తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: కబ్జాదారుల కళ్లు ప్రభుత్వ భూములపైనే పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పేరూరులో పాగా వేసిన కబ్జాదారులు ప్రస్తుతం మల్లంగుంటపై దృష్టి సారించారు. కాలువ కశిం గడ్డను రెండు ఎకరాల మేర ఆక్రమించేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారులు స్పం దించడంతో వారి ప్రయత్నం విఫలమైంది. తిరుపతి రూరల్ మండల తహశీల్దార్ వెంకటరమణ కథనం మేరకు..
మల్లంగుంటకు చెందిన వీరరాఘవయ్య, గంగయ్య శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు జేసీబీలతో సర్వే నెం బర్ 150/,151లో 10 అడుగుల కాలువ కశిం గడ్డను ధ్వంసం చేసి చదును చేశారు. 20 అడుగుల లోతు కాలువను సగం మేర పూడ్చి వేశా రు. 40 అడుగుల వెడల్పుతో రెండు పర్లాంగుల మేర స్థలాన్ని (2.5 ఎకరాలు) ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో 1993లో ప్రభుత్వం 11 మందికి ఈ భూమిలో పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. పట్టాలు చూపాలని అధికారులు కోరగా, అవి కోర్టులో ఉన్నాయని తెలి పారు.
స్థానిక కోర్టు ఇంజక్షన్ ఇచ్చినట్లు చెప్పా రు. కశిం గడ్డలో పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ భూమిలోకి వస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కట్టడాల కోసం తెప్పించిన సిమెంటు ఇటుకలు, ఇసుకను ఇక్కడి నుంచి తరలించాలని తహశీల్దార్ వెంకటరమణ ఆదేశించారు. ఈ భూమి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదిలావుండగా కశిం గడ్డకు దక్షిణం వైపు ఉన్న స్థలం తమదంటే తమదని మైనారిటీలు, మల్లంగుంట గ్రామస్తులు కూడా ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. దీనిపై కేసు నడుస్తోంది. కాలువ కశింగడ్డ తమ ఆధీనంలోనే ఉందని మైనారిటీలు కొంతమంది తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
వీఆర్‌వో, వీఆర్‌ఏ సహకారంతోనే
వీఆర్‌వో, వీఆర్‌ఏల సహకారంతోనే ఆక్రమణదారులు కబ్జాకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. 2రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా వీఆర్‌వో, వీఆర్‌ఏలు స్పందించలేదని తెలి పారు. ఆర్‌ఐ వాసుకు సమాచారమివ్వగా సో మవారం తహశీల్దార్ వెంకటరమణ, వీఆర్‌వో నాగరాజు, వీఆర్వే ఈశ్వరయ్య అక్కడికి చేరుకు ని ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
ప్రభుత్వ స్థలాలపైనే గురి
Published Tue, Oct 1 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement