Public places
-
నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
నాగోలు: జనావాసాల మధ్య..ఉదయం 6 గంటలకే మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్చల్ చేశారు. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్ రోడ్డుకు కారులో వచ్చారు.కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్చల్ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్ వాక్కు వచ్చిన వాకర్స్ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో యువతీయువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నారు.వాకర్స్‌లో ఒకరు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా యువతి అతని వద్ద నుండి ఫోను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను కొందరు వాకర్స్ వీడియోలు తీయగా వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. . కాగా వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని తెలిసింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్‌ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!
ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో. ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్‌కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్‌లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు. పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్‌కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది? వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’. ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్‌టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్‌లను కాని, వాకింగ్ ట్రాక్‌లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి. స్త్రీల నిర్వహణ పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్‌కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్‌ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు. ప్రతి ఊరిలో అవసరం బిజీ లైఫ్‌లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్‌లు రావాలని ఆశిద్దాం. -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
రూ.3 కోట్ల బెంట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పేరెంట్స్.. తుపాకీతో కొడుకు హల్చల్!
చండీగఢ్: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్ ప్రాంతానికి చెందిన శుభమ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్ లైసెన్స్ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్ జర్నల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్ చేయటం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ గన్‌తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి. #Punjab: Elated after being gifted a Bentley car from his parents, Mohali youth opens fires in the air; booked after video went viral on social media.#Viral #bentley #Car #Gift #Boy #Mohali #India #ViralVideo #fire pic.twitter.com/wjGAFkJEVo — Free Press Journal (@fpjindia) October 18, 2022 ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు! -
'ఈ నగరానికి ఏమైంది...?. ఎవరూ నోరు మెదపరేం’
ఈ నగరానికి ఏమైంది...?. ఒకవైపు పొగ... మరోవైపు ధూళి. ఎవరూ నోరు మెదపరేం’ అంటూ అటు టీవీల్లో, ఇటు సినిమా హాళ్లల్లోనూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ప్రకటనల మాటేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదన్న చట్టం చేసి పదేళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. పొగ రాయుళ్లు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ చుట్టుపక్కల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నారు. ఈ విషయమై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కర్నూలు(హాస్పిటల్) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 అక్టోబర్ 2న సిగరెట్స్ అండ్ టుబాకో ప్రొడక్ట్స్ యాక్ట్(సీఓటీపీఏ–2008)ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. దీనిని అతిక్రమిస్తే రూ.200 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొందరు పోలీసులకు ఈ చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కొందరు పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) ప్రతి నెలా రూ.5 కోట్ల వ్యాపారం జిల్లాలో బీడీ, సిగరెట్, చుట్ట విక్రయాలు తగ్గడం లేదు. ధర ఎంతైనా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. ముఖ్యంగా వీటి టోకు వర్తక వ్యాపారులు కర్నూలు నగరంలోని పాతబస్తీలో అధికంగా ఉన్నారు. ఇక్కడి నుంచే నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ, శ్రీశైలం వంటి ప్రాంతాలకు పలువురు చిన్న తరహా డీలర్లు తీసుకెళ్లి అక్కడి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి నెలా జిల్లాలో రూ.5 కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతోందని అంచనా. పొగాకు ఉత్పత్తులతో వ్యాధులు.. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైటిస్, ఆయాసం, సీఓపీడీ, గుండెజబ్బులు, రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రక్త క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. బీడీ, సిగరెట్, చుట్టలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా వాటిని వాడిన వారు వదిలే పొగను పీల్చినా పైన చెప్పిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమపానం.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చట్టం చెబుతున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. బస్టాండ్, టీ కొట్లు, రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్సులలో ధూమపానం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలురు సైతం ఈ దురలవాటుకు బానిసలు కావడం బాధాకరం. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ వీటిని విక్రయిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టం ఏమి చెబుతుందంటే.. ►బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి ►పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు ►ధూమపానం అలవాటు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ►రైతులు, వ్యాపారులు, రెస్టారెంట్ యజమానులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ►రెవెన్యూ, పోలీస్, వైద్యులు కలిసి అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో దాడులు నిర్వహించి పొగతాగే వారికి జరిమానాలు విధించాలి. పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం బీడీ, సిగరెట్, చుట్ట తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగడం వల్ల సీఓపీడీ(క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), క్యాన్సర్ వస్తుంది. 84 శాతం పొగతాగేవారు సీఓపీడీ వల్ల, 83 శాతం క్యాన్సర్ భారిన పడుతున్నా రు.దీంతో పాటు హార్ట్ ఎటాక్, కడుపు, నోటి క్యా న్సర్ వస్తాయి. పొగతాగడం వల్ల ఆస్టియోపోరోసిస్(ఎముకలు బలహీనపడటం) వస్తుంది. – డాక్టర్ వరప్రసాద్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, కర్నూలు -
ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసన అంటే కుదరదు
న్యూఢిల్లీ: నిరసనలు తెలిపే హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చెయ్యడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రజా జీవితానికి భంగం కలిగేలా ఒకే ప్రాంతంలో రోజుల తరబడి నిరసనలు తెలపడం సరికాదని పేర్కొంది. గత ఏడాది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ ఆందోళనల సమయంలో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ, దానిని సమీక్షించాలంటూ షహీన్‌బాగ్ వాసి కనీజ్ ఫాతిమాతో పాటు మరి కొందరు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. ఏదైనా అంశంపై అప్పటికప్పుడు నిరసన ప్రదర్శనలు జరపడం ప్రజాస్వామిక హక్కు అని, అయితే ఎక్కువ రోజులు బహిరంగ ప్రదేశాలను ఆక్రమిస్తూ ఇతరుల హక్కులకి భంగం వాటిల్లేలా నిరసనలు చేయడం కుదరదని చెప్పింది. ‘‘ప్రభుత్వ విధానాలపై నిరసనలు చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంగా వచ్చిన హక్కు. పౌరులకు హక్కులే కాదు ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా కూడా వ్యవహరించాలి. అప్పటికప్పుడు ఎవరైనా నిరసన తెలపవచ్చు. కానీ ఎక్కువ రోజులు ఇతరుల హక్కుల్ని భంగపరుస్తూ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించకూడదు’’అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపైనే రెండు నెలలకు పైగా రైతులు నిరసనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మళ్లీ ఇలాంటి తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఓపెన్ కోర్టుని నియమించాలన్న అభ్యర్థనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. -
లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సాధ్యమైనంత వరకూ మెట్ల మీదుగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలని, మెట్లు ఎక్కడం లో ఇబ్బందులుంటే తప్ప లిప్టు వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చే సింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీచేసింది. లిప్టులో ఒకేసారి నలుగురికం టే ఎక్కువమంది వెళ్లకూడదనీ, ఒకరికొకరు ఎదురెదురుగా కాకుండా, లిఫ్టు గోడల వైపు తమ ముఖం ఉండేలా నిలబడాల ని సూచించింది. అం దరూ ఒకేచోట చేరి మూకుమ్మడిగా భో జనాలు చేయకూడ దు. వేర్వేరు సమయాల్లో భోజనానికి వెళ్లేలా ఏర్పాట్లు చే యాలి. ఒకేచోట ఎ క్కువమంది గుమిగూడి మాట్లాడుకోవడాన్ని నిలిపివేయాలి. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాల ను నిర్వహించుకోవాలని సూచించింది. ఇతర ఉ ద్యోగుల సెల్ఫోన్లను, గదులను, డెస్కులను వాడకూడదని, వాడాల్సి వస్తే వాటిని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరిచాకే తాకాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ వాడొద్దు... సాధ్యమైనంత వరకు కొంతకాలం వరకూ సెంట్రలైజ్డ్ ఏసీని వినియోగించకపోవడమే మంచిదని కేం ద్రం సూచించింది. ఉద్యోగులందరూ ఒకేసారి ఒకే గేటు ద్వారా ప్రవేశించకుండా, వేర్వేరు ద్వారాల నుంచి ఆఫీసులోకి ప్రవేశించాలని కోరింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో కలిసిమెలిసి తిరిగిన ఉద్యోగి ఎవరైనా ఉంటే, వారు స్వయంగా హోంక్వారంటైన్ లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటి వ్ వస్తేనే ఆఫీసుకు రావాలని తెలిపింది. డెస్కులు, కుర్చీలను దూరం దూరంగా జిగ్‌జాగ్ పద్ధతిలో వే యాలని కోరింది. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒకవేళ దగ్గు, తుమ్ములు వస్తే కర్చీఫ్ లే దా టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. కం ప్యూటర్ కీబోర్డులు, ఫోన్లు, ఆఫీసుల్లో ఎక్కువమం ది పలుసార్లు తాకడానికి అవకాశమున్న ప్రాంతాలను, వస్తువుల పైభాగాన్ని శానిటైజ్ చేయాలి. -
ఇక నుంచి లౌడ్స్పీకర్లు బంద్..!
చంఢీగర్ : అవసరం ఉన్నా.. లేకపోయినా.. అంతెత్తు లౌడ్‌స్పీకర్ల హోరుతో ప్రజల అనారోగ్యానికి కారణమయ్యేవారికి ఇక మూడినట్లే..! బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిషేదిస్తూ పంజాబ్-హరియాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు కూడా లౌడ్స్పీకర్లను వాడాలంటే రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆద్యాత్మిక కేంద్రాల్లో కూడా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లు పెట్టరాదని వెల్లడించింది. ఏడాది మొత్తంలో పండుగల సమయంలో 15 రోజులు లౌడ్‌స్పీకర్ల వాడకానికి వెసులుబాటు కల్పించింది. పండుగల సమయంలో రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వాడుకోవచ్చని తెలిపింది. జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హరీందర్ సింగ్ సిద్ధూ ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా... శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
‘నమాజ్‌లను అడ్డుకున్న హిందూ సంస్థలు’
సాక్షి, న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌లు చేయడాన్ని తాము పలుచోట్ల అడ్డుకున్నామని హర్యానాలోని గుర్గావ్కు చెందిన హిందూ సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్గావ్ సమీపంలో 10 బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లను సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమితిలో భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, శివ్‌సేన, హిందూ జాగరణ్ మంచ్ తదితర పన్నెండు హిందూ సంస్థలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అఖిల భారత హిందూ క్రాంతి దళ్ జాతీయ సమన్వయకర్త రాజీవ్ మిట్టల్ పేర్కొన్నారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని ప్రార్థనలు జరుపుకోవాలని తాము కోరామని, ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్య ఎక్కడా తలెత్తలేదని చెప్పారు. కాగా, గుర్గావ్ సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో 700 మంది మస్లింలు ఇటీవల బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని స్ధానికులు నిలిపివేసిన నేపథ్యంలో తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలంలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటున్నారని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు. -
ముగిసిన ‘క్రమబద్ధీకరణ’!
చివరి రోజు పెరిగిన రుసుం చెల్లింపులు మూడు పర్యాయాలు గడువు పెంచినా స్పందన అంతంతే మరో రెండు నెలల గడువు కోసం ప్రతిపాదనలు సిటీబ్యూరో : ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్ధీకరించుకునేందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నోటీసు అందుకున్న వారు బ్యాంక్‌లో ఈ-చలాన్ చెల్లించేందుకు బారులు తీరారు. ప్రభుత్వం మూడు పర్యాయాలు గడువు పెంచినా క్రమబద్ధీకరణ అంతంత మాత్రంగానే కొనసాగింది. మరోవైపు కొత్త దరఖాస్తులకు అవకాశం, రుసుం చెల్లింపులో వెసులుబాటుపై పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు రావడంతో...మరో రెండు మాసాలు గడువు పెంచాలని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాస్తవంగా 59 జీవో కింద 956 దరఖాస్తులు రాగా అందులో కేవలం 387 మాత్రమే అర్హత సాధించారుు. మరోవైపు జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న సుమారు 4,841 దరఖాస్తులు సర్వే నివేదికల ఆధారంగా 59 జీవో కిందకు మార్చారు. దీంతో పేదలపై ఆర్థిక భారం పడినట్లరుుంది. అధికారులు డోర్ టూ డోర్ విచారణ జరిపి ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమతపై నివేదిక సమర్పించడంతో కేటగిరి మార్పు తప్ప లేదు. ముఖ్యంగా అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట, ఖైరతాబాద్, గోల్కొండ, మారేడుపల్లి తదితర మండలాలలోని ఆక్రమిత ఇళ్ల కేటగిరిలో మార్పు చోటుచేసుకుంది. దీంతో కేటగిరి మారిన వారు క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించేందుకు పెద్దగా అసక్తి కనబర్చనట్లు తెలుస్తోంది. నోటీసులకు స్పందన కరవు జిల్లా యంత్రాంగం ఆక్రమిత ఇళ్ల భూ క్రమబద్ధీకరణ కోసం అర్హులైన దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన కరువైంది. మొత్తం మీద 3,647 మంది దరఖాస్తు దారులకు నోటీసులు జారీ చేస్తే..100 శాతం రుసుం చెల్లించిన వారు 590 మందికి మించలేదు. 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న 150 మందికి, 58 నుంచి 59 కేటగిరిలోకి మార్పు చెందిన 3,311 కుటుంబాలకు నోటీసు జారీ చేసినా..కొద్ది మంది మాత్రమే రుసుం చెల్లించేందుకు ముందుకు వచ్చారు. జీవో 92కు కూడా అంతంతే.. జీవో నంబర్ 92 కింద స్పందన అంతంత మాత్రంగానే మారింది. గడువు పెంపు అనంతరం కేవలం 148 మంది మాత్రమే రుసుం చెల్లించినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నారుు. అధికారులు సుమారు 372 మందికి నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోరుుంది. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
సీపీ సుధీర్‌బాబు వరంగల్ : నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లోని బహిరంగప్రదేశాలు, మద్యం షాపుల ముందు మందు బాబులు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సీపీ గురువారం పత్రికలకు ప్రకటన జారీ చేశారు. విచ్చలవి డిగా మద్యం సేవిస్తున్నందున నగరంలోని ప్రజలతో పాటు మహిళ లు, విద్యార్థులు, పిల్లలు, ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. వీరి వల్ల అభద్రతాభావం వ్యక్తం అవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించిన ట్లు తెలిసింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 144 ప్రకారం 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని ని షేదిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నిషేదిత ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తులపై ఇప్పటి వరకు 220 కేసులు నమోదు చేయడంతో పాటు 238 మంది మ ద్యపాన ప్రియులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరికి కోర్టు రూ.40,640 జరిమానా విధించింది. ఈ నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో గస్తీ ముమ్మ రం చేశారు. ఇందుకోసం ప్రతి పోలీ ‹స్డివిజన్ పరిధిలో ప్రత్యేక బృం దా లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసభ్యం గా ప్రవర్తించినా 100 నంబర్‌కు డయల్ చేయాలని,లేక 9491089257 వాట్స ప్ నంబర్‌కు ఫొటోలు, వీడియో, సమాచారం అందిస్తే వెంటనే చర్య లు తీసుకుంటామని సీపీ తెలిపారు. -
సెప్టెంబర్ నుంచి ఉచిత వైఫై
కేకేనగర్: పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత వైఫై పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఎన్నికల వాగ్ధానాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఉచిత వైఫై సౌకర్యానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ మొదటి విడతగా 32 జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, పార్కులు, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం ఏజెంట్ల ద్వారా టెండర్లను కోరినట్లు దీనికి ఉపకరణాలు, సర్వర్, డేటా వంటివి అందజేసే ఏజెన్సీలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి లభించే ఆదరణ బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తామని అధికారులు తెలిపారు. -
కబ్జాలపాటి
శాతవాహన కళాశాల స్థలం కబ్జాకు వ్యూహం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం అధికార పార్టీ పెద్దల ప్రమేయం అమరావతి : విజయవాడ నగరంలో అధికార పార్టీ నేతల కబ్జాలు మితిమీరుతున్నాయి. కంటికి కనిపించిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ పెద్దలు... ఇప్పుడు ప్రైవేటు స్థలాల పైనా కన్నేశారు. సర్వోత్తమ న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాల పర్వానికి ‘శాతవాహన కళాశాల’ స్థల వివాదం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, వారికీ కబ్జాలో వాటా ఇస్తుండటంతో.. అధికార పార్టీ నేతల కబ్జాలను చూస్తూ ఊరుకోవాల్సిందేనంటూ అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. వివాదం తేలే వరకు శాతవాహన కళాశాల స్థలం విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించి అధికార పార్టీ నాయకులు స్థలాన్ని కబ్జా చేయడానికి ఒక్కో అడుగూ వేస్తూ పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. వివాదం తేలే వరకు ఎలాంటి కార్యకలాపాలూ ఆ స్థలంలో నిర్వహించడానికి వీల్లేకపోయినా.. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి శాతవాహన కళాశాల కమిటీ కార్యదర్శి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుమతి ఇవ్వడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏకపక్షంగా ఎగ్జిబిషన్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ స్థలం అసలు యజమాని అభ్యంతరం చెప్పినా.. అధికార పార్టీ నేతలు లక్ష్యపెట్టలేదు. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించారని బెజవాడలో ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి న్యాయం చేయండి మహాప్రభో.. అంటూ జిల్లా కలెక్టర్ మొదలు అధికార యంత్రాంగాన్ని వేడుకున్నా... ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ‘ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు.. తర్వాత స్థలాన్ని కబ్జాచేసి పారేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా? అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతే.. ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ బాధితులు అధికారుల వద్ద వాపోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వివాదం ఇదీ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-11లో ఉన్న 5.10 ఎకరాల భూమిని దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి 1974లో విక్రయించడానికి స్థలం యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు ‘షరతులతో కూడిన ఒప్పందం’ చేసుకున్నారు. పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలుగా సొసైటీతో ఒప్పందం చేశారు. ఒప్పందం జరిగింది కానీ.. భూమిని సొసైటీకి అప్పజెప్పడం కానీ, విక్రయ రిజిస్ట్రేషన్ కానీ చేయలేదు. భూమిని తమకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వమని కోరుతూ 1991లో సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూమిపై సొసైటీకి హక్కులేదని సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. జిల్లా కోర్టు కూడా ఈ తీర్పునే సమర్థించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటంలో అప్పారావు గెలిచారు. తాము చెల్లించిన సొమ్ము వడ్డీ సహా చెల్లించమని సొసైటీ చేసిన డిమాండ్‌కు అప్పారావు సానుకూలంగా స్పందించడంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు లోక్ అదాలత్ అవార్డు కూడా ఇచ్చింది. సొసైటీకి అప్పారావు రూ.9 లక్షలు చెల్లించారు. ఆలపాటి రాజా ఎంట్రీ... వివాదాస్పద స్థలంపై 2011లో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కన్నుపడింది. దీంతో సొసైటీ కార్యదర్శిగా ఉన్న కామేశ్వరరావు రాజీనామా చేయడం, తర్వాత రోజే సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి. సొసైటీ కార్యదర్శి మార్పు చెల్లదంటూ మాజీ కార్యదర్శి జగపతిరావు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. సొసైటీ కార్యదర్శిగా ఆలపాటి రాజా నియామకం/నామినేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. సొసైటీ కార్యదర్శిగా కొనసాగడానికి అవకాశం లేకపోవడంతో.. అదే సొసైటీ నడుపుతున్న శాతవాహన కళాశాల కార్యదర్శి/కరెస్పాండెంట్‌గా ఆయన తెరపైకి వచ్చారు. ఏదో రకంగా సొసైటీని గుప్పెట్లో పెట్టుకొని స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. భూమి యజమాని, సొసైటీ మధ్య రాజీ కుదరలేదని, ఫోర్జరీ సంతకాలు చేశారంటూ సొసైటీ కార్యదర్శి కామేశ్వరరావు మళ్లీ కేసు దాఖలు చేశారు. ఈ కేసు వేయడం వెనక ఆలపాటి రాజా ఉన్నారని సమాచారం. ఈ కేసును హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భూమి యజమాని అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దయిపోయింది దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న శాతవాహన కళాశాలను కార్యదర్శి, కరస్పాండెంట్‌గా టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని, సొసైటీ సభ్యుల్లోనూ తీవ్ర విభేదాలున్నాయని, సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివాదాలు ముగిసే వరకు ప్రత్యేక అధికారికి సొసైటీ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్‌తో పాటు ఉన్నత విద్యా శాఖ న్యాయవాది కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో శాతవాహన కళాశాల యాజమాన్యాన్ని రద్దు చేసి, బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సునీత దావ్రా 2015 మార్చి 17న ఉత్తర్వులు (జీవో-84) జారీ చేశారు. ఏం జరిగిందో.. ఏమో.. సరిగ్గా 10 రోజులకు జీవో-84ను పక్కన (అబేయన్స్‌లో) పెడుతూ మరో ఉత్తర్వును (జీవో-97) జారీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన పలుకుబడితో ఉత్తర్వులను రద్దు చేయించారని ఉన్నత విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఎగ్జిబిషన్‌కు అనుమతి సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్థలం తమ చేతుల్లో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని ప్రశ్నిస్తూ అప్పారావు ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు స్పందించడం లేదు. -
'ప్రైవేటు స్థలాల్లో అసభ్యత నేరం కాదు'
ముంబయి: బహిరంగ ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడటం భారతీయ చట్టం ప్రకారం నేరం కాబోదని బొంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన 13మందికి విముక్తి కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న ముంబయిలోని అంధేరి పరిధిలోని ఓ ఫ్లాట్ లో చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగేలా కొందరు వ్యవహరించారు. అశ్లీలాన్ని తలపించేలా దుస్తులు ధరించి ఆరుగురు మహిళలు, పీకల దాకా మద్యం తాగి 13 మంది వ్యక్తులు గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని నానారచ్చ చేశారని ఓ పాత్రికేయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దృశ్యాలు కిటికీలో నుంచి అందరికీ కనిపించి ఇబ్బందిని కలిగించాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. అయితే, దీనిని బాధితులు కోర్టులో సవాల్ చేయగా ఈ సెక్షన్ కింద కేవలం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మాత్రమే శిక్షించగలం తప్ప ప్రైవేటు ప్లేస్ లలో వ్యక్తిగత స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే వెసులుబాటు లేదని కోర్టు తెలిపింది. -
సర్కారీ జాగాలో తమ్ముళ్ల పాగా
- గుంటూరు స్వర్ణభారత్ నగర్లో నిరుపేదలను అడ్డుకొని ఆక్రమణ - మంత్రి ఆదేశాలతోనే బీఫారాలు ఇచ్చామంటున్న రెవెన్యూ అధికారులు సాక్షి, గుంటూరు : తెలుగుతమ్ముళ్ల ఆగడాలకు అడ్డ్డులేకుం డాపోతోంది. గుంటూరు నగర శివారులో రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. వీరికి ఓ మం త్రి అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను ర క్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రే అక్రమార్కులకు అండగా నిలవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్ణభారత్ నగర్ మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతామంటూ పోలీస్స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలను పరిశీలిస్తే... స్వర్ణభారత్ నగర్ మెయిన్‌రోడ్డులో గతంలో కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకుని ని వాసం ఉంటున్నారు. ఆ మధ్య అగ్ని ప్రమా దం జరగడంతో గుడిసెలన్నీ దగ్ధమై అంతా రోడ్డు పాలయ్యారు. వీరికి అక్కడే సి-బ్లాక్‌లో బీ ఫారాలు ఇచ్చి పంపారు. అప్పటి నుంచి అక్కడ సుమారు ఎకరా భూమి ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ముస్లిం పిల్లల కోసం మదరసా ఏ ర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని ఖాళీగానే ఉంచారు. కొంత స్థలం లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. మిగతా స్థలం ఖాళీగా ఉండటంతో ఇటీవల అదే కాలనీకి చెందిన కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు వారిపై దాడులు చేసి గాయపర్చడమేకాకుండా, పోలీసులకు ఫి ర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లనిర్మాణం చేపడుతున్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ అధికారులు బీ ఫారాలు మంజూరు చేయగా, మరికొందరికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులు వీఆర్ఓ, తహశీల్దార్‌ను నిలదీయడంతో తడబాటుకు గురయ్యారు.ఈ విషయంపై గుంటూ రు రూరల్ మండల తహశీల్దార్ శివన్నారాయణమూర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించాననీ, పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. మంత్రి సిఫార్సుతోనే బీఫారాలు.. జిల్లాకు చెందిన ఓ మంత్రి లేఖ పంపడంతో రెవెన్యూ అధికారులు సుమారు 40 మందికి బి ఫారాలు ఇచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ఒక్కో బి ఫారం పట్టాకూ రూ.3 లక్షల చొప్పున మంత్రికి ముడుపులు అందాయని రెవెన్యూ అధికారులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. -
పక్కా ప్లాన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మొన్న ఇస్కాన్‌సిటీ పరిధిలో రూ.10 కోట్లు విలువజేసే కార్పొరేషన్ స్థలాన్ని కొందరు అమ్మి సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో కబ్జా బాగోతం బయటపడింది. తాజాగా నెల్లూరు శివారు ప్రాంతమైన జనార్దన్‌రెడ్డి కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కార్పొరేషన్‌లోని ఓ బడా టీడీపీ నేత, అతని అనుచరులు పథకం వేశారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో కబ్జా బాగోతం కాస్త బయటకు పొక్కింది. వివరాల్లో కెళితే... నగరంలోని 54వ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 2062/3లో సుమారు 2.50 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కాలనీ పరిధిలోనే మరో 2.50 ఎకరాలను సైతం ఆక్రమించుకునేందుకు పథకం పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లు వేసి విక్రయించారు. అందులో ఒక ప్లాటులో రేకుల షెడ్డు కూడా నిర్మించారు. ఒక్కొక్కరుగా స్థలాలను ఆక్రమించుకుంటుండడంతో స్థానికులు అధికారులను కలిశారు. తాము ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు లేకుండా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, తమకు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టాలని పలుమార్లు కోరారు. అయితే అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.5 కోట్లకు టెండర్ పెన్నా తీరం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ముచేసుకునేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూలోని ఓ అధికారి ద్వారా ఈ తంతంగాన్ని పూర్తి చేసి సొమ్ము చేసుకునేందుకు అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఒక్కొక్క ప్లాటును విక్రయించుకుంటూ సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పచ్చ జెండాలు పాతినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలం అంతా హద్దులు ఏర్పాటు చేస్తుండడంతో విషయం తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము ఏళ్ల తరబడి ఉంటున్నామని, ప్రభుత్వ స్థలాన్ని మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కసారిగా స్థానికులంతా గుమికూడా నిలదీయడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూలదోయాలని, అదేవిధంగా హద్దులు చెరిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న హిజ్రాలు కొందరు రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రభుత్వ పథకాలు తమకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వేస్తున్నారు..
బెల్లంపల్లి : ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. మూడు ట్రా క్టర్ల ఇసుక.. రూ.ఆరు వేలు అన్న చందంగా దందా సా గుతోంది. కొందరు కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమాను లు బెల్లంపల్లి, కాసిపేట, నె న్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి, భీమిని, తాండూర్ మండలాల్లోని వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. తవ్వకాల కేంద్రాలివీ.. వేమనపల్లి శివారులోని ప్రాణహిత నది, కొత్తపల్లి వాగు, నీల్వాయి వాగులో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. నెన్నెల మండలంలో కుమ్మరివాగు, మెట్పల్లి వాగు, నందులపల్లి వాగులో, తాండూరు మండలంలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వేస్తున్నారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి, శాంతిఖని, గురిజాల, పెర్కపల్లి, బట్వాన్పల్లి, చాకెపల్లి, చంద్రవెల్లి, చర్లపల్లి శివారులలోని అటవీ ప్రాంతం నుంచి, ప్రభుత్వ స్థలాల్లోని వాగుల నుంచి ఇసుకను తీసుకెళ్తున్నారు. భీమిని మండలం కన్నెపల్లి, జజ్జరవెల్లి, రాంపూర్, కాసిపేట మండలం పెద్దనపల్లి, దేవాపూర్ వాగుల నుంచి భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. నెన్నెల మండలంలో ట్రాక్టర్ లోడ్‌కు రూ.500, వేమనపల్లిలో రూ.600, కాసిపేటలో రూ.800, తాండూర్‌లో రూ.1,200, భీమినిలో రూ.800, బెల్లంపల్లిలో రూ.1800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తుండడంతో ఎప్పటికప్పుడు ధర పెరుగుతోంది. ఇసుక అక్రమ తరలింపుపై సుప్రీంకోర్టు నిషేధం ఉండడంతో కొందరు అవినీతి అధికారుల పంట పండుతోంది. ప్రతీ నెల కొంత మొత్తం ముట్టజెప్పడానికి ట్రాక్టర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
ప్రభుత్వ స్థలాలపైనే గురి
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: కబ్జాదారుల కళ్లు ప్రభుత్వ భూములపైనే పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పేరూరులో పాగా వేసిన కబ్జాదారులు ప్రస్తుతం మల్లంగుంటపై దృష్టి సారించారు. కాలువ కశిం గడ్డను రెండు ఎకరాల మేర ఆక్రమించేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారులు స్పం దించడంతో వారి ప్రయత్నం విఫలమైంది. తిరుపతి రూరల్ మండల తహశీల్దార్ వెంకటరమణ కథనం మేరకు.. మల్లంగుంటకు చెందిన వీరరాఘవయ్య, గంగయ్య శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు జేసీబీలతో సర్వే నెం బర్ 150/,151లో 10 అడుగుల కాలువ కశిం గడ్డను ధ్వంసం చేసి చదును చేశారు. 20 అడుగుల లోతు కాలువను సగం మేర పూడ్చి వేశా రు. 40 అడుగుల వెడల్పుతో రెండు పర్లాంగుల మేర స్థలాన్ని (2.5 ఎకరాలు) ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో 1993లో ప్రభుత్వం 11 మందికి ఈ భూమిలో పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. పట్టాలు చూపాలని అధికారులు కోరగా, అవి కోర్టులో ఉన్నాయని తెలి పారు. స్థానిక కోర్టు ఇంజక్షన్ ఇచ్చినట్లు చెప్పా రు. కశిం గడ్డలో పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ భూమిలోకి వస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కట్టడాల కోసం తెప్పించిన సిమెంటు ఇటుకలు, ఇసుకను ఇక్కడి నుంచి తరలించాలని తహశీల్దార్ వెంకటరమణ ఆదేశించారు. ఈ భూమి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదిలావుండగా కశిం గడ్డకు దక్షిణం వైపు ఉన్న స్థలం తమదంటే తమదని మైనారిటీలు, మల్లంగుంట గ్రామస్తులు కూడా ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. దీనిపై కేసు నడుస్తోంది. కాలువ కశింగడ్డ తమ ఆధీనంలోనే ఉందని మైనారిటీలు కొంతమంది తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వీఆర్వో, వీఆర్ఏ సహకారంతోనే వీఆర్వో, వీఆర్ఏల సహకారంతోనే ఆక్రమణదారులు కబ్జాకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. 2రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా వీఆర్వో, వీఆర్ఏలు స్పందించలేదని తెలి పారు. ఆర్ఐ వాసుకు సమాచారమివ్వగా సో మవారం తహశీల్దార్ వెంకటరమణ, వీఆర్వో నాగరాజు, వీఆర్వే ఈశ్వరయ్య అక్కడికి చేరుకు ని ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.