సర్కారీ జాగాలో తమ్ముళ్ల పాగా
- గుంటూరు స్వర్ణభారత్ నగర్‌లో నిరుపేదలను అడ్డుకొని ఆక్రమణ
- మంత్రి ఆదేశాలతోనే బీఫారాలు ఇచ్చామంటున్న రెవెన్యూ అధికారులు
సాక్షి, గుంటూరు : తెలుగుతమ్ముళ్ల ఆగడాలకు అడ్డ్డులేకుం డాపోతోంది. గుంటూరు నగర శివారులో రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. వీరికి ఓ మం త్రి అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను ర క్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రే అక్రమార్కులకు అండగా నిలవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్ణభారత్ నగర్ మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతామంటూ పోలీస్‌స్టేషన్‌లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలను పరిశీలిస్తే...
స్వర్ణభారత్ నగర్ మెయిన్‌రోడ్డులో గతంలో కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకుని ని వాసం ఉంటున్నారు. ఆ మధ్య అగ్ని ప్రమా దం జరగడంతో గుడిసెలన్నీ దగ్ధమై అంతా రోడ్డు పాలయ్యారు. వీరికి అక్కడే సి-బ్లాక్‌లో బీ ఫారాలు ఇచ్చి పంపారు. అప్పటి నుంచి అక్కడ సుమారు ఎకరా భూమి ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ముస్లిం పిల్లల కోసం మదరసా ఏ ర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని ఖాళీగానే ఉంచారు. కొంత స్థలం లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. మిగతా స్థలం ఖాళీగా ఉండటంతో ఇటీవల అదే కాలనీకి చెందిన కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు.
దీన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు వారిపై దాడులు చేసి గాయపర్చడమేకాకుండా, పోలీసులకు ఫి ర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లనిర్మాణం చేపడుతున్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ అధికారులు బీ ఫారాలు మంజూరు చేయగా, మరికొందరికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానికులు వీఆర్‌ఓ, తహశీల్దార్‌ను నిలదీయడంతో తడబాటుకు గురయ్యారు.ఈ విషయంపై గుంటూ రు రూరల్ మండల తహశీల్దార్ శివన్నారాయణమూర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించాననీ, పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.
మంత్రి సిఫార్సుతోనే బీఫారాలు..
జిల్లాకు చెందిన ఓ మంత్రి లేఖ పంపడంతో రెవెన్యూ అధికారులు సుమారు 40 మందికి బి ఫారాలు ఇచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ఒక్కో బి ఫారం పట్టాకూ రూ.3 లక్షల చొప్పున మంత్రికి ముడుపులు అందాయని రెవెన్యూ అధికారులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం.