహనం, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ ఠాణాకు అప్పగించారు. ఇలాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ను స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని అదనపు డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. దీన్ని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమం అని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు. -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదుకోండి..లేదంటే డెత్ ఇంజక్షన్‌కు అనుమతి ఇవ్వండి
నల్లగొండ టౌన్: ‘కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాను. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్‌కు అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలి’అని నల్లగొండ పట్టణానికి చెందిన బాధితుడు జంపాల గోపాల్ వేడుకుంటున్నారు. బాధితుడు గోపాల్‌తో పాటు అతని తల్లి అంజమ్మ తెలిపిన వివరాలు.. నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు పరిధి సాగర్ రోడ్డు మారుతీనగర్‌కు చెందిన 44 ఏళ్ల గోపాల్ 25 సంవత్సరాలుగా మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు. గోపాల్ ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం రావడంతో ఫిజికల్ టెస్టులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతనికి మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయాడు. తరువాత ఆరు నెలల కాలంలోనే వ్యాధి తీవ్రమై కండరాలు క్షీణించి జీవచ్ఛవంలా మారారు. కదలలేక, నడవలేక, కాళ్లు, చేతులు పనిచేయక మాటకే పరిమితమయ్యారు. 25 సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అన్నీ తానైన కన్నతల్లి.. జీవచ్ఛవంలా మారి నడి వయసుకు వచ్చిన కుమారుడికి 70 ఏళ్ల వృద్ధురాలైన తల్లి అంజమ్మ ఒక్కతే దిక్కు. తల్లికి కుమారుడు చేదోడువాదోడుగా ఉండాల్సిన వయసులో తల్లే తన కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని ఆస్తిపాస్తులు లేని తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. అదే విధంగా తాను మరణిస్తే తన భౌతిక కాయాన్ని మసు్క్యలర్ డిస్ట్రోపీ వ్యాధి నయం చేసే మందును కనుగొనేందుకు పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ నంబర్ 9182241141 (గూగుల్‌పే, ఫోన్‌పే)కు ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. -
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. ఇంజక్షన్ వికటించి..
అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.ఆ ఇంజక్షన్లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం. -
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్‌రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
Ap: రూ.15 లక్షల ఇంజెక్షన్.. ఉచితంగా అందించిన ప్రభుత్వం
సాక్షి,తూర్పుగోదావరి: పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని మరోసారి రుజువైంది. రాజమండ్రిలో హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి ప్రభుత్వం భారీ సాయం అందజేసింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా 15 లక్షల రూపాయల విలువైన అరుదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్ నుంచి తెప్పించి మరీ బాలుడికి చికిత్స అందించారు. కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆస్పత్రిలో బాలుడికి ఇంజెక్షన్ చేశారు. ఇదీచదవండి.. ఏపీ అసెంబ్లీ అప్డేట్స్ -
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు,రీసెర్చ్‌లో ఏం తేలిందంటే..
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన ఓ పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని రీసెర్చ్‌లో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది.ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ పరిశోధకులు తెలిపారు. -
ఎలాగ్జింతో గుండె ధైర్యం
పీలేరు: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ వయస్సు వారికై నా గుండెపోటు (హార్ట్ స్ట్రోక్)రావడం సర్వసాధారణంగా మారింది. సమయానికి వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గుండెపోటు వచ్చిన వారికి తక్షణ ఉపశమనం కల్పించి పెద్ద ఆస్పత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో తెచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ ప్రాజెక్టు కింద కొన్ని కొన్ని ఆస్పత్రులకు మాత్రమే ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గుండెపోటుతో ఎవరూ మరణించరాదని, పేదలను సైతం ఆదుకోవాలని భావించి అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లోపైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేశారు. అనంతరం గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో అమలు చేశారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. ఒక్క పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏడాది కాలంలో తొమ్మిది మందికి ఎలాగ్జిం ఇంజెక్షన్‌తో ప్రాణాలు కాపాడారు. విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు గుండెపోటెకు గురైన నన్ను స్నేహితులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణ ఉపశమనం కోసం రూ. 51,669 విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు. నా ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. – సురేంద్ర, పీలేరు ఎలాగ్జింతో గంటసేపు ప్రాణాలు కాపాడవచ్చు గుండెపోటు గురైన వారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేరాలి. ప్రభుత్వాస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇవ్వ డం ద్వారా తక్షణం ప్రాణాలు కాపాడటంతోపాటు గంట సమయంలో ఉన్నతాసుపత్రికి వెళ్లడానికి రక్షణగా పని చేస్తుంది. రెండో సారి గుండెపోటు రాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ డేవిడ్ సుకుమార్, డీసీహెచ్ఎస్, రాయచోటి జగనన్నకు రుణపడి ఉంటాం నాకు గుండెపోటు రావడంతో తక్షణం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇచ్చారు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే వరకు నా ప్రాణాలు కాపాడింది. ఆస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. – మమత, పీలేరు అవసరమనిపిస్తేనే ఇంజెక్షన్ వాడతాం గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన అనంతరం వారి కండీషన్‌ను బట్టి ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇస్తాం. విలువైన ఇంజెక్షన్ కావడంతో వృథా చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎలాగ్జిం వాడడం జరుగుతుంది. – డాక్టర్ చంద్రశేఖర్, పీలేరు ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ -
సరికొత్త ఔషధం..దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!
మన శరీరంలో అవసరమైన కొలస్ట్రాల్ కంటే చెడు కొలస్ట్రాలే అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అనారోగ్యం బారిన పడతాం. ముఖ్యంగా బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కూడా ఈ చెడు కొలస్ట్రాలే. అధిక బరవు సమస్యకు కూడా ఇది ఒక కారణమే. దీని గురించి ఇక బాధపడాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక డోసు ఈ సరికొత్త ఔషధం తీసుకుంటే ఏడాది వరకు నిశ్చింతగా ఉండొచ్చట. ఇంతకీ ఏంటా ఔషధం అంటే.. శాస్త్రవేత్తలు లెపోడిసిరాన్ అనే కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఇది ఒక డోస్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే లిపోప్రోటీన్(ఏ) అనే చెడు కొలస్ట్రాల్‌ను దాదాపు ఒక ఏడాది పాటు గుర్తించలేనంతగా మాయం అయిపోతాయని చెబుతున్నారు. తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చని అన్నారు. లిపో ప్రోటీన్(ఏ) లేదా ఎల్పీ(ఏ) అనే చెడు కొలస్ట్రాల్ శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రవాహాన్ని సాఫీగా జరగనివ్వదు. అదీగాక ఈ అధిక ఎల్పీ(ఏ) స్థాయిలు వారసత్వంగా వస్తే మాత్రం.. వాటిని వ్యాయామం, ఆహారం లేదా మందుల ద్వారా కూడా ప్రభావింతం చేయలేం. అలాగే ఈ అధిక ఎల్పీ(ఏ)కి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సలు లేవు. ఈ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాము కనుగొన్న ఈ కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్‌లో చక్కటి ఫలితాలనిచ్చిందని చెప్పారు. ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు నెలలకొకసారి మాత్రమే తీసుకుంటే చాలు ఏడాది వరకు శరీరంలో ఎలాంటి చెడు కొలస్ట్రాల్ ఉండదు. పైగా అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ కొలస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే కాలేయంలోని కణాలకు సంబంధించిన ఆర్నెన్ఏ మెసెంజర్ని నిలిపేస్తుంది. తత్ఫలితంగా చెడు కొలస్ట్రాలనేది శరరీంలో ఉండదని చెబుతున్నారు. అందుకోసం అసాధారణ స్థాయిలో ఎల్పీ(ఏ) ఉన్న 48 మందిపై పరిశోధనలు చేయగా..వారిలో కొందరికి ఈ కొత్త ఔషధం మోతాదులుగా వారిగా ఇచ్చారు. ఎక్కువ మోతాదుని ఇచ్చిన వారిలో త్వరిత గతిన కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్త పోటు స్థాయిలు సమంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మోతాదు తక్కువగా ఇచ్చిన వారిలో చెడు కొలస్ట్రాల్ తగ్గడానికి, రక్తం స్థాయిల్లో మార్పులకు కనీసం మూడు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు. కానీ ఈ లెపోడిసిరాన్ ఔషధం మాత్రం క్లినిక్ పరిక్షల్లో నూటికి 94% సమర్థవంతంగా చెడు కొలస్ట్రాల్‌ని పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న వారందరికి ఎలాంటి ఇతర సమస్యలు లేవు. కానీ తాము నిర్వహించే సెకండ్ క్లినికల్ ట్రయల్స్‌లో పక్షవాతం, గుండె జబ్బులు ఉన్న పేషెంట్లపై ఈ కొత్త ఔషధం ఎలా పనిచేస్తుందనేది నిర్థారణ అవ్వాల్సి ఉందన్నారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో కూడా ఫలితాలు మంచిగా ఉంటే రోగులకు ఈ సరికొత్త ఔషధం గొప్ప సంజీవని అవుతుందన్నారు. అంతేగాదు దీన్ని ఏడాదికొకసారి టీకా మాదిరిగా తీసుకునేలా అభివృద్ధి చేస్తే.. ఈ చెడు కొలస్ట్రాల్ సంబంధిత వ్యాధుల బారినపడుకుండా ప్రజలను సురక్షితంగా ఉండగలుగుతారని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ మేరకు లిల్లీ రిసెర్చ్ ల్యాబరేటరీ అందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కి సమర్పించింది. (చదవండి: బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా.?) -
బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా..?
ఇప్పుడు ఎవర్నీ కదలించినా బీపీ ఉందని చెబుతుంటారు. నిజానికి అంతమందికి బీపీ ఉందా? కరెక్ట్‌గానే వైద్యులు చెక్ చేస్తున్నారా?. అస్సలు బీపీకి ప్రతి రోజు మాత్రలు వేసుకోవాల్సిందేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తదితరాల గురించే ఈ కథనం!. రక్తపోటు లేదా బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధిలా అయిపోయింది. దేని గురించి అయినా ఆస్పత్రికి వెళ్తే..ముందుగా బీపీ చెక్ చేయడం కామన్ కూడా. నిజంగా కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? అంటే?. అదంతా అవాస్తమనే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. ఏటా 10 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు ఉందని నిర్థారణ అవుతోంది. కానీ ఇదంతా వాస్తవం కాదని, వేలాది మందికిపైగా బీపీని తప్పుగా నిర్ధారణ అవుతున్నట్లు కొలంబస్‌లోని ఒహియో స్టేట్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్‌లోని ఒహియా యూనివర్సిటీ పరిశోధకులు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్‌లతో కలసి జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బీపీ పరీక్షలు చాలా తప్పు విధానంలో నిర్వహిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకోసం ఒహియో పరిశోధకులు దాదాపు 150 సముహాల వారిగా పెద్దవాళ్లను తీసుకుని జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోగిని ఆమోదయోగ్యమైన కూర్చిలో కూర్చొబెట్టి గుండె స్థానానికి సమాంతర స్థాయిలో చేయిని ఉంచి రీడింగ్‌ని తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. చాలమంది పేషెంట్లకు తప్పుగా బీపీని రికార్డు చేస్తున్నారని. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ పేషెంట్‌కి బీపీ నార్మల్‌గా ఉన్నా..ట్యాబ్లెట్లు ఇస్తే అది అధిక రక్తపోటుకి లేదా వివిధ దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తమ అధ్యయనంలో చాలామందికి తప్పుగా బీపీని గుర్తించారని, పైగా అధికంగా మందులను కూడా వైద్యులు సూచించినట్లు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. ఈ కారణాల వల్లే యూఎస్‌లో దాదాపు సగం మందికి పైగా పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలావరకు బీపీకి మందులను కూడా విపరీతంగా వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చని తెలిపారు పరిశోధకుఉల. తప్పుగా బీపీని రికార్డు చేయడం, దీనికి తోడు మందులను వాడించటం వల్ల చాలమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్ల తెలిపారు. ఇక మందులు బీపీకి అదేపనిగా వాడాల్సిన అవసరం లేదా? విరామం ఇవ్వొచ్చా అంటే? అంతలా అవసరం లేదనే చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేగాదు త్వరలో కంటిన్యూగా మందులు వాడాలసిన అవసరం లేకుండానే సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తేనట్లు కూడా చెప్పుకొచ్చారు. బీపీకి రోజూ మందులు వేసుకోనక్కర్లేదా? బీపీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ప్రతిరోజు టెన్షన్‌గా ఓ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అందరికీ తెసిందే. అందులోనూ హైబీపీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజూకి కనీసం ఒకటి నుంచి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిందే. కానీ పరిశోధకులు కనిపెట్టిన ఈ కొత్త రకం ఔషధం 'జిలేబేసిరాన్' ఆ సమస్యలన్నింటికి చెక్ పెడుతుందట. కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు హైబీపీని సమర్ధవంతంగా నియంత్రించడమే గాక ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని వల్ల తరుచుగా మందులు వేసుకోవడం, దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల నుంచి రోగులకు ఉపశమనం లభించినట్లు అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ రక్తపోటు అదుపులో లేకపోతే రోగులు స్ట్రోక్, గుండెపోటు లేదా హృదయనాళాలకు సంబంధిత రుగ్మతల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేషెంట్లు బీపీ ట్యాబ్లెట్న్ కంప్లసరీ తమ పక్కనే పెట్టుకుంటుంటారు, టెన్షన్‌గా రోజూ వేసేసుకుంటారు. ఇక ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ సరికొత్త డ్రగ్‌తో. ఇది సమర్థవంతంగా హైబీపి నియంత్రించి సమ స్థాయలో ఉండేలా చేస్తుంది. మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రలు లేకుండా గడపొచ్చు. (చదవండి: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
తోచిన వైద్యంతో మహిళ ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ భార్య
ఇల్లెందురూరల్: తెలిసీ తెలియని వైద్యంతో డాక్టర్ భార్య చేసిన చికిత్స బెడిసికొట్టింది. ఇంజక్షన్ వేసిన కాసేపటికే ఓ మహిళ కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కొమరారంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని పోలారం గ్రామపంచాయతీ భద్రుతండాకు చెందిన భూక్య కోక్యా (45) జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకుంది. జ్వరం తగ్గకపోవడంతో కోడలు ప్రమీల సాయంతో కొమరారంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు జి.బన్సీ నిర్వహిస్తున్న కొమరారంలోని విఘ్నేశ్వర ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఎలాంటి అనుభవం లేని వైద్యుడి భార్య వెన్నెల కోక్యాను పరిశీలించి.. అందరికీ వైరల్ జ్వరాలే వస్తున్నాయంటూ ఓ ఇంజక్షన్ వేసింది. కాసేపటికే కోక్యా పరిస్థితి విషమంగా మారగా, భర్త బన్సీకి సమాచారం ఇచ్చింది. అతని సూచన మేరకు వెన్నెల సైలెన్ పెట్టినా ఎలాంటి మార్పు రాలేదు. కోక్యా ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కోడలు ప్రమీల పక్కనే ఉన్న పోచారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే మృతి చెందింది. విషయం తెలియగానే పోలారం గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, గ్రామస్తులు, మృతురాలి బంధువులు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే కొమరారం ఎస్సై గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని చికిత్సకు సంబంధించిన మందులు స్వాధీనం చేసుకుని బన్సీ, వెన్నెలను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బంధువుల ఆందోళన, దాడికి యత్నం.. ఆసుపత్రిలో విచారించిన ఎస్సై గిరిధర్‌రెడ్డి పిటిషన్ ఇవ్వాలని మృతురాలి కుటుంబసభ్యులను కోరారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేస్తుండగా కోపోద్రిక్తులైన వారు ఆస్పత్రిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా అప్పటికే ముందుభాగంలో అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్యుడు బన్సీ,, అతడి భార్య వెన్నెలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రి వెనుక భాగం నుంచి ప్రత్యేక వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కేసు నమోదు చేశామని, పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నామని వివరించడంతో శాంతించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి మృతురాలిని శవ పరీక్ష కోసం ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. -
సుతిమెత్తగా సూదిమందు!
-
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్‌లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్‌ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
ఇంజక్షన్ వికటించి.. రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి
హసన్‌పర్తి: ఇంజక్షన్ వికటించి ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగింది. చింతగట్టుకు చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ నద్దునూరి సారయ్య(65) చికిత్స నిమిత్తం సోమవారం మండల కే ంద్రంలోని ‘శంకర్’ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్.. సారయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండు ఇంజక్షన్లు ఇవ్వగా సారయ్య ఒకసారిగా కుప్పకూలారు. దీంతో సారయ్యను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రిస్కిప్షన్ ఇవ్వమని.. ఇదిలా ఉండగా సారయ్యకు ప్రథమ చికిత్స సందర్భంగా ఉపయోగించిన మందుల ప్రిస్కిప్షన్ ఇవ్వాలని 108 సిబ్బంది.. వైద్యుడి శంకర్‌ను కోరారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మృతుడి కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ శంకర్‌పై దాడికి దిగారు. అనంతరం డాక్టర్ శంకర్‌ను అంబులెన్స్‌లో ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా, ఎంజీఎంలో సారయ్యను పరీక్షించిన వైద్యులు.. అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే సారయ్యకు పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో వైద్యుడు శంకర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సారయ్య కుమారుడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపి తెలిపారు. జిల్లా వైద్యాధికారుల విచారణ ఇంజక్షన్ వికటించి మృతి చెందిన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్ఓ మధన్మోహన్, సీఐ గోపి విచారణ చేపట్టారు. ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సారయ్యకు ఇచ్చిన ఇంజక్షన్‌పై ఆరా దీశారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్వహణ ఆస్పత్రి నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని డిప్యూటీ డీఎంహెచ్ఓ మధన్మోహన్ తెలిపారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదునెలల క్రితం ఇంజక్షన్ వికటించి ఓ బాలుడు మృతి చెందడంతో ఆస్పత్రి సీజ్ చేసినట్లు తెలిపారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే అక్రమంగా ఆస్పత్రి నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా, ఐదు నెలల క్రితం ఆస్పత్రి సీజ్ చేసినా సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ శంకర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి సీజ్ ‘శంకర్’ ఆస్పత్రిని సీజ్ చేశారు. తహసీల్దార్ ప్రసాద్, డీటీ రహీం, ఆర్ఏ ప్రణయ్.. ఆస్పత్రికి సీల్ వేశారు. వైద్యాధికారులు వాణిశ్రీ, విజమ్రావు, ఏఎస్వో ప్రసన్నకుమార్, హెల్త్ అసిస్టెంట్లు కందుకూరి సంతోష్‌కుమార్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
తొందరపడి PRP ఇంజెక్షన్ లు చేయించుకోకండి
-
అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ రెగాడెనొసోన్ ఇంజెక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా అమెరికా మార్కెట్లో రెగాడెనొసోన్ ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టింది. రక్త ప్రవాహాన్ని పరీక్షించే క్రమంలో గుండె ఇమేజ్‌లను తీయడంలో ఏజంటుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది లెక్సిస్కాన్ ఇంజెక్షన్‌కు జనరిక్ వెర్షన్. మరోవైపు, తెలంగాణలోని తమ బొల్లారం ప్లాంటులో మే 1 నుంచి 5 వరకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఫారం 483ని జారీ చేసినట్లు వివరించింది. నిర్దేశిత గడువులోగా దాన్ని పరిష్కరిస్తామని తెలిపింది. తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధ పరిస్థితులేమైనా కనిపిస్తే యూఎస్ఎఫ్డీఏ ఫారం 483ని జారీ చేస్తుంది. -
పాకిస్తాన్లో అందినకాడికి దోపిడీ.. రూ.600 ఇంజక్షన్, 3 వేలు!
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె రోగుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్ ఇంజక్షన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే హెపారిన్ ఇంజక్షన్ సాధారణ ధర రూ.600 ఉన్నప్పటికీ, కొరత కారణంగా ధరను అమాంతంగా రూ.3 వేలకు పెంచి అక్రమంగా అమ్ముతున్నారని సదరు నివేదిక పేర్కొంది. అంతేగాక మందులు, వైద్య పరికరాల కొరతను కారణంగా వైద్యులు సర్జరీలు నిర్వహించడం లేదని వెల్లడించింది. మరోవైపు ఇంజక్షన్ ధరలను భారీగా పెంచడంతో పేద ప్రజలు వాటిని కొనడం అందని ద్రాక్షలాగా మారింది. రోగులు ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతుండటంతో అక్కడి స్థానిక ఫార్మాస్యూటికల్ తయారీదారులు మందుల ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా దేశపు ఔషధ తయారీ ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ముడి సరుకులు పొరుగు దేశాలైన భారత్, చైనాల నుంచే దిగుమతి అవుతాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో.. దాయాది దేశపు ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. చదవండి: 9 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్న పాక్ మంత్రి.. ఎందుకంటే! -
పేదింటి బిడ్డకు అరుదైన రోగం.. రూ.16 కోట్ల విదేశీ ఇంజెక్షనే సంజీవని..
మెదక్ జోన్: పేదింటి గిరిజన బిడ్డకు పెద్ద రోగమొచ్చింది. కోట్లాది మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే స్పైనల్ మస్కులర్ అట్రొఫీ (ఎస్ఎంఏ) అనే వెన్నెముకకు సంబంధించిన కండరాల బలహీనత వ్యాధితో ఓ చిన్నారి మూడేళ్లుగా మంచానికి పరిమితమైంది. ఆ చిన్నారి బతకాలంటే అమెరికా నుంచి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను తీసుకురావాలి. దాని ఖరీదు రూ.16 కోట్లపైనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించండి అంటూ కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. పుట్టిన 6 నెలల తర్వాత... మెదక్ జిల్లా వాడి పంచాయతీ పరిధిలోని దూప్‌సింగ్ తండాకు చెందిన రేఖ–లక్ష్మణ్ దంపతులకు తొలి సంతానంగా రోజా పుట్టింది. ఆరు నెలల వరకు ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉండేది. ఆ తర్వాత బోర్లా పడే వయసు వచ్చినా పడుకోబెట్టిన చోటే కదలకుండా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను తొలుత మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆ తర్వాత హైదరా బాద్‌లోని నిలోఫర్, నిమ్స్ సహా పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యులు దీన్ని ఎస్ఎంఏ అనే జన్యుపరమైన వ్యాధిగా తేల్చారు. దీనివల్ల కండరాలు రోజురోజుకూ బలహీనపడి మరణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత వెంటనే అమెరికా నుంచి జన్యు లోపాన్ని సరిదిద్దే ఇంజెక్షన్‌ను తీసుకొస్తేనే వ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్లు తేల్చిచెప్పారు. కన్నబిడ్డ కళ్లముందే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే తట్టుకోలేని ఆ పేద తల్లిదండ్రులు నెలకు రూ. 10 వేలు ఖర్చు చేసి తాత్కాలిక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చికిత్స చేయించారు. తమ బిడ్డకు ఎప్పటికప్పుడు తాత్కాలిక చికిత్స అందించకపోతే ఊపిరి అందదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, జీన్ థెరపీ ద్వారా ఎస్ఎంఏ రోగులకు కొత్త జీవితం ప్రసాదించవచ్చని మెదక్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీసీ శేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంజెక్షన్ (zolgensma-onasemnogene abeparvovec) అమెరికాలో దొరుకుతుందని, . దాని విలువ రూ. 16 కోట్ల నుంచి 18 కోట్ల మధ్య ఉంటుందని అన్నారు. అమాయకపు చూపుల్లో ఎన్ని ప్రశ్నలో.. మృత్యువుతో పోరాడుతున్న రోజా అమాయకపు చూపులు అందరినీ కలచి వేస్తున్నాయి. అమ్మ ఒడిలో కూర్చొని ఆయాసంగా ఊపిరి తీసుకుంటోంది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ సైగలు చేస్తోంది. చదవండి: Telangana: సచివాలయం కింద చెరువు.. -
ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి
కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఫాతిమా నైదా షిహాబుద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జాతీయ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఛాంపియన్‌గా నిలవాలన్న తన కోరిక తీరకుండానే మృతి చెందడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జాతీయ సైక్లింగ్ పోలో చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఫాతిమా బుధవారం నాగ్‌పూర్‌కు చేరుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి విరేచనాలతో ఇబ్బంది పడుతున్న ఫాతిమా గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో నిర్వాహకులు ఆమెను దంతోలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఎం-సెట్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా చనిపోవడానికి వైద్యులు చేసిన ఇంజెక్షన్ కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే జాతీయ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలవాలనుకున్న 10 ఏళ్ల ఫాతిమా ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అరరె.. బుడ్డోడికి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఎలా వేశాడో చూడండి
-
COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది
బీజింగ్: సూది(సిరంజీ)తో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకొనే కోవిడ్–19 టీకా చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 20 సెకండ్లో పూర్తవుతుంది. ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్హేలర్ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు. -
ఖమ్మంలో మరో ‘సూదిమందు’ హత్య
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద ఇంజక్షన్ ఇచ్చి వ్యక్తిని హత్య చేసిన ఘటన మరవకముందే జిల్లాలో ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. 50 రోజుల క్రితం జరిగిన ఈ హత్య వివరాలను పోలీసులు తాజాగా బయటపెట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాకు చెందిన తేజావత్ బిక్షం(42) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈయన మొదటి భార్య విజయకు సంతానం లేకపోవడంతో బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన నవీన(21) అలియాస్ సునీతను రెండోపెళ్లి చేసుకున్నాడు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో నవీన, భిక్షం దంపతులు నివసిస్తున్నారు. నవీనకు తొలికాన్పులో కూతురు జన్మించింది. జూలై 30న ఖమ్మంలోని శశిబాల ఆస్పత్రిలో జరిగిన రెండో ప్రసవంలోనూ నవీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారసుడు కాకుండా ఇద్దరూ కూతుళ్లే జన్మించారనే కోపంతో నవీనను అదే ఆసుపత్రిలో హత్యచేయాలని భిక్షం ప్లాన్ వేశాడు. తాను పనిచేసే ఆరాధ్య ఆస్పత్రి నుంచి మత్తుమందు, ఇంజక్షన్ సేకరించాడు. నవీనకు సహాయకురాలిగా ఉన్న తల్లి మంగి నిద్రలోకి జారుకున్నాక భార్య చేతికి ఉన్న క్యాన్‌లాలోకి మత్తుమందును అధిక మోతాదులో ఎక్కించాడు. భార్యను హత్యచేసిన భిక్షం నిద్రలోనే పరలోకాలకు.. అత్యధిక మోతాదు మత్తుమందు కారణంగా నవీన నిద్రలోనే మృతిచెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నవీన మృతి చెందిందంటూ భిక్షం తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో వైద్యులు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నవీన మృతదేహానికి పోస్టుమార్టం లేకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం నవీన మృతిపై ఆస్పత్రి యాజమాన్యం, ఆమె కుటుంబీకులు అనుమానించి సీసీ పుటేజ్ పరిశీలించగా ఆమె చేతి క్యాన్‌లాలోకి భిక్షం ఇంజక్షన్ ఎక్కిస్తున్న దృశ్యం బయటపడింది. దీంతో ఖమ్మం టూటౌన్ పోలీసులకు తెలపగా తొలుత పట్టించుకోలేదు. ఐఎంఏ బాధ్యులు సీపీ విష్ణు ఎస్.వారియర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాలతో భిక్షంను విచారించగా విషయం బయటపడింది. దీంతో బిక్షంను నెలన్నర క్రితమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తాజాగా జమాల్‌ను హత్య చేసిన ఘటనలో నిందితులకు ఖమ్మంలోని ఆరాధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న యశ్వంత్ మత్తు మందు సమకూర్చగా, ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న భిక్షం అక్కడి నుంచే మందు తీసుకొచ్చి భార్యను హత్య చేయడం గమనార్హం. -
‘సూది’ మర్డర్ వెనుక అసలు కథ ఇదే.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..
సాక్షి, ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం వల్లభి గ్రామ శివారులో జరిగిన సూదిమందు హత్య కేసులో భార్యనే విలన్‌గా తేల్చారు పోలీసులు. హత్యలో ప్రమేయం ఉన్న ఆరుగురిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. ఏ1 గోదా మోహన్‌రావు, ఏ2 బండి వెంకన్న, ఏ3 నర్సింశెట్టి వెంకటేష్, ఏ4 షేక్ ఇమాంబీ, ఏ5 బందెల యశ్వంత్, ఏ6 పోరళ్ల సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్ చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోదా మోహన్‌రావుతో జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడని.. ఈ విషయం జమాల్ సాహెబ్‌కు తెలియడంతో భార్యను మందలించాడన్నారు. దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న జమాల్ బీ.. ప్రియుడు మోహన్‌రావుతో కలిసి పథకం వేసిందని ఏసీపీ చెప్పారు. నామవరంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న బండి వెంకన్నకు తమ వివాహేతర సంబంధం గురించి చెప్పి అతని ద్వారా హత్యకు ఉపయోగించే ఇంజెక్షన్లు కావాలని కోరాడని ఏసీపీ తెలిపారు. దీంతో వెంకన్న తన స్నేహితులైన యశ్వంత్, సాంబశివరావు ద్వారా ఇంజెక్షన్లు తెప్పించి వాటిని వెంకటేష్ ద్వారా జమాల్‌కి ఇప్పించాలని పథకం అమలు చేసారని చెప్పారు. జమాల్ తన కూతురు గండ్రాయిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్న సమయంలో వల్లబి శివారులో బైక్ లిఫ్ట్ అడిగిన బండి వెంకన్న అతను ఎక్కించుకున్న అనంతరం అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే దిగి తన స్నేహితుడు వెంకటేష్ తీసుకొచ్చిన బైక్ ఎక్కి పారిపోయాడని తెలిపారు. ఇంజెక్షన్ ప్రభావంతో జమాల్ సృహ కోల్పోయి స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడని ఏసీపీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు,ఆరు సెల్ ఫోన్లు, ఇంజెక్షన్, సిరంజీ, స్టరైల్ వాటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి చెప్పారు. -
వివాహేతర సంబంధంతోనే ‘సూది’ మర్డర్!
చింతకాని/ముదిగొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురు వ్యక్తులు పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడ్డారని.. లిఫ్ట్ అడగడం, అధిక డోసు మత్తు ఇంజక్షన్ గుచ్చడం, నంబర్ లేని ద్విచక్ర వాహనాన్ని వినియోగించడం అంతా పక్కాగా అమలు చేశారని పోలీసులు తేల్చారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా సంబంధమున్న ముగ్గురు నిందితులను గుర్తించారు. అందులో ఇద్దరిని మంగళవారం రాత్రి చింతకాని మండలం మత్కేపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. పరారీలో ఉన్న మరొకరికోసం గాలింపు కొనసాగుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు బుధవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. 24 గంటల్లోనే తేల్చిన పోలీసులు చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపంలో అధిక డోసు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎస్పీ సీపీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా పుటేజీలు, సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వల్లభి గ్రామంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. జమాల్ సాహెబ్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పారిపోయిన విషయం తెలిసి.. సెల్‌ఫోన్ లొకేషన్, కాల్‌డేటా ఆధారంగా చింతకాని మండలం మత్కేపల్లిలో విచారణ చేపట్టారు. మత్కేపల్లిలో గోద మోహన్‌రావు వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి నంబర్ లేదని తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆందోళన చెందిన మోహన్‌రావు పారిపోయినట్టు తెలిసింది. గాలింపు చేపట్టిన పోలీసులు.. గ్రామంలోనే తలదాచుకున్న మోహన్‌రావును, జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్ గుచ్చిన నర్సింశెట్టి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని విచారించగా ఈ మత్తు ఇంజక్షన్‌ను మోహన్‌రావు బంధువైన ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్న సరఫరా చేసినట్టు గుర్తించినట్టు సమాచారం. బండి వెంకన్న పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. కాగా.. హత్య సమయంలో వాడిన నంబర్ ప్లేట్ లేని సదరు వాహనానికి మంగళవారం ఉదయం కొత్త నంబర్ ప్లేట్ పెట్టుకున్నట్టు గుర్తించారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం.. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన గోద మోహన్‌రావు ఓ రైతు వద్ద గుమస్తాగా పనిచేస్తుండగా, నర్సింశెట్టి వెంకటేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి జమాల్ సాహెబ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. బండి వెంకన్నను కలిసి అధిక డోసు మత్తు ఇంజక్షన్‌ను సిద్ధం చేసుకున్నారు. జమాల్ సాహెబ్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో ఉంటున్న తన పెద్దకుమార్తె వద్దకు వెళ్లేందుకు బొప్పారం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన గోద మోహన్‌రావు, నర్సింశెట్టి వెంకటేశ్ తమ ప్లాన్ అమలు చేశారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బాణాపురం గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. వెంకటేశ్ రోడ్డుపై వేచి ఉండగా.. మోహన్‌రావు చాటుగా దాక్కున్నాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న జమాల్ సాహెబ్‌ను వెంకటేశ్ లిఫ్ట్ అడిగి వెనుకాల ఎక్కాడు. ప్రయాణిస్తుండగా కొంతసేపటి తర్వాత జమాల్ సాహెబ్‌కు మత్తు ఇంజక్షన్ గుచ్చాడు. జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనాన్ని ఆపగానే వెంకటేశ్ దిగి పరుగెత్తాడు. వెనకాలే వస్తున్న మోహన్‌రావు అతడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. మరోవైపు జమాల్ సాహెబ్ షాక్‌లోకి వెళ్లిపోయి చనిపోయాడు. -
లిఫ్ట్ అడిగి.. ఇంజక్షన్ గుచ్చి..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ద్విచక్ర వాహనదారుడి హత్య? షేక్ జమాల్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అగంతకుడు కాసేపటికే ఇంజక్షన్ గుచ్చి వెనకాలే వచ్చిన అనుచరుడితో కలసి పరార్ కళ్లు తిరుగుతున్నాయంటూ భార్యకు ఫోన్ చేసి సొమ్మసిల్లిన వ్యక్తి పీహెచ్‌సీకి తరలించిన స్థానికులు.. చికిత్స మొదలుపెట్టేలోగానే మృతి ముదిగొండ: మానవతా దృక్పథంతో సాయం చేయడమే ఆయన చేసిన పాపమైంది... రోడ్డుపై లిఫ్ట్ అడిగిన అగంతకుడిపై జాలిపడి ద్విచక్ర వాహనం ఎక్కించుకోవడమే ఆయన ప్రాణాలను బలిగొంది... బండి ఎక్కిన కాసేపటికే దుండగుడు ఇంజక్షన్గుచ్చడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆయన... కాసేపటికే ప్రాణాలు విడవడం అందరినీ కలచివేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లబి సమీపాన సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ సుతారీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏపీలోని గండ్రాయి గ్రామంలో ఉండే పెద్ద కుమార్తె వద్దకు సోమవారం ఉదయం ఆయన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో వల్లబి సమీపాన మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో జమాల్ అతన్ని బండి ఎక్కించుకున్నాడు. కొంతదూరం ప్రయాణించగానే ఆ అగంతకుడు జమాల్ తోడపై ఇంజక్షన్ గుచ్చాడు. ఆందోళనకు గురైన జమాల్ బండి ఆపడంతో అగంతకుడు దిగి ముందుకు పరుగెత్తాడు. అంతలోనే వెనకాల నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన మరో వ్యక్తి ఆ నిందితుడిని ఎక్కించుకొని పారిపోయాడు. ఈ క్రమంలో స్పృహ తప్పి కిందపడిపోయిన జమాల్‌ను మల్లారం గ్రామానికి చెందిన తిరుపతిరావు, శివ గుర్తించి నీళ్లు చల్లగా స్పృహలోకి రావడంతో వివరాలు ఆరా తీశారు. దీంతో జమాల్ తన భార్యతో మాట్లాడించాలని ఫోన్ ఇచ్చి పాస్వర్డ్ కూడా చెప్పాడు. ఫోన్లో భార్య, కూతురుతో మాట్లాడిన జమాల్ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడు. అలాగే అల్లుడు షేక్ లాల్సాహెబ్కు సమాచారం ఇచ్చాడు. అనంతరం జమాల్‌ను శివ, తిరుపతిరావు తమ వాహనంపై వల్లభి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్ ధర్మేందర్ పరీక్షించి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాడంటూ సెలైన్ పెట్టేలోగా శ్వాస ఆగిందని నిర్ధారించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న జమాల్ అల్లుడికి మరణవార్తను తెలియజేశాడు. రంగంలోకి పోలీసులు. సమాచారం అందు కున్న ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై ఘట నాస్థలం నుంచి ఇంజక్షన్, సూది, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు సీసీ పుటేజీ కోసం ఆరా తీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి అల్లుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని జమాల్ మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టి బంధువులకు అప్పగించారు. వైద్యు లు మృతుడి రక్తం, అవయవాల నమూనాలు సేకరించి వరంగల్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. జమాల్‌కు గుచ్చిన ఇంజక్షన్ ఆ ఇంజెక్షన్ మత్తుమందేనా? జమాల్‌కు అగంతకుడు అత్యధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ వైద్యాధికారి వివరించారు. ఒకేసారి హైడోస్ మత్తు మందు ఇవ్వడం, ఏం జరుగుతుందోననే ఆందోళనతో జమాల్ మృతి చెంది ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం నివేదికతోపాటు ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే జమాల్‌కు ఇచ్చింది మత్తు మందా లేక ఆయనపై విష ప్రయోగం జరిగిందా అనేది తేలుతుందన్నారు. కాగా, జమాల్‌కు ఆస్తి గొడవలు సైతం ఏవీ లేవని బొప్పారం గ్రామస్తులు పేర్కొన్నారు. -
చిన్నారి ఎలెన్‌కు భరోసా
దుమ్ముగూడెం: బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసిపాప జన్యుపరమైన వ్యాధి బారిన పడి రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. చికిత్సకు అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ‘నోవార్టిస్’ ఉచితంగా అందజేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి పాప ఎలెన్‌కు రెండేళ్లు. మెడ భాగం దృఢంగా లేకపోవడంతో కిందకు వాలిపోతుండటాన్ని పాప నాలుగు నెలల వయసున్నప్పుడే తల్లిదండ్రులు గమనించారు. వయసు పెరుగుతున్నా పాప శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమస్య ఏమిటో తేలలేదు. ఆ తర్వాత చెన్నైలోని వేలూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఎలెన్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, సత్వరమే వైద్యం చేయించాలని సూచించారు. పాపను రక్షించుకోవాలంటే రూ.16కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలైన ప్రవీణ్–స్టెల్లా కుప్పకూలి పోయారు. ఈ విషయమై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, చానళ్లలో కథనాలు రాగా, విషయం స్విట్జర్లాండ్‌లోని నోవార్టిస్ సంస్థ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు సంస్థ యాక్సెస్ ప్రోగ్రాంలో భాగంగా జూలై నెలలో ఎలెన్‌కు ఉచితంగా ఇంజె క్షన్ ఇచ్చేందుకు ఎంపిక చేసింది. నిర్ణయించిన ప్రకారం.. ఎలెన్‌కు శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఇంజెక్షన్ వేశారు. పాప ప్రాణానికి ఇబ్బంది లేదని, ఇకనుంచి కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పినట్లు ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, పాపకు నయం కావాలని ప్రార్థనలు చేసిన వారితోపాటు కథనాలు రాసిన మీడియాకూ ప్రవీణ్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
HIV-AIDS cure: ఆ ఇంజక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!
టెల్ అవీవ్: వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్–టైప్ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. ‘‘ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేస్తున్నాయి. , యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన డాక్టర్ బర్జేల్ వివరించారు. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెడతామని ధీమా వెలిబుచ్చారు. -
మందు నింపకుండానే సూది
సాక్షి, హుస్నాబాద్(మెదక్): మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం నవ్వులాటగా మారింది. సిరంజిలో మందు నింపకుండానే ఖాళీ సూది ఇచ్చిన తీరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పట్టణానికి చెందిన కేడం సుచిత్ర కరోనా రెండో డోస్ కోసం సోమవారం హుస్నాబాద్ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో సిరంజిలో వ్యాక్సిన్ మందు నింపి సూది వేయాల్సిన వైద్య సిబ్బంది, మందు నింపకుండానే ఎడమ చేతికి ఇంజక్షన్ ఇచ్చారు. పక్కనే ఉన్న సు చిత్ర తమ్ముడు ఇదేమిటని ప్రశ్నించగా, తెరుకున్న సిబ్బంది తిరిగి కరోనా వ్యాక్సిన్ మందు నింపి మళ్లీ కుడి చేతికి టీకా ఇచ్చారు. ముచ్చట్లలో పడిన సిబ్బంది మందు నింపారో లేదో చూసుకోకుండానే çసూది ఇవ్వడంపై అక్కడున్నవారు వాపోయారు. దీనిపై వివరణ అడగగా మరోసారి పొరపాటు జరకుండా చూస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారి సౌమ్యను ఫోన్లో స్పందించగా, స్పందించలేదు. -
సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
రూమ్‌లోకి వెళ్లి మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని..
సాక్షి,విజయవాడ: మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజమండ్రిలోని రాజీనగరానికి చెందిన పెద్దింటి రాహుల్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటినుంచి అతను తన పిన్ని వద్ద ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 31న నగరానికి వచ్చి పీఎన్బీఎస్ సమీపంలోని బాలాజీ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం లాడ్జి సిబ్బంది అతని రూమ్ లోకి వెళ్లి చూడగా కదలకుండా ఉండటాన్ని చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతదేహం పక్కనే మత్తు ఇంజక్షన్, సిరంజ్ లభించడంతో మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఈ ‘కాక్టెయిల్’తో కరోనాకు చెక్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ డ్రగ్’ ప్రభావవంతంగా పనిచేస్తోందని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ఏఐజీ, యశోద ఆస్పత్రుల్లో రెండు వారాలుగా ఈ మందును ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఔషధంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. తమ పరిశీలన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. ఏమిటీ కాక్టెయిల్ డ్రగ్? కసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ఔషధాలను కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్గా రూపొందించారు. కరోనా స్పైక్ ప్రొటీన్, దాని అటాచ్మెంట్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా ఈ మందు అడ్డుకుంటుంది. వివిధ వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తోందని, పేషెంట్లు ఆస్పత్రి లో చేరాల్సిన పరిస్థితి తక్కువగా ఉందని, మరణాలు 70 శాతం వరకు తగ్గుతున్నాయని వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్‌గా తేలగా నే ఈ మందు తీసుకోవాలి. మూడో వేవ్ ముంగిట.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. తాజాగా మన దేశంలో ఈ మందు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కరోనా మూడో వేవ్ రావొచ్చన్న అంచ నాల నేపథ్యంలో.. కోవిడ్‌ను తొలిదశలోనే నియంత్రించే మందు అందుబాటులోకి రావడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. మోనోక్లోనల్ కాక్టెయిల్ డ్రగ్‌తో లాభం ఏమిటి? నాగేశ్వర్‌రెడ్డి: కోవిడ్ సోకాక హైకోమార్బిడ్ కండిషన్ ఉన్న 65 ఏళ్లపై వయసువారు, స్థూలకాయులు, టైప్–2 డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలున్న పేషెంట్లలో 30 శాతం వరకు సీరియస్ అవుతున్నారు. మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వారిని ఈ ఇంజెక్షన్ ఆదుకుంటుంది. సీరియస్ కాకుండా కాపాడుతుంది. ఇది కోవిడ్ చికిత్సలో గేమ్ చేంజర్ అవుతుంది. ఇంజెక్షన్ వేశాక ఫలితాలు ఎలా ఉన్నాయి? అమెరికాలో ఈ మందు ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఇంజెక్షన్ కు దాదాపు 20 వేల డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.14 లక్షలు అవుతుంది. ధర ఎక్కువ, బీమాలో కవర్ కాకపోవడంతో అక్కడ ఎక్కువగా తీసుకోవడం లేదు. ఇండియాలో రూ.60 వేలకే ఇది అందుబాటులోకి వస్తోంది. మా ఆస్పత్రుల్లో సీరియస్ కండిషన్ ఉన్న 45 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. వారికి 24 గంటల్లోనే జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గాయి. దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదు. అందరికీ వారంలోనే కరోనా నెగెటివ్ వచ్చింది. సీరియస్ కేసులుగా మారడం లేదు. కొత్త వేరియంట్లపై పనిచేస్తుందా? బ్రిటన్ , దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ఇంతకుముందే తేలింది. భారత్‌లోని వేరియంట్ల విషయంగా పరిశోధన చేస్తున్నాం. ఇప్పటికైతే బాగా పనిచేస్తున్నట్టు గుర్తించాం. మరో రెండు వారాల్లో పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే విస్తృతంగా వినియోగించే వీలుంటుంది. ఎవరెవరు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి? మేం చాలా జాగ్రత్తగా, నిబంధనల మేరకు ఎవరికి అవసరమో వారికే ఇస్తున్నాం. స్వల్ప లక్షణాలుండగానే తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది కదా అని భావించొద్దు. స్టెరాయిడ్స్ మాదిరిగా దీనిని కూడా ఎక్కువగా ఉపయోగించేస్తే.. కొత్త వేరియంట్లు ఏర్పడి, సమస్య వస్తుంది. అందువల్ల అనవసరంగా తీసుకోవద్దు. ఎవరికి అవసరమనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లు, ఐసీయూ, వెంటిలేటర్లపై ఉన్న వారికి ఇది ఉపయోగపడదు. సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటిదాకా అమెరికాలో రోష్ కంపెనీ ఒక్కటే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేసింది. ఇటీవలే ఇలాయ్లిలీ కంపెనీకి కూడా అనుమతినిచ్చారు. మన దేశంలో జైడస్ కంపెనీకి అనుమతి లభించినట్టు చెప్తున్నారు. ఇండియన్ కంపెనీలు దీనిని తయారు చేస్తే పది పదిహేను వేలకే ఇంజెక్షన్ అందుబాటులోకి రావొచ్చు. ఒకవేళ మూడో వేవ్ వస్తే ఈ ఔషధంతో బాగా ప్రయోజనం ఉంటుంది. కంట్రోల్ చేస్తుంది కాక్టెయిల్ యాంటీబాడీస్ ఎందుకు? కరోనా వైరస్ జతకట్టే స్పైక్ ప్రోటీన్‌కు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అతుక్కుని కలిసిపోతాయి. అయితే సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే కొన్నిసార్లు దానిని తట్టుకునే వేరియంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వేలాది మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను తీసుకుని.. వైరస్ ప్రొటీన్‌కు అతుక్కోగలిన వాటిని ఎంపిక చేశారు. వీటిలో ఒకటి తప్పిపోయినా రెండోది జత కలిసేందుకు వీలుగా రెండింటినీ కలిపి కాక్టెయిల్గా తయారుచేశారు. కొన్ని రకాల వేరియంట్లపై ఇది సమర్థవంతగా పనిచేస్తున్నట్టు తేలింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? నిజానికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు. వైరస్ సోకిన తొలిదశనే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. మా ఆస్పత్రుల్లో వంద మంది దాకా ఈ మందు ఇచ్చాం. ఒకే ఒక్క పేషెంట్‌కు కాస్త జ్వరం వచ్చి తగ్గిపోయింది. మరో పేషెంట్‌కు సీటీ స్కాన్ లో కొంత ఇన్ఫెక్షన్ పెరిగినట్టు అనిపించినా త్వరగా రికవరీ అయ్యారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చాక మళ్లీ హాస్పిటల్‌కు వచ్చిన వారెవరూ లేరు. ఈ మందును వ్యాక్సిన్‌తో పోల్చవచ్చా? ఈ కాక్టెయిల్ డ్రగ్ వ్యాక్సిన్ లా పనిచేస్తోందని ఒక పరిశోధనలో గుర్తించారు. ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబంలో.. ఒకరికి పాజిటివ్ రాగానే మిగతా వారికి ఈ మందు ఇచ్చి పరీక్షించారు. వారందరిలో యాంటీబాడీస్ ఏర్పడి కరోనా రాకుండా నియంత్రించినట్టు తేలింది. అంటే ముందస్తు జాగ్రత్తగా దీనిని వ్యాక్సిన్‌లా వాడొచ్చని వెల్లడైంది. ఏ వయసు వారికి ఈ ఇంజెక్షన్ వేయొచ్చు? పన్నెండేళ్ల వయసు పైబడిన అందరికీ (కనీస బరువు 40 కిలోలు ఆపై ఉండాలి) మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వొచ్చు. పేషెంట్ల అవసరాన్ని బట్టి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పిల్లల్లో టైప్–1 డయాబెటీస్, సికిల్‌సెల్, పుట్టుకతోనే గుండెజబ్బు, రోజూ మందులు వాడే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల రోగులు తదితర తీవ్ర జబ్బులున్న వారికి కూడా కరోనా నివారణ కోసం ఈ ఇంజెక్షన్ ఇచ్చేందుకు అనుమతి ఉంది. -యశోద ఆస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ హరికిషన్ గోనుగుంట్ల చదవండి: COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా? -
కరోనాకు కాక్ టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్‌తో చెక్
గుంటూరు మెడికల్: కోవిడ్–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్ ద్వారా ఒక్కరోజులోనే కోవిడ్ నుంచి కోలుకోవచ్చని సమిష్ట హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (శ్రీ) మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ కోగంటి కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవకుండా డే కేర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ద్వారా ఇంటి వద్దే ఉండి కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. గుంటూరులోని శ్రీ హాస్పిటల్లో శనివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీలో మొట్టమొదటిసారిగా తమ ఆస్పత్రిలో కరోనా సోకిన రోగికి అంతర్జాతీయంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రీజెనర్ ఆన్ కాక్టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్ చేశామన్నారు. గుంటూరుకు చెందిన 56 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు జ్వరం సోకి అది తగ్గకపోగా పెరిగిపోతూ సీఆర్పీ ఒక్కరోజులోనే నాలుగు రెట్లు పెరిగిందన్నారు. కోవిడ్ చికిత్స కోసం తమ వద్దకు రాగా శుక్రవారం ఆయనకు కాక్టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్ చేశామన్నారు. ఇతర మందులు ఏమీ ఇవ్వలేదని, 164 ఉన్న సీఆర్పీ ఒక్కసారిగా 75కు వచ్చిందన్నారు. శరీరంలో వైరస్ శాతం పెరిగితే సీఆర్పీ పెరుగుతుందని, ఒక్క ఇంజక్షన్‌తోనే సీఆర్పీ తగ్గుముఖం పట్టిందనే విషయం తమ ఆస్పత్రిలో రోగికి చేసిన ఇంజక్షన్ ద్వారా నిరూపితమైందన్నారు. కోవిడ్ వైరస్‌ను నిలువరించేవి శరీరంలోని యాంటీ బాడీలేనని, సాధారణంగా కోవిడ్ సోకిన వారికి యాంటీ బాడీలు శరీరంలో తయారవటానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోగా కోవిడ్ తీవ్రమయ్యే ప్రమాదముందని, ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందన్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లోగా ఇంజక్షన్ వ్యాధి పెరగకుండా, ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేకుండా కోవిడ్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా కాక్టెయిల్ ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఒక్క రోగికి ఇంజక్షన్‌కు రూ.60 వేలు ఖర్చు అవుతుందని, కరోనాపై పోరాటం చేసేందుకు ఈ ఇంజక్షన్ రోగికి బలాన్ని ఇస్తుందన్నారు. ఇంజక్షన్ చేయించుకున్నవారిలో 75 శాతం మంది ఆస్పత్రుల్లో చేరకుండా ఇళ్లలోనే ఉండి వ్యాధిని జయించవచ్చని తెలిపారు. స్టెమ్ సెల్ థెరపీ కూడా కోవిడ్ సోకిన రోగుల్లో మంచి ఫలితాలను ఇస్తుందని, శ్రీ హాస్పిటల్లో 12 మందికి స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా చికిత్స అందించి వ్యాధి నుంచి కోలుకునేలా చేశామన్నారు. సమావేశంలో శ్రీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ రవితేజ, డాక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తేకఠిన చర్యలు
-
కొవిడ్ చికిత్సకు రోష్ కంపెనీ కాక్టెయిల్ ఇంజెక్షన్
-
రోగుల బంధువుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
-
బ్యాంకులో ఉద్యోగం .. మరి ఇదేం కక్కుర్తి బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన అతగాడు తండ్రి మెడికల్ షాపును అడ్డాగా చేసుకుని రెమిడెసివిర్ (రెడీఎక్స్‌ఎల్) ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలెట్టాడు. ఒక్కో దాన్ని రూ.35 వేలకు అమ్ముతున్న ఇతడి వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని పాన్ బజార్‌కు చెందిన ఆకుల మేహుల్ కుమార్ హైటెక్ సిటీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉద్యోగి. ఇతడి తండ్రి విజయ్‌కుమార్ పాన్ బజార్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. తన తండ్రి దుకాణంలో కూర్చున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మేహుల్ వాటిని సమీకరించుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెడుతూ వివిధ మార్గాల్లో రెమిడెసివిర్ సంబంధిత ఇంజక్షన్ అయిన రెడీఎక్స్‌ఎల్ సమీకరిస్తున్నాడు. వీటిని అవసరమున్నవారికి అధిక ధరలకు విక్రయిండం మొదలెట్టారు. గరిష్టంగా ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం మేహుల్ ను పట్టుకుని నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీకాలనీ పరిధిలో.... రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ వద్ద గల ఓ మెడికల్ షాపు వద్ద రెమిడిసెవిర్ ఇంజక్షన్ కలిగి ఉన్న జోసఫ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు నాలుగు ఇంజక్షన్లు విక్రయించాడు. మరో ఇంజక్షన్‌ను 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు జోసఫ్‌రెడ్డిని ఇంజక్షన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లో... రెమిడెసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ కొర్ర బాల్‌రాజు, భాషపంగు పరశురాములు, భాషపంగు రవీందర్‌లు పథకం ప్రకారం తమకు తెలిసిన మెడికల్ దుకాణాలు, డి్రస్టిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను రూ.30 నుంచి 35 వేలకు అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆస్పత్రి సమీపంలో ఇంజక్షన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్న బాల్రాజును అరెస్టు చేశారు. ( చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..
-
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాము కాటేసిందని ఆసుపత్రికి వస్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే భరత్ రెడ్డి అనే యువకుడు ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిపక్షన్‌ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు. అయితే ప్రిస్క్రిపక్షన్‌ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు. సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్ ఇస్తారు కదా అని నిలదీశాడు. దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు. పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు. బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కరోనాకు సోరియాసిస్ మందు
న్యూఢిల్లీ: చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ పేర్కొన్నారు. ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు మాత్రమే ఈ సూదిమందును ఆయన సిఫార్సు చేశారు. క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగానే ఈ మందును సూచిస్తున్నట్లు తెలిపారు. ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను బయోకాన్ అనే దేశీయ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అల్జూమాబ్ అనే బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. సోరియాసిస్ చికిత్సకు 2013 నుంచి ఈ సూదిమందును ఉపయోగిస్తున్నారు. బయోకాన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల పట్ల డీసీజీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసింది. ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సూదిమందు ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇటోలిజుమాబ్ వ్యయం చాలా తక్కువ. -
కరోనా రోగులకు ఆ మందు వాడొచ్చు
ఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులను వాడుతున్నారు. తాజాగా చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఇటోలీజుమ్యాబ్ మందును కోవిడ్-19 పేషెంట్లకు వాడవచ్చవంటూ భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ శుక్రవారం అనుమతులిచ్చింది. తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోసతో బాధపెడుతున్న కోవిడ్ -19 రోగులకు ఈ మందును ఉపయోగించుకోవచ్చు అంటూ పీటీఐ సంస్థకు శుక్రవారం వెల్లడించింది.(కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఇటోలీజుమ్యాబ్ మందును భారత్‌కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. చాలా సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఈ మందును ఉపయోగిస్తున్నట్లు బయోకాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో బాధపడుతున్న రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఆ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తరువాత ఇటోలిజుమ్యాబ్కు అనుమతులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి. సోమయాని స్పందిస్తూ.. బయోకాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇటోలిజుమాబ్ సోరియాసిస్ సంబంధిత సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్ చికిత్సకు ఉయపయోగిస్తారన్నారు. కోవిడ్-19 చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ మందును పరిగణలోకి తీసుకున్నామన్నారు.(కోవిడ్ కేర్‌ఫుల్ సెంటర్లు) -
కరోనాకు మందు కనిపెట్టిన స్టార్ డైరెక్టర్!
కరోనాకు సంబంధించి సామాజిక భాద్యతగా చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు వీడియోలు ద్వారా తమ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. వ్యాధినిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని, వ్యాయమం చేయాలని కొంత మంది చెప్పగా, సెలబ్రెటీలందరూ మాస్క్ పెట్టుకోమని, సామాజిక దూరం పాటించాలని, చేతులు కడుక్కోవాలని చెప్పారు. ఇదిలా వుండగా దర్శకుడు వివి వినాయక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఓ ఇంజెక్షన్ గురించి మాట్లాడాడు. కరోనాకు ఆ ఇంజెక్షన్ తో చెక్ పెట్టడం సాధ్యమౌతుందేమో అనే అనుమానం వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించి వివి వినాయక్ ఒక వీడియోను విడుదల చేశారు. వినాయక్ తెలిపిన ఇంజెక్షన్ ఎల్లో ఫీవర్ అనే వ్యాధి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్.దీని గురించి ఆయన మాట్లాడుతూ, "ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం." అని వీవీ వినాయక్ అన్నారు. (ఆగిపోయిన వినాయక్ ‘సీనయ్య’?) ఇదిలా వుండగా ఈ మధ్య కరోనా నివారణకు సంబంధించి ఇద్దరు వైద్యులు మాట్లాడుకున వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కరోనా వైరస్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఉన్నాయి. ఆ ఆడియో క్లిప్ విన్న వినాయక్ వాళ్లకు తన ఆలోచన చేరాలనే ఉద్దేశంతోనే వీడియో షేర్ చేసినట్లు తెలిపారు. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని వినాయక్ తెలిపారు. అది ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమో ఒకసారి పరీక్షించాలని వినాయక్ కోరారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) -
డాక్టర్ రెడ్డీస్ నుంచి కేన్సర్ ఇంజక్షన్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కేన్సర్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బొర్టెజొమిబ్ 3.5 ఎంజీ ఇంజక్షన్‌ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వయోజన రోగులలో వివిధ రకాల కేన్సర్ చికిత్స కోసం దీని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నార్త్ అమెరికా జనరిక్స్ సీఈఓ మార్క్ కికుచీ తెలిపారు. యుక్త వయసున్న కేన్సర్ పేషెంట్లకు ఇంట్రావీనియస్ వినియోగం కోసం మాత్రమే యూఎస్ఎఫ్డీఏ ఈ కొత్త డ్రగ్ 505 (బీ)(2)కు అనుమతిచ్చిందని పేర్కొన్నారు. -
మత్తు ఇంజక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య
హయత్‌నగర్: రోగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ఓ డాక్టర్ తానే మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెక్చరర్స్ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ (అనస్తీషియన్)గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్న కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ లెక్చరర్స్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్ఈఎల్లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్ సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయాక డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడు, ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజక్షన్ వికటించి బాబు మృతి
సాక్షి, కరీమాబాద్ (వరంగల్): నగరంలోని రంగశాయిపేటలోని ఓ పిల్లల ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి ఏడు నెలల బాబు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వర్కాల మమత, రత్నాకర్ దంపతులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమ ఏడు నెలల బాబు (రుత్విక్)ను తీసుకుని రంగశాయిపేట కార్తీకేయ పిల్లల దవాఖానకు వచ్చారు. అక్కడ డాక్టర్ దయానందసాగర్ ఉదయం 11.30 ఇంజక్షన్ వేసి పంపించారు. అయితే కొంతసేపటి తర్వాత బాబు రుత్విక్ తీవ్ర అస్వస్తతకు గురికావడంతో తిరిగి ఆస్పత్రి వరకు తీసుకుకావడంలోపే మృతి చెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడంటూ బాబు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాబు మృత దేహాన్ని ఎంజీఎంకు తరలించారు. అలాగే డాక్టర్ దయానందసాగర్‌ను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో నా తప్పు లేదు.. ఈ నెల 21 జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఏడు నెలల బాబును తీసుకుని నా వద్దకు వచ్చారు. నేను ఆ రోజు కావాల్సిన సిరప్ మందులు రాసి ఇచ్చి పంపించారు. తగ్గక పోతే మళ్లీ రమ్మన్నాను. వారు గురువారం ఉదయం 11.30 గంటలకు రాగానే ఓఆర్ఎస్తో పాటు అమికాషన్ ఇంజక్షన్ ఇచ్చి పంపిచాను. వెళ్లిపోయిన వారు మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చారు. అప్పటికే బాబు మృతి చెందాడు. ఇందులో నా తప్పేమి లేదు. నేను సరిగానే ట్రీట్మెంట్ చేశా. – దయానందసాగర్, వైద్యుడు -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
మారేడుపల్లి : ఛాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. ఈ సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అడ్డగుట్ట వడ్డెర బస్తీకి చెందిన శివకుమార్ (33) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు చైత్ర (6), రితిక్‌సాయి (4) ఉన్నారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పితో పాటు కడుపులో మంటగా ఉందని వెస్ట్ మారేడుపల్లిలోని చెందిన గీతా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి (గీతానర్సింగ్‌హోమ్)కు వచ్చాడు. శివకుమార్‌ను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ స్రవంతి ఈసీజీ పరీక్షల అనంతరం ఇంజక్షన్ ఇచ్చింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే శివకుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రికి తరలివచ్చి వైద్యుల నిర్లక్ష్యంతోనే శివకుమార్ మృతిచెందాడని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్ యాదవ్, మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు, డీఐ పద్మలు మృతుని బంధువులతో చర్చించారు. మృతునికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మృతుని బంధువులతో పాటు స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
ప్రియుడి కోసం భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి..
కర్ణాటక, హొసూరు: వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని హితవు చెప్పిన భర్తకు ప్రియుడితో కలిసి విష ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి జీవ, హరి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సోనియాకు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం బయట పడటంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. అనైతిక సంబంధాన్ని మానుకోవాలని రాజలింగం హితవు పలికాడు. అయితే సోనియా భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. శనివారం రాత్రి రాజలింగం కూలిపనులకెళ్లి ఇంటికి రాగా అప్పటికే అక్కడకు చేరుకున్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోటిలో బట్టలు ఉంచి ఇంజక్షన్ వేసి హత్యచేశారు. అనంతరం మృతదేహానికి ఉరి వేశారు. తర్వాత సోనియా పెద్దగా కేకలు వేస్తూ ఇంటినుంచి బయటకు వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రోదించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. రాజలింగం పిల్లలతో విచారణ జరిపారు. అయితే అక్కడ జరిగిన ఉదంతాన్ని పిల్లలు పోలీసులకు వెల్లడించడంతో సోనియాను అరెస్ట్ చేశారు. ఆమె సెల్‌ఫోన్ నుంచి ప్రియునికి ఫోన్ చేయించగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు పలు ప్రాంతా ల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. -
ఛాతీనొప్పితో తీసుకొస్తే సూదేసి చంపేశారు
అనంతపురం, హిందూపురం అర్బన్: ‘ఛాతీలో నొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. డాక్టర్ లేడు. డ్యూటీలో ఉండే నర్సు ఇంజక్షన్ ఇచ్చింది. పది నిమిషాలకే ప్రాణం పోయింది’ అంటూ తండ్రిని పోగొట్టుకున్న ఆర్టీసీ కాలనీకి చెందిన అతీబ్, రహిమాన్ స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు... ఆర్టీసీ కాలనీలో నివాసముండే రిటైర్డు ఆర్టీసీ మెకానిక్ అబ్దుల్సలాం(65) బుధవారం రాత్రి నమాజ్ తర్వాత ఛాతీనొప్పిగా ఉందని చెప్పారు. కుమారులు అతీబ్, రహిమాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేరు. అబ్దుల్సలాం నొప్పితో బాధపడుతూ ఉండటంతో హెడ్‌నర్సు ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే ఆయనలో కదలిక లేకుండా పోయింది. అంతలో డాక్టర్ శివకుమార్ వచ్చి పరిశీలించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు, సíన్నిహితులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నొప్పి తగ్గిస్తారని తీసుకొస్తే చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డ్యూటీలో ఉండే డాక్టర్ ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని వారికి సర్ధి చెప్పడానికి చూశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు కూడా వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. కానీ బాధితులు వినలేదు. ఆసుపత్రిలో ఒకరోజు ఐదుగురు పిల్లలు చనిపోతేనే ఇంతవరకు ఏ చర్యలూ తీసుకోలేదే... ఇప్పుడేం చర్యలు తీసుకుంటారని అడిగారు. ఆసుపత్రిలో నర్సులు, సిబ్బంది రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన చెందారు. తర్వాత టౌటౌన్ సీఐ తమీంఅహ్మద్ వచ్చి తాము చర్యలు తీసుకుంటామని బాధితులకు సర్దిచెప్పారు. దీంతో వారు రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. -
ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన కేసులో ఆర్ఎంపీ డాక్టర్‌ను ఆదివారం నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్‌సుభాన్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన కె.రాంబాబు జ్వరంగా ఉండటంతో గతేడాది జూలై 13వ తేదీన పెద్దబజారు డైకస్‌రోడ్డులోని ఆర్ఎంపీ వైద్యుడు మిల్టన్కుమార్ భౌమిక్ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ అతడిని పరీక్షించి ఇంజెక్షన్ వేశాడు. కొద్దిసేపటికి రాంబాబు క్లీనిక్‌లోనే కుప్పకూలడంతో వైద్యుడు హుటాహుటిన అతడిని ఆటోలో రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రాంబాబును పరీక్షించిన డాక్టర్లు అతను మృతిచెందాడని నిర్ధారించారు. దీంతో అప్పట్లో చిన్నబజారు పోలీసులు ఈ ఘటనపై సెక్షన్ 174 సీఆర్పీసీ (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదుచేశారు. ఇటీవల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో రాంబాబు ఇంజెక్షన్ వికటించి మృతిచెందాడని నిర్ధారణ కావడంతో సెక్షన్ 174ను 304 (ఎ) ఐపీసీగా మార్పుచేశారు. ఆదివారం నిందితుడైన మిల్టన్కుమార్ భౌమిక్‌ను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మహిళ గుండె భాగంలో సూది
టీ.నగర్(తమిళనాడు): వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికి ఇంజెక్షన్ వేస్తుండగా విరిగిన సూదిని వెంటనే తీయకపోవడంతో సూది గుండె వరకు వెళ్లింది. తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల కిందట శశికళ జ్వరంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అక్కడ నర్సులు ఆమెకు ఇంజెక్షన్ వేయగా సూది విరిగిపోయి శశికళ చెయ్యి లోపలి భాగంలో ఉండిపోయింది. ఇంటికి వెళ్లిన శశికళకు చేతి నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీసి చూడగా విరిగిన సూది చేతిలోపలి భాగంలో ఉన్నట్లు తేలింది. తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోగా ఆ సమయంలో వైద్యులు సూదిని తొలగించినట్లు చెప్పారు. మూడు నెలల గర్భిణి అయిన శశికళకు శుక్రవారం గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంటి సమీపంలో ఉన్న డాక్టర్ వద్ద ఎక్స్‌రే తీసి చూడగా చేతిలో విరిగిన సూది గుండె వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. దీనిపై శశికళ మాట్లాడుతూ.. వైద్యులు సూదిని తొలగించామని చెప్పి మోసగించారని.. సూది గుండె వద్దకు చేరుకుని ప్రాణాల మీదకు వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. -
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
తాడితోట (రాజమహేంద్రవరం): ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. కోరుకొండ మండలం కణుపురు గ్రామానికి చెందిన దొడ్డి అమ్మాజీ(55) తలలో నరాల బలహీనత గురించి వైద్యం చేయించుకునేందుకు సోమవారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీ డాక్టర్ నాయక్ ఆమెను పరీక్షించి ఇంజక్షన్ చేయమంటూ డ్యూటీ నర్సుకు అప్పగించారు. అయితే ఇంజక్షన్ చేసిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, మృతికి కారణమైన నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజక్షన్ ఒకేసారి చేయకుండా సెలైన్ బాటిల్ ద్వారా ఎక్కించాలని సూచించినా నర్సు పట్టించుకోకుండా ఇంజక్షన్ చేసిందని, అందువల్లే ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. సంఘటనపై డాక్టర్లతో ఆమె చర్చించారు. డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యంపై నిలదీశారు. మరోవైపు మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు శివ, బీసీ యువజన సంఘం నాయకులు దాస్యం ప్రసాద్, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
నక్కపల్లి(పాయకరావుపేట) : గొడిచర్ల పీహెచ్సీలో ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలుఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గోకుల పాడుకు చెందిన కొఠారు నాగమణి(24) తన స్నేహితురాలు నానేపల్లి విజయతో కలసి సోమవారం ఉదయం గొడిచర్ల పీహెచ్‌సీకి వచ్చింది. తనతో తెచ్చుకున్న ఇంజక్షన్‌ను చేయాలని అక్కడ ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ రూపను కోరింది. అయితే ఇంజక్షన్ చేసేందుకు రూప నిరాకరించింది. బతిమాలడంతో ఆమె నాగమణికి ఇంజక్షన్ చేసింది. కొద్దిసేపటికి నాగమణి సృహతప్పిపడిపోయింది. వెంటనే రూప, నాగమణి స్నేహితురాలు విజయ ఆమెకు మంచినీరు పట్టి, సపర్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించిందని తనకు విజయ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని మృతురాలికి వరుసకు సోదరుడైన లంక రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒత్తిడి మేరకు తాను ఇంజక్షన్ చేసినట్టు రూప చెబుతోంది.అయితే ఇంజక్షన్‌ను మక్కకు చేయాల్సి ఉండగా చేతికి చేయడం వల్లే వికటించి మరణించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి నాగనరేంద్ర తెలిపారు.కాగా మృతురాలు కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధపడుతోంది. తరచూ ఇంజక్షన్లు చేయించుకుంటోంది.దీనిలో భాగంగానే స్నేహితురాలితోకలసి గొడిచర్ల వచ్చి అక్కడ ఇంజక్షన్ చేయమని కోరిందని, ముందు నిరాకరించిన ట్యాబ్‌టెక్నీషియన్ రూప తర్వాత చేసిందని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉన్న సమయంలో హృద్రోగంతో బాధపడుతున్న రోగికి ఆయన అనుమతి తీసుకోకుండా ఇంజక్షన్ చేయడం నేరమని తెలుస్తోంది. నక్కపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
ఇంజెక్షన్ వేయడం రాదన్న ప్రభుత్వ వైద్యురాలు
ఈ వ్యవహారం తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఎంబీబీఎస్ పూర్తిచేసి, నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టరమ్మకు సూది వేయడం తెలియదట. ఎప్పు డూ సూదే వేయలేదట. ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు.. రాజధానికి కూతవేటు దూరంలోనే ఈ వింత వెలుగుచూసింది. దొడ్డబళ్లాపురం: ‘నాకు ఇంజెక్షన్ చేయడం రాదు. రేపు రండి. ఇవాళ నర్స్ రాలేదు. ఇంజక్షన్ ఎంతివ్వాలి, ఎలా ఇవ్వాలో నిజంగా నాకు తెలియదు.’ ఇలా అన్నది ఏ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టరో, రోడ్డుపక్కన క్లినిక్ నడుపుకునే ఆర్‌ఎంపీనో కాదు. సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నియమించిన ఎంబీబీఎస్ డాక్టరు. బెంగళూరు సమీపంలో దేవనహళ్లి తాలూకా కొయిరా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి వైద్యురాలు రశ్మి ఇంజక్షన్ చేయడం రాదని రోగులకు చెప్పడంతో పెద్ద గందరగోళమే రేగింది. సోమవారంనాడు గ్రామంలోని చిక్కేగౌడ నాలుగేళ్ల కూతురికి కుక్క కరిచింది. కూతురికి ఇంజెక్షన్ ఇప్పిద్దామని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అయితే డాక్టర్ రశ్మి తనకు సూది వేయడం రాదని, అందులోనూ కుక్క కరిచిన వారికి ఇంతవరకూ సూది వేయలేదని చెప్పారు. నర్స్ ఈరోజు రాలేదు..రేపు రండి అని చెప్పారు. రెండోరోజూ అదే తంతు మళ్లీ మంగళవారం కూతురిని తీసుకుని చిక్కేగౌడ ఆస్పత్రికి వెళ్లాడు. ఈసారి సూది వేయాల్సిందేనని చిక్కేగౌడ పట్టుబట్టడంతో డాక్టర్ రశ్మి ఏడుపు అందుకున్నారు. తాను ఇంతవరకూ ఎప్పుడూ ఇంజెక్షన్ చేయలేదని, మోతాదు వివరాలు కూడా తెలియవని చెప్పారు. ఆస్పత్రిలో ఇన్నాళ్లూ నర్సే ఇంజెక్షన్లు వేస్తోందని చెప్పడంతో చిక్కేగౌడ బిత్తరపోయాడు. ఇలా మంగళవారం కూడా ఆస్పత్రికి వచ్చిన రోగులను వెనక్కు పంపడం జరిగింది. చిక్కేగౌడ గ్రామస్తులకు విషయం చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి ఆస్పత్రి ముందు బైఠాయించి వైద్యం చేయడం రాని డాక్టర్‌ను తక్షణం బదిలీ చేయాలని డిమాండు చేస్తూ ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న డీహెచ్ఓ రాజేశ్, పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని ఫోన్ ద్వారా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డాక్టర్ రశ్మి గత నాలుగేళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
పసిపాపను బలిగొన్న ఇంజెక్షన్
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇంజెక్షన్ వికటించి 45 రోజుల చిన్నారి బుధవారం మృతి చెందింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో నివాసముంటున్న అప్పాల విజయ్–హారిక దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు రియా. చిన్నమ్మాయి 45 రోజుల పసికందు. రోజూ అంగన్వాడీ సెంటర్లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక పాపను ఆస్పత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది. తర్వాత రెండో ఏఎన్ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండటంతో ఏమీ కాదంటూ ఇంజెక్షన్ చేశారు. ఇంటికి తీసుకొచ్చాక కొద్దిసేపటికి∙పాపలో చలనం లేకపోవడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు 2 గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మూడేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్కీ(రియా)కి కూడా ఇదే ఆస్పత్రిలో ఇంజెక్షన్ వికటించిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపా యం తప్పిందని తండ్రి విజయ్ తెలిపారు. -
ఇంజెక్షన్ ఇచ్చి భర్తను చంపిన భార్య
♦ ప్రియుడితో కలిసి పథక రచన ♦ నిర్మలగిరిపై వీడిన హత్య మిస్టరీ దేవరపల్లి : ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసిన భార్య ఉదంతం ఇది. భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని దేవరపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై పి.వాసు విలేకరులకు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంకు చెందిన చేగొండి భీమశంకరం(30)నకు అదే గ్రామానికి చెందిన జయలక్ష్మితో ఈ ఏడాది మేలో వివాహమైంది. మొదటి నుంచి జయలక్ష్మి భీమశంకరాన్ని విభేదిస్తుంది. ద్రాక్షారామంలోని మాధవానంద నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా పనిచేస్తోన్న ఆమె అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఏలూరి వీరేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. జయలక్ష్మి ప్రవర్తనపై శంకరానికి అనుమానం రావడంతో అనేకసార్లు మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య జయలక్ష్మి, వీరేష్ పథకం రూపొందించారు. తాను వీరేష్‌తో ఎటువంటి అక్రమ సంబంధం కొనసాగించడంలేదని, చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి నిర్మలగిరికి వెళ్లి ప్రార్థన చేసి వద్దామని భర్త భీమశంకరంను నమ్మబలికింది. దీనిలో భాగంగా జయలక్ష్మి తన భర్తతో గత నెల 29న దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి వచ్చింది. పుణ్యక్షేంత్రంలో ప్రార్థన చేశారు. అనంతరం భీమశంకరంతో జయలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించిన రిపోర్టు వచ్చిందని, నీ ఆరోగ్యం బాగాలేదని తేలినందున నీరసం రాకుండా ఇంజెక్షన్ ఇస్తానని నమ్మబలికింది. భర్త అంగీకరించడంతో కిటమిన్ హై పవర్ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చింది. అనంతరం 90 సెకన్ల వ్యవధిలో భీమశంకరం ప్రాణాలు విడిచాడు. జయలక్ష్మి తిరిగి గ్రామానికి వెళ్లిపోయింది. నిర్మలగిరిపై శంకరం మృతదేహాన్ని గుర్తించిన ఎస్సై పి.వాసు కొవ్వూరు సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలగిరిపై సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా కేసు ఛేదించినట్టు ఎస్సై వివరించారు. -
దెబ్బ తగిలింది... టీటీ తప్పదా?
పీడియాట్రీ కౌన్సెలింగ్ మా బాబుకు ఏడేళ్లు. దెబ్బలు తగిలిన ప్రతి సందర్భంలో టీటీ ఇంజెక్షన్ వేయించాలా? - రవికాంత్, నల్లగొండ పిల్లలకు నెలన్నర, రెండున్నర నెలలు, మూడున్నర నెలలో ఇచ్చే డీపీటీ టీకాలో టీటీ టీకా కూడా ఉంటుంది, ఏడాదిన్నర, నాలుగేళ్ల వయసులో ఇచ్చే డీపీటీ టీకాలోనూ టీటీ మందు ఉంటుంది. ఆ టీకాలన్నింటినీ మీరు కరెక్ట్‌గా వేయిస్తే ప్రతి చిన్న దెబ్బకూ టీటీ ఇంజెక్షన్ వేయించాల్సిన అవసరం లేదు. పదేళ్ల వయసులో మళ్లీ డీపీటీ టీకా వేయించాలి. ఆ తర్వాత ప్రతి పదేళ్లకూ టీటీ వేయిస్తూ ఉండాలి. బాగా పెద్ద దెబ్బ తగిలి, దానికి బాగా మట్టి అంటుకుపోతే పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైతే టీటీ టీకా, టెటనస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇవ్వాల్సి రావచ్చు. ఈ అవసరం సాధారణంగా సరిగ్గా షెడ్యూల్ ప్రకారం డీపీటీ, టీటీ టీకాలు తీసుకోనివారికే పడుతుంది.దెబ్బ తగలగానే ముందుగా శుభ్రంగా నీళ్లతో యాంటీసెప్టిక్ సబ్బుతో కడిగి శుభ్రమైన బట్టతో పొడిగా అద్దాలి. చిన్న చిన్న దెబ్బలను శుభ్రంగా, పొడిగా ఉంచితే తొందరగా మానిపోతాయి. మా మేనల్లుడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు డెంగ్యూ చాలా తరచుగా కనిపిస్తోంది కదా. వాడు డెంగ్యూతో బాధపడుతున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ప్లేట్లెట్స్ ఎక్కించాలా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వండి. - నిహారిక, ఖమ్మం డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు తెల్ల రక్తకణాల సంఖ్య, పేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది. అదే టైమ్‌లో రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ కావడం వల్ల ఎర్రరక్తకణాల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రక్తపోటు (బీపీ) పెరగడం, ముఖం కొంచెం ఉబ్బుగా కనిపించడం జరగవచ్చు. అవసరాన్ని బట్టి కరెక్ట్‌గా సెలైన్ ఎక్కించడం ద్వారా డాక్టర్లు బీపీ తగ్గకుండా చూసుకుంటారు. ప్లేట్లెట్స్ బాగా తగ్గితే (పది నుంచి ఇరవై వేల కంటే తక్కువకి పడితే) మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. క్యాపిల్లరీ లీక్ అంటే రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ తగ్గుముఖం పడుతున్న టైమ్‌లో ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో నీరుపట్టడం, ఆయాసం రావడం వంటివి కూడా జరగవచ్చు. డెంగ్యూబారిన పడిన ఏ పిల్లలనైనా తప్పనిసరిగా పిల్లల డాక్టర్‌కి చూపించాలి. డెంగ్యూలో తీవ్రత పెరుగుతోందనే సూచనలు... అంటే అదేపనిగా వాంతులు కావడం, పొట్టనొప్పి, ఒళ్లు చల్లబడిపోవడం, ఒంటి నిండా ఎర్రమచ్చలు, ఎక్కడి నుంచైనా రక్తస్రావం జరగడం, మత్తుగా లేదా చికాకుగా ఉండటం, మూత్రం బాగా తగ్గిపోవడం, బాగా ఆయాసంగా ఉండటం జరిగితే మాత్రం తప్పనిసరిగా హాస్పిటల్లో చేర్చాల్సి ఉంటుంది. డాక్టర్ శివరంజని హెచ్ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మాక్స్‌క్యూర్ షియోషా, మాదాపూర్, హైదరాబాద్ డయాలసిస్‌కు ప్రత్యామ్నాయం... నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - డి. విశ్వేశ్వర్, మునగాల ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) మెషిన్‌ను వాడటం మంచిది. దీంతో డయాలసిస్ చాలా సులువుగా చేసుకోవచ్చు. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది. నా వయసు 34 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - ఎస్. బాలయ్య, జనగామ మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ అజీర్ణం... కడుపు ఉబ్బరం తగ్గేదెలా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను మార్కెటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నేను కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? - దశరథ, నిజామాబాద్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం పైత్య రసం వెనక్కి ప్రవహించడం కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ఆకలి తగ్గిపోవడం కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : సమయానికి ఆహారం తీసుకోవాలి కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఇంజక్షన్ వికటించి గర్భిణీ మృతి
హైదరాబాద్: కూకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి స్రవంతి(25) అనే గర్భిణీ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే స్రవంతి మృతికి కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో ఇంజక్షన్ ఇవ్వడంతో స్రవంతి కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమార్తె మృతికి కారణమైన డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని తండ్రి వీరేశం, అమ్మ సుజాతలు డిమాండ్ చేశారు. -
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్‌కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్‌నగర్‌లో ఆర్ఎంపీ బషీర్‌బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను ఆర్ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్‌కు చికిత్స చేసిన ఆర్ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజెక్షన్ వికటించి ఆరేళ్ల బాలుడు మృతి
ధర్పల్లి: ఇంజెక్షన్ వికటించి గురువారం ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ పరిధిలోని మరియాతండాకు చెందిన బదావత్ వర్ష్య, వనితల కుమారుడు అశోక్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం గురువారం రాత్రి ధర్పల్లిలోని ఆర్ఎంపీ రజాక్ వద్దకు తీసుకొచ్చారు. ఆయన బాలుడికి జెంటామైసిన్ 40 ఎంజీ ఇంజెక్షన్ ఇచ్చారు. వారు ఇంటికి వెళ్లిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన చోట గడ్డ కట్టినట్లు గుర్తించారు. అక్కడి నుంచి నీరు కారుతుండడంతో మళ్లీ సదరు ఆర్ఎంపీ వద్దకే తీసుకొచ్చారు. అతను మందు ఇచ్చినా.. మరింత ఎక్కువ కావడంతో బాలుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. జిల్లా కేంద్రంలోని వైద్యుడు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలివెళ్లుతుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. కాగా, బాలుడి మృతికి ఆర్ఎంపీ కారణమని ఆరోపిస్తూ మరియాతండావాసులు పెద్ద ఎత్తున ఆర్ఎంపీ ఇంటి వద్ద ఆందోళన చేశారు. -
ఇంజక్షన్ వికటించి డ్రైవర్ మృతి
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యుడు నిర్లక్ష్యంతో సరైన ఇంజక్షన్ ఇవ్వకపోవ డంతో.. సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని రాయదుర్గంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. స్థానిక రాఘవేంద్ర క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో.. మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఇంజక్షన్ నాసిరకం
నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ ఎంజీఎం (వరంగల్): వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు తాగి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్‌గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్ఎల్ఐ 540ఎల్ బ్యాచ్‌కు చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్స్‌ను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వినియోగించకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి ఆదేశాలు జారీ చేశారు. వెలుగు చూసింది ఇలా.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, పరిపాలనాధికారుల ఆదేశాలతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా అయిన యాంపిల్స్ మాత్రమే చూపించి, స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్‌ను బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్లోనే ఫంగస్ వచ్చింది. ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యూంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది. -
ఇంజక్షన్ వికటించి తొమ్మిది మేకలు మృతి
రణస్థలం : రణస్థలం పంచాయతీ పిట్టపాలేం గ్రామానికి చెందిన ఆవల లక్ష్మణరావుకు చెందిన తొమ్మిది మేకలు సోమవారం ఉదయం మృతి చెందాయి. లక్ష్మణరావుకు 15 మేకలు ఉండగా ఇందులో ఒక మేకకు జబ్బు చేసి చనిపోవటంతో సమీపంలోని రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆర్ఎస్ఎన్ పట్నాయిక్‌కు విషయం తెలియజేశారు. మేక చనిపోయిందని మిగతా మేకలకు ఎటువంటి జబ్బు రాకుండా మందులు వేయాలని లక్ష్మణరావు కోరడంతో సోమవారం ఉదయం రిటైర్డ్ వైద్యులు పట్నాయిక్ పిట్టపాలేం వెళ్లి మేకలకు ఇంజక్షన్లు చేశారు. 14 మేకలకు ఇంజక్షన్లు చేయగా చేసిన 5 నిమిషాలకే ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది మేకలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారులు బి.దుర్గారావు, రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మందు తీవ్రతను మేకలు తట్టుకోలేకపోయాయని సమయంలో విరుగుడు ఇవ్వలేకపోవటం వల్ల చనిపోయాయని వైద్యులు చెప్పారు. బాధితునికి శాఖ తరఫున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్ట్ వైద్యులు పట్నాయిక్ మాట్లాడుతూ తాను సరిగానే ఇంజక్షన్లు చేశానని జబ్బు వల్ల చనిపోయి ఉంటాయని చెప్పారు. -
వరంగల్ ఆస్పత్రిలో ఇంజెక్షన్ కలకలం
-
సూదిమందు వికటించి శిశువు మృతి
కొల్చారం మండలం కొంగోడ్‌లో విషాదం కొల్చారం: ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ (పీఎంపీ) ఇచ్చిన సూదిమందు వికటించడంతో ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన కొంగోడ్‌లో శుక్రవారం వెలుగుచూసింది. కొల్చారం ఎస్ఐ విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... కొంగోడ్కు చెందిన వంజరి ఏగోండ, లింగమ్మ దంపతుల కుమారుడు తేజ (ఏడు నెలలు) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించారు. అక్కడి డాక్టర్ మూడు రోజుల క్రితం బాలుడికి సూదిమందులు రాసి ఇచ్చారు. వాటిని రోజూ బాలుడికి ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో వారు గ్రామంలోని పీఎంపీ వద్ద మూడు రోజులుగా బాలుడికి సూదిమందు ఇప్పించారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే బాలుడికి సూదిమందు ఇచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు బాలుడి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
సూది మందు వికటించి చిన్నారి మృతి
కొల్చారం (మెదక్) : ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తేజ అనే ఏడు నెలల బాలుడికి రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక డాక్టర్(ఆర్ఎంపీ) వద్ద ఇంజక్షన్ చేయించారు. సూది వేసిన కొద్దిసేపటికే బాలుడు ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకొని మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు డాక్టర్‌పై దాడి చేశారు. -
కార్డియో వాస్కులర్‌కు సూదిమందు
మన శాస్త్రవేత్తలు కనుగొన్నారన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్థన్ బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడాన్ని సీసీఎంబీ తయారు చేసినట్లు వెల్లడి సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల కృషితో డీజిల్‌తో నడిచే చిన్న ట్రాక్టర్ తయారీ రాష్ట్రాల పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రెస్‌మీట్ సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కార్డియో వాస్కులర్ వ్యాధులకు సూదిమందు రూపంలో ప్రొటీన్ అందించి ప్రాణాలు కాపాడే ఔషధాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వెల్లడించారు. సీఎస్ఐఆర్కు చెందిన శాస్త్రవేత్తలు గుండె నాళాల్లోని రక్తపు గడ్డలను తొలగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి(క్లాట్లను తొలగించే స్ట్రెప్టోకినేస్) రూపకల్పన చేశారని తెలిపారు. క్లాట్ల ఆధారిత త్రాండోలిటిక్ ఔషధానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. క్లాట్లను కరిగించే కొత్త తరానికి చెందిన ఔషధాలనూ తయారుచేశారన్నారు. దేశీయం గా తయారైన ఈ స్ట్రెప్టోకినేస్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాత్రికేయులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఢిల్లీ నుంచి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను హర్షవర్థన్ వెల్లడించారు. మధుమేహ చికిత్స కోసం వనమూలికలతో తయారైన బీజీఆర్-34 ఫార్ములేషన్‌కు ఆయుష్ శాఖ అనుమతి లభించిందని, దీన్ని వాణిజ్యపరంగా తయారుచేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి లెసైన్స్ ఇచ్చామన్నారు. ఒక్కోటి రూ.5 ఉండే ఈ మూలికా ఔషధంతో తయారైన మాత్రలను ఇప్పటికే ఉత్తర భారతంలో కొన్నిచోట్ల విడుదల చేశామన్నారు. అతిసారను నిరోధించి పిల్లల జీవితాలను కాపాడే మరో కీలక ఔషధం రోటావైరస్ వ్యాక్సిన్ దేశీయంగానే తయారైందన్నారు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లల ప్రాణాలు అతిసారానికి బలికాకుండా కాపాడవ చ్చన్నారు. బ్యాక్టీరియాను తట్టుకునే సాంబమసూరి.. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ), వరి పరిశోధన డెరైక్టరేట్(డీఆర్ఆర్) శాస్త్రవేత్తలు ఉమ్మడిగా బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడం ‘సాంబమసూరి’ని అభివృద్ధి చేశారని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుల్లో 90 వేల హెక్టార్లలో పండిస్తున్నారన్నారు. వివేక్ 9 పేరిట అధిక ప్రొటీన్, అధిక ప్రో విటమిన్ ఏ ఉన్న హైబ్రీడ్ మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశామన్నారు. రూ.2 లక్షల ధరలోనే అందుబాటులో ఉండే 11.2 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చిన్న డీజిల్ ట్రాక్టర్‌ను సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారన్నారు. వచ్చే మూడేళ్ల కాలాన్ని జనవిజ్ఞాన్ యుగంగా మంత్రి అభివర్ణించారు. ప్రధాని నాయకత్వంలో పలు ప్రాజెక్టులను రూపొందించామన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ జోన్లలో దశలవారీగా ‘బయోటెక్-కిసాన్’ అమలు చేయబోతున్నామన్నారు. చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తూ చేపడుతోన్న ప్రాజెక్టు ఇదన్నారు. 2015 మార్చిలో రూ.4,500 కోట్లతో కేంద్రం సూపర్ కంప్యూటింగ్ మిషన్‌కు అనుమతిచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 70 అత్యున్నత సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత కంప్యూటింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యమన్నారు. రెండేళ్లుగా వాతావరణం, తుపాన్ల గుర్తింపు నైపుణ్యాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇచ్చిన ప్రమాద హెచ్చరికల వల్ల వర్షపాతం సాంద్రత, తుఫాన్ తీరాన్ని తాకే సమయాన్ని చక్కగా గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారని హర్షవర్థన్ పేర్కొన్నారు. -
బరువు తగ్గించే సరికొత్త ఇంజెక్షన్
బాల్టిమోర్: ప్రపంచంలో ఎక్కడైనా సరే అధిక బరువుతో బాధ పడుతున్న వారి బాధ అంతా ఇంతా కాదు. ఎలాగైనా బరువు తగ్గాలనుకుంటారుగానీ అందుకు అంతగా కష్టపడరు. ప్రస్తుతం బరువు తగ్గేందుకు వ్యాయామం, డైట్ కంట్రోల్, మందులు, సర్జరీ అనే నాలుగు పద్ధతులు అందుబాటులో ఉంది. వీటన్నింటికన్నా సులభం, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఐదవ పద్ధతి అందుబాటులోకి వస్తోంది. ఈ పద్ధతినే ‘బారియాట్రిక్ ఆర్టీరియల్ ఎంబోలైజేషన్’ అని పిలుస్తారు. పేరు వింటే కంగారు వేయవచ్చుగానీ అత్యంత సులభమైన ఈ పద్ధతిని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నిపుణులు కనుగొన్నారు. ఈ అత్యాధునిక పద్ధతిలో లావు తగ్గాలని ఆశించేవారి కడుపులోకి మైక్రోస్కోపిక్ బీడ్స్ అంటే అత్యంత సూక్ష్మమైన పూసలను ఇంజెక్షన్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. అవి ఆకలికి కారణమవుతున్న హార్మోన్ ‘గ్రెలిన్’ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల ఆకలి తగ్గుతుంది. పర్యవసానంగా తినడం కూడా తగ్గిపోతుంది. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే నెల రోజుల్లో 5.9 శాతం, మూడు నెలల్లో 9.5 శాతం, ఆరు నెలల్లో 13.3 శాతం బరువు తగ్గిపోతుందని ప్రయోగాత్మకంగా రుజువైంది. అలాగే ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారిలో రెండు వారాల్లో 81 శాతం, నెల రోజుల్లో 59 శాతం, మూడు నెలల కాలంలో 26 శాతం ఆకలి మందగిస్తుందని హాప్కిన్స్ యూనివర్శిటీలో ఇంటర్వెన్షనల్ రేడియోలోజి రిసెర్చ్ విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ క్లిఫోర్డ్ వైస్ తెలిపారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవని, ఖర్చు కూడా తక్కువని ఆయన తెలిపారు. -
సూదిగాడు.. దొరికాడు?
ఏలూరు: ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటికి కునుకు లేకుండా చేసి జాతీయ వార్తల్లో సైతం నిలిచిన సైకో సూదిగాడు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని వీర వానరం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో మీడియా ముందుకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని సంబంధిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. -
మొగల్తూరులో ‘సూది’ సైకో ప్రత్యక్షం
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు మరోసారి కలకలం సృష్టించాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సైకో మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. గ్రామానికి చెందిన హారిక అనే మూడేళ్ల చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. బాలిక ఏడుపుతో తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చేసరికి అక్కడి నుంచి సైకో పరారయ్యాడు. ఏ క్షణాన ఎవరికి ఇంజక్షన్ ఇస్తాడోనని ప్రజలు భయపడుతున్నారు. గ్రామస్తులు ఫోన్ ద్వారా పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. మరోక పక్క సూది సైకో కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తణుకు పరిసరప్రాంతాల్లో గాలిస్తుండగా సూదిగాడు మారుమూల ప్రాంతమైన ముత్యాలపల్లిలో ప్రత్యక్షం కావడం గమన్హారం. -
పోలీసుల అదుపులో ఇంజక్షన్ సైకో?
-
మహిళపై ఇంజక్షన్‌తో ఆగంతకుడు దాడి
-
నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గించే కొత్త ఇంజెక్షన్
కొత్త పరిశోధన ఒక వయసు దాటాక మోకాలి కీలు అరిగిపోతే మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (నీ రీప్లేస్మెంట్ సర్జరీ) చేయించుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలిలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు పరిశోధకులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత వచ్చే నొప్పిని (పోస్ట్ ఆపరేటివ్ పెయిన్) తగ్గించడానికి ‘లైపోజోమల్ బ్యుపివెకెయిన్’ అనే మోకాలి చుట్టూ ఉండే కండరాలు, నరాలను మొద్దుబార్చే ఇంజెక్షన్‌ను యాంటీబయాటిక్‌తో పాటు మరికొన్ని ఇంజెక్షన్ల కాక్టెయిల్ను ఇవ్వడం బాగా ఉపయోగపడుతుందని సర్జన్లు పేర్కొంటున్నారు. ఇటీవల అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హిప్ అండ్ నీ సర్జన్స్ వార్షిక సమావేశంలో ఈ అంశాన్ని ఆర్థోపెడిక్ సర్జన్లు నిర్ధారణ చేశారు. ఈ అధ్యయనం కోసం 216 మంది పేషెంట్లను ఎంపిక చేశారు. వారిలో సగం మందికి సంప్రదాయ నొప్పి నివారణ మందులను ఇచ్చారు. ఇక మరో సగం మందికి పైన పేర్కొన ‘లైపోజోమల్ బ్యుపివెకెయిన్ అనే ఇంజెక్షన్‌తో పాటు మరికొన్ని ఇంజెక్షన్ల కాక్టెయిల్ ఇవ్వడం వల్ల శస్త్రచికిత్స అనంతరం వచ్చే నొప్పి (పోస్ట్ ఆపరేటివ్ పెయిన్) గణనీయంగా తగ్గినట్లు తేలింది. -
డయాబెటిక్ కౌన్సెలింగ్
నాకు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ (ఐడీడీఎమ్) అని, ఇన్సులిన్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా అంతట నేనే ఇన్సులిన్ షాట్ (ఇంజెక్షన్) ఎలా తీసుకోవాలో చెప్పండి. - శారద, హైదరాబాద్ డయాబెటిస్ అనేది రెండు రకాలు. ఇందులో టైప్-1 డయాబెటిస్ వచ్చినవారిలో ఇన్సులిన్ అస్సలు ఉత్పత్తి కావడం జరగదు. దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ (ఐడీడీఎమ్) అంటారు. వీళ్లు క్రమం తప్పకుండా తమ రక్తంలో చక్కెర పాళ్లు పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అయితే ప్రతిసారీ వారు హాస్పిటల్‌కు వెళ్లడమో లేదా ఇంజెక్షన్ చేసేవారిని ఆశ్రయించడమో కష్టం కాబట్టి తమంతట తామే ఇంజెక్షన్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది చాలా సులువు కూడా. మీరు ఈ కింది ప్రక్రియలను ఒకదాని తర్వాత మరొకటి (స్టెప్ బై స్టెప్) చేయండి. 1. చేతులను సబ్బుతో చాలా శుభ్రంగా కడుక్కోవాలి. 2. ఇన్సులిన్ ఉన్న సీసాను (ఇన్సులిన్ ఇంజెక్షన్ వెయిల్‌ను) చేతుల్లోకి తీసుకొని దానిలోని మందు ఒక చివర నుంచి మరో చివరకు కదిలేలా వెయిల్‌ను కదపాలి. 3. స్టెరిలైజ్ చేసిన దూదిముద్దతోగానీ, స్పిరిట్‌లో ముంచిన దూదితోగానీ సీసా మూతను తీయాలి. 4. నీడిల్ (సూదిపై) పై ఉన్న కవర్‌ను తొలగించి దానికి సిరంజిని అమర్చి, ఆ సిరంజిలో ముందుగా గాలి పూర్తిగా నిండేలా ప్లంజర్‌ను (ఇంజెక్షన్ వెనక ఉండే వెనక్కు ముందుకు నొక్కే పరికరాన్ని) వెనక్కు లాగాలి. 5. ఇప్పుడు గాలి నిండి ఉన్న ఆ ఇంజెక్షన్ నీడిల్‌ను ఇన్సులిన్ ఉన్న సీసాలోకి గుచ్చి గాలిని ఇన్సులిన్ సీసాలో నిండేలా ప్లంజర్‌ను నొక్కాలి. ఈ సమయంలో ఇంజెక్షన్‌లోకి ఇన్సులిన్‌ను తీసుకోకూడదు. 6. ఇప్పుడు ఇన్సులిన్ ఉన్న సీసాను తలకిందులుగా పట్టుకొని, ఇంజెక్షన్ సూదిని ఇన్సులిన్ ఉన్న సీసాలోకి గుచ్చాలి. మందు ఉన్న చోట నీడిల్ ఉండేలా గుచ్చి ప్లంజర్‌ను వెనక్కులాగుతూ ఇంజెక్షన్‌లోకి మార్కర్ (సూచిక) ఉన్న చోటి వరకూ మందు ఎక్కేలా ప్లంజర్‌ను వెనక్కులాగాలి. ఈ ప్రక్రియలో గాలిబుడగలు ఇంజెక్షన్‌లోకి ఎక్కకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ ఇంజెక్షన్లో గాలిబుడగలు ఉన్నట్లు గమనిస్తే... అవి తొలగిపోయేలా నెమ్మదిగా ప్లంజర్‌ను నొక్కి, గాలి బుడగలేవీ లేకుండా చూసుకోవాలి. 7. మార్కర్‌కు మించి అదనంగా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్లో తీసుకుంటే, దాన్ని బయట పారేయాలి తప్ప మళ్లీ బాటిల్లోకి తిరిగి ఇంజెక్ట్ చేయకూడదు. 8. మీరు మీ శరీరభాగంలో ఇంజెక్షన్ షాట్ తీసుకోవాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విషయంలో తొలుత డాక్టర్‌ను సంప్రదించి ఉంచుకోండి. 9. మీరు ఇంజెక్షన్ షాట్ తీసుకోవాలనుకున్నచోట ఉన్న చర్మాన్ని స్పిరిట్ ముంచిన దూదిముద్దతో తుడవండి. 10. మీ రెండు వేళ్లతో మీరు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన చర్మాన్ని వేళ్ల మధ్యకు తీసుకోండి. ఇప్పుడు సరిగ్గా నిట్టనిలువుగా శరీరంలోకి గుచ్చుకునేలా ఇంజెక్షన్ సూదిని నెమ్మదిగా చర్మంలోకి గుచ్చుకోండి. 11. మందు మీ శరీరంలోకి వెళ్లేలా ప్లంజర్‌ను నెమ్మదిగా నొక్కి, ఇన్సులిన్ అంతా శరీరంలోకి విడుదలయ్యేలా ప్లంజర్‌ను నొక్కండి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ వేళ్ల మధ్య ఉన్న చర్మాన్ని వదిలేయండి. డాక్టర్ కె.డి. మోదీ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఇక సూది మందివ్వడం సులువు
న్యూయార్క్: చేతి మణికట్టు నుంచి మోచేతి వరకు ఎక్కడైనా రక్త నాళాలను (సిరలు) గుర్తించి వాటిలోకి సూది మందులను ఎక్కించడానికి నైపుణ్యం అవసరం. ఎంత నైపుణ్యంగల నర్సులకైనా కొంత మంది రోగుల రక్తనాళాలను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందర్భాల్లో గుచ్చినచోట గుచ్చకుండా సూదులు గుచ్చిగుచ్చి రోగులను అనవర బాధకు గురిచేస్తారు. ‘అలా గుచ్చిగుచ్చి చంపకే’ అంటూ ఎంత మొరపెట్టుకున్నా వినే నర్సులుండరు. ఇక అలాంటి బాధను అనుభవించాల్సిన అవసరం రోగులకు లేదు. రక్త నాళాలను పట్టుకోవడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం నర్సులకూ లేదు. చేతులపై రక్త నాళాలను ఇట్టే గుర్తించే ‘క్రిష్టీ వీన్ వ్యూయర్’ అనే పరికరాన్ని అమెరికాకు చెందిన ‘క్రిష్టీ మెడికల్ హోల్డింగ్స్’ కంపెనీ తయారు చేసింది. ‘ఇన్ఫ్రారెడ్’ లైట్‌ను విడుదల చేయడం ద్వారా ఈ పరికరం చేతి చర్మం కిందనున్న రక్త నాళాలను వాటిలో ప్రవహించే హిమోగ్లోబిన్ ద్వారా గుర్తించి, రక్తనాళాల అమరిక ఫొటోతీసి చర్మం ఉపరితలంపై ప్రసరింపచేస్తోంది. ఆ ఫొటో ద్వారా అవసరమైన రక్తనాళాన్ని దొరకబుచ్చుకొని సూది మందులను శరీరంలోకి ఎక్కించడం ఎంతో సులభం. ప్రయోగాత్మకంగా ఈ పరికరాన్ని ఉపయోగించి చూసిన అమెరికాలోని కొన్ని ఆస్పత్రులు పరికరం పనితీరును ప్రశంసిస్తున్నారు. -
'సిరంజ్' నిర్వాకంపై విచారణకు ఆదేశం
హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. అయిదుగురు చిన్నారులకు..నర్సులు ఒకే సిరంజ్‌తో ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరంజ్ మార్చేందుకు నిర్లక్ష్యమో లేక బద్దకమో తెలియదు కానీ. ...అయిదేళ్ల లోపు చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు విధుల్లో ఉన్న నర్సులు ఒకే సిరంజ్ వాడారు. దాంతో చిన్నారులకు వైద్యం వికటించి... చేతులకు వాపులు రావటంతో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్పందించిన సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పిన వైద్యులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా సుమారు 35మంది చిన్నారులకు ఒకే సిరంజ్ ద్వారా ఇంజెక్షన్లు చేసినట్లు సమాచారం. -
ఇంజక్షన్ వికటించి ఒకరి మృతి
సారంగాపూర్ : ఇంజక్షన్ వికటించిన సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలోకలిశాయి. బంధువులు, గ్రామస్థుల కథనం.. రేచపల్లి గ్రామానికి చెందిన కల్లూరి రాజేశం(55)కు కాలుకు నొప్పి రావడంతో చికిత్స కోసం గ్రామానికి చెందిన ఆమానుల్లాఖాన్ అనే ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆయన రాజేశంను పరీక్షించి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చాడు. మూడు నిముషాల వ్యవధిలో రాజేశం మూత్రవిసర్జన చేసుకుని అక్కడిక్కడే కుప్పకూలి మృతిచెందాడు. విషయాన్ని అక్కడికి వచ్చిన కొంతమంది రోగులు మృతుడి కుమారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కొడుకులు చిరంజీవి, సంజీవ్ అక్కడి చేరుకున్నారు. గ్రామస్థులు అక్కడిచేరుకొని చికిత్స చేసిన ఆమానుల్లాఖాన్‌ను నిలదీశారు. అనంతరం చితకబాదారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి రోడ్డుపై విసిరేశారు. గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టు ఇన్చార్జి కరుణాకర్ నిందితుడు ఆమానుల్లాఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాలకు తరలించారు. 15 సంవత్సరాలుగా... ఇంజక్షన్ వికటించి కల్లూరి రాజేశం మృతిచెందిన సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాలకు చెందిన ఆమానుల్లాఖాన్ 15 సంవత్సరాలుగా గ్రామంలో క్లినిక్ పెట్టి నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లోపతి, ఆయుర్వేద మందులు ఇస్తూనే భూతవైద్యం చేస్తున్నట్లు ఆరోపించారు. నాణ్యత లేని మందులు ఇస్తూ.. చిన్న చిన్న జ్వరాలకూ కనీసం రెండువేల ఫీజు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజేశంకు ఎక్కువ డోజ్ ఉన్న ఇంజక్షన్ ఇవ్వడంతో మృతిచెందాడని బంధువులు ఆరోపించారు.