వివరాలను వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్ సుభాన్
నెల్లూరు(క్రైమ్): ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన కేసులో ఆర్‌ఎంపీ డాక్టర్‌ను ఆదివారం నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్‌సుభాన్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన కె.రాంబాబు జ్వరంగా ఉండటంతో గతేడాది జూలై 13వ తేదీన పెద్దబజారు డైకస్‌రోడ్డులోని ఆర్‌ఎంపీ వైద్యుడు మిల్టన్‌కుమార్ భౌమిక్ వద్దకు వెళ్లాడు.
ఆర్‌ఎంపీ అతడిని పరీక్షించి ఇంజెక్షన్ వేశాడు. కొద్దిసేపటికి రాంబాబు క్లీనిక్‌లోనే కుప్పకూలడంతో వైద్యుడు హుటాహుటిన అతడిని ఆటోలో రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రాంబాబును పరీక్షించిన డాక్టర్లు అతను మృతిచెందాడని నిర్ధారించారు. దీంతో అప్పట్లో చిన్నబజారు పోలీసులు ఈ ఘటనపై సెక్షన్ 174 సీఆర్‌పీసీ (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదుచేశారు. ఇటీవల ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌లో రాంబాబు ఇంజెక్షన్ వికటించి మృతిచెందాడని నిర్ధారణ కావడంతో సెక్షన్ 174ను 304 (ఎ) ఐపీసీగా మార్పుచేశారు. ఆదివారం నిందితుడైన మిల్టన్‌కుమార్ భౌమిక్‌ను అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment