నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ
ఎంజీఎం (వరంగల్): వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు తాగి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్‌గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్‌ఎల్‌ఐ 540ఎల్ బ్యాచ్‌కు చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్స్‌ను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వినియోగించకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి ఆదేశాలు జారీ చేశారు.
వెలుగు చూసింది ఇలా....
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, పరిపాలనాధికారుల ఆదేశాలతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా అయిన యాంపిల్స్ మాత్రమే చూపించి, స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్‌ను బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్‌లోనే ఫంగస్ వచ్చింది. ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యూంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది.
ఆ ఇంజక్షన్ నాసిరకం
Published Tue, Jul 26 2016 3:57 AM | Last Updated on Fri, May 25 2018 2:57 PM
Advertisement
Advertisement